సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగుచూసింది. రూ.700 కోట్ల రూపాయలు కాజేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. DKZ టెక్నాలజీస్ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపి పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది.
మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉండగా.. హైదారాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో మీడియాకు తమ గోడు వెల్లబుచ్చేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వందలాది బాధితులు చేరుకుంటున్నారు.
కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్‌లో డబ్బులు జమ చేశారు కేటుగాళ్లు.సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment