Hyderabad: Bomb Threat Call To TCS Office In Madhapur - Sakshi
Sakshi News home page

Hyderabad: టీసీఎస్‌ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్

Published Thu, May 4 2023 2:37 PM | Last Updated on Thu, May 4 2023 2:56 PM

Bomb Threat Call For Madhapur Software Company - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టిన‌ట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజ‌మాన్యం మాదాపూర్‌ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. టీసీఎస్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్‌ స్క్వాడ్‌తో కంపెనీలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంతరం ఫేక్‌ కాల్‌ అని, బాంబు లేద‌ని నిర్ధారించారు.

అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్య‌క్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో స‌ద‌రు వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేద‌ని తేల్చ‌డంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: పెళ్లైన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement