పంచ ప్రణాళిక | Five plans | Sakshi
Sakshi News home page

పంచ ప్రణాళిక

Published Thu, Dec 19 2013 5:36 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

పంచ ప్రణాళిక - Sakshi

పంచ ప్రణాళిక

సాక్షి, సిటీబ్యూరో:  అభయ ఘటన అనంతరం ఉన్నతాధికారులు ఐటీ కారిడార్ భద్రతపై పూర్తిగా దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు డీసీపీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు.. ఆర్టీసీ అధికారులు, ఏపీఐఐసీ, ఎస్‌సీఎస్‌సీ (సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కౌన్సిల్)ల సహకారంతో మహిళా ఉద్యోగుల రవాణా సౌకర్యంపై అధ్యయనం చేశారు. రెండు నెలల పాటు సాగిన ఈ అధ్యయనంలో నిత్యం 40 వేల మంది ఐటీ ఉద్యోగులు ఆటో, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం ఐటీ కారిడార్‌లో 10 వేల ఆటోలు, క్యాబ్‌లు ఉన్నాయని నివేదికలో తేలింది. ఈ నేపథ్యంలో ఐటీ మహిళల కోసం ఐదంచెల భద్రతా ప్రణాళికను రూపొందించారు. ఆ వివరాలను సీవీ ఆనంద్ బుధవారం మాదాపూర్‌లో ఐటీ ఉద్యోగుల సమావేశంలో వివరించారు. సైబరాబాద్ సెంట్రల్ కాంప్లెంట్ సెల్‌ను డీజీపీ బి.ప్రసాదరావు ప్రారంభించారు.
 
 పంచ ప్రణాళిక
 1. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ
 =4 రూట్లలో 24 గంటలు ఆర్టీసీ షటిల్ సర్వీసులు
 =40 కొత్త బస్సులతో 326 ట్రిప్పులు
 =ప్రతి పది నిముషాలకు బస్సు సౌకర్యం
 =బస్సులు నిలిపేందుకు 5 ప్రాంతాలను కేటాయించిన ఏపీఐఐసీ
 =మహిళా ఉద్యోగులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని అధికారుల సూచన
 
 2. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణిస్తే..
 =క్యాబ్‌లు, ఆటోలో ప్రయాణం తప్పనిసరైతే పోలీసులు రిజిస్ట్రేషన్ చేసిన వాహనాన్నే ఎంచుకోవాలి
 =వాహనంలో డ్రైవర్ పేరు, సెల్‌నెంబర్, పోలీసు రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పరిశీలించుకోండి
 =క్యూ.ఆర్ కోడ్ స్టిక్కర్ ఉన్న ఆటోలో సురక్షితం
 =మహిళల బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే ఉంచుకోవాలి
 
 3. పెరిగిన పోలీసు పర్యవేక్షణ
 =9 ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు.
 =ఒక్కో చెక్‌పోస్టులో హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉంటారు
 =ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ పర్యవేక్షణలో 80 మంది సిబ్బందితో ఐటీ కారిడార్ పోలిసింగ్.
 =రంగంలోకి ఐదు ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాలు
 =ఒక్కో వాహనంలో హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉంటారు
 =ఇందుకోసం నెలకు ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు పెడుతుంది
 =అదనపు డీ సీపీ జానకి షర్మిళ చైర్మన్‌గా మహిళా ఉద్యోగులతో కమిటీ ఏర్పాటు
 
 4. అదనపు రక్షణ చర్యలు

 =47 సీసీ టీవీలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు
 =ఇందుకోసం ఎస్‌సీఎస్‌సీ రూ.4 కోట్లు వెచ్చించింది
 =నైట్ విజన్ సీసీ కెమెరాల ఏర్పాటు
 =సీసీటీవీ నెట్‌వర్క్ నిర్వహణ కోసం ఏపీఐఐసీ రూ.5 కోట్లు అందజేసింది
 =త్వరలో మరో 150 కెమెరాలనూ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తారు
 =మాల్స్, వ్యాపార కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు
 =150 ఐటీ కంపెనీల్లో కేవలం 82 కంపెనీలే ఎస్‌సీఎస్‌సీలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.
 =మిగిలిన కంపెనీలు కూడా సభ్యత్వం తీసుకోవాలి
 =ఉద్యోగుల కోసం ఎస్‌సీఎస్‌సీ ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు
 
 5. క్యాంపెయిన్
 =మహిళల భద్రతపై అవగాహన కలిగించేందుకు లఘు చిత్రాల తయారీ
 =ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నటించిన లఘు చిత్రంతో ప్రచారం
 =కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో మహిళలకు చైతన్యం కలిగించడం
 =సైబరాబాద్ మహిళా హెల్ప్‌లైన్ నెంబర్ 94947 31100
 =సోషల్ మీడియానూ ఉపయోగించుకుంటారు
 =అన్నీ ఐటీ కంపెనీల్లో భద్రతపై సమావేశాలు ఏర్పాటు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement