సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): గుజరాత్‌కి చెందిన ఓ వ్యక్తితో ట్విట్టర్ ద్వారా పరిచయం పెంచుకున్నారు దిల్‌షుక్‌నగర్‌కు చెందిన రాసూరి రాహుల్, అతడి భార్య. కొద్దిరోజుల పరిచయం అనంతరం వాట్సాప్ నంబర్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వ్యాపారస్తుడు నీల్ పటేల్ తనకు చెందిన ‘స్క్వాస్ టెక్నాలజీస్ సర్వీసెస్ సంస్థ’ కంపెనీ పేరుతో ట్విట్టర్‌లో క్రిప్టో కరెన్సీపై ఎడ్వర్‌టైజ్‌మెంట్‌ల రూపంలో ప్రమోట్ చేసుకుంటున్నాడు.
దీనికి ఆకర్షితులైన రాసూరి రాహుల్, అతడి భార్య నీల్ పటేల్‌ను సంప్రదించారు. రూ.12 లక్షలు నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేశారు. అనంతరం ఫోన్‌కు స్పందించకపోవడంతో శుక్రవారం సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
రూ.10కోట్లు.. 300మంది బాధితులు
గూగుల్ ద్వారా నీల్ పటేల్ వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన రాహుల్‌కు పలు విషయాలు తెలిశాయి. తాము కూడా నీల్ పటేల్ చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేసి మోసపోయామని కొందరు గూగుల్లో రివ్యూలు రాశారు. ఇలా ఇప్పటి వరకు 300మంది నుంచి రూ.10కోట్ల మేర ఇన్వెస్ట్ చేయించి వారికి దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది. నీల్ పటేల్‌పై ముంబై, కలకత్తా, ఢిల్లీ, పూణే వంటి నగరాల్లో కేసులు కూడా కేసులు నమోదైనట్లు రాహుల్ సిటీ సైబర్ క్రైం పోలీసులకు వెల్లడించాడు.
చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
Comments
Please login to add a commentAdd a comment