సాక్షి, హిమాయత్‌నగర్: ‘‘నగరానికి చెందిన పావని ఫోన్ నంబర్‌ను ఓ వ్యక్తి వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశాడు. మీరు చెప్పినట్లుగా విని నేను పెట్టుబడి పెట్టి ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యానంటూ ఏవో కొన్ని స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం. వీటిని చూసిన పావని తాను కూడా ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరాలిని కావొచ్చనే ఆశతో డబ్బు పెట్టి మోసపోయింది.’’
- ‘‘నాలుగు రోజుల క్రితం హైటెక్‌సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేసే యువతికి ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ వ్యక్తి పరిచయమై క్రిప్టోలో డబ్బు పెట్టమన్నాడు. అతగాడి మాటలకు బుట్టలో పడ్డ యువతి పలు దఫాలుగా రూ.92లక్షలు పెట్టుబడి పెట్టినాక మాయగాడి ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్ మాయమైంది.. అప్పటికి గాని యువతికి అర్థం కాలేదు తాను మోసపొయినట్లు’’.
- ఈ రెండు ఉదాహారణలే కాదు ఇలా వారంలో పది, పదిహేను మంది ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో కరెన్సీ వలలో పడి మోసపోయిన బాధితులు సైబర్‌క్రైం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోసపోతున్న వారిలో వందకు వందశాతం విద్యావంతులే ఉండటం అందులోనూ ఐటీ రంగానికి చెందిన వారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఉండటం మరింత హాస్యాస్పదానికి గురిచేస్తుంది.
కోటీశ్వరులైనట్లుగా నకిలీ ఆధారాలతో బురిడీ
ముక్కూ మెహం తెలియని కొందరు వ్యక్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్‌లు ఉంటుంటే మిగత వారు రాజస్థాన్, యూపీ, అస్సాంలకు చెందిన వారు ఉంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌లకు సంబంధించిన నకిలీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్, డబ్బు వచ్చినట్లుగా వారికి వారే వాట్సప్ చాటింగ్‌లో గొప్పలు చెప్పుకోవడం వంటివి చేస్తున్నారు.
పెట్టుబడి పెడుతున్న వారిని నమ్మించేందుకు రూ.5వేలకు 10వేలు ఇవ్వడం లేదా రూ.10వేలకు 20వేలు ఇవ్వడం చేస్తున్నారు. ఇదిగో లాభాలు వస్తున్నాయి కదా అంటూ ఏమాత్రం ఆలోచించకుండా లక్షల రూపాయిలు పెట్టేస్తూ అప్పులపాలౌవుతున్నారు.
హెచ్చరిస్తున్నాం అయినా వలలో పడిపోతున్నారు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్‌లకు సంబంధించిన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ అధికారిక పేజీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు, క్రిప్టో కరెన్సీలు చేసి మోసపోవద్దంటూ పోలీసులు పోస్టులు పెడుతున్నారు. ఆయా కమీషనరేట్ పరిధిలోని పోలీసుస్టేషన్‌లకు సంబం«ధించిన వారు కూడా అవగాహాన కలి్పస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. కొత్తవారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ లక్షల రూపాయిలు మోసపోతున్నారు.
– కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment