
క్రిప్టో కరెన్సీ విలువ రోజురోజుకి వృద్ధి చెందుతున్న తరుణంలో.. చాలామంది చూపు దీనిపై పడింది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడిపెడుతున్న వారిలో పురుషులే అధికంగా ఉన్నప్పటికీ.. స్త్రీల సంఖ్య కూడా కొంత పెరిగిందని, దేశంలోని ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'జియోటస్' వెల్లడించింది.
మహిళా పెట్టుబడిదారులు భారత క్రిప్టో మార్కెట్‌లోకి మునుపటి కంటే ఎక్కువగా ప్రవేశిస్తున్నారు. ఈ సంఖ్య 20 శాతం పెరిగిందని జియోటస్ స్పష్టం చేసింది. మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిలోకి ప్రవేశిస్తున్నారు.
మహిళలు క్రిప్టో కరెన్సీవైపు ఎక్కువ ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం.. చదువుకున్న వారికి డిజిటల్ అవగాహన, పెట్టుబడికి సంబంధించిన అవగాహన పెరగడం అని తెలుస్తోంది. యువత ఎక్కువగా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆర్ధిక నిపుణులు కూడా చెబుతున్నారు.
ఇదీ చదవండి: శివ్ నాడార్ కీలక నిర్ణయం.. కుమార్తెకు భారీ గిఫ్ట్
ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న మహిళలు మాత్రమే కాకుండా. టైర్ 2, టైర్ 3 నగరాల్లోని మహిళలు కూడా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. రాబోయే రోజుల్లో మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జియోటస్ అంచనా వేస్తోంది.