సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టిస్తున్న చైనీయులతో జతకట్టారు హైదరాబాదీలు. డ్రాగన్ దేశీయులు ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో చేస్తున్న మోసాలకు అవసరమైన నకిలీ కంపెనీలు, వసూలు చేసిన సొమ్మును ఉపసంహరించేందుకు బ్యాంక్ ఖాతాలను సృష్టించిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన అడబాల శ్రీనివాసరావు, నరాల విజయ్ కృష్ణ, కన్నారెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి, చైనా దేశస్తులు జోలీ, మైకేల్‌తో పాటు మరో 8 మంది నిందితులతో జట్టుకట్టారు.
వీరు నగరంలో ఓ ఇంటి యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ), ఇతరత్రా డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ నకిలీ పత్రాలను హైదరాబాద్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ)కు సమర్పించి 12 నకిలీ ప్రైవేట్ కంపెనీలను తెరిచారు. ఈ కంపెనీలు ఆన్‌లైన్‌లో పెట్టుబడి వ్యాపారం అని మాయమాటలు చెబుతూ అమాయక ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సొమ్ము లావాదేవీల కోసం 15 బ్యాంక్ ఖాతాలను తెరిచారు. ఈ విషయంపై హైదరాబాద్ ఆర్‌వోసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా.. రూ.2.42 కోట్లను వసూలు చేసి ఆ మొత్తాన్ని ఉపసంహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీఎస్ బృందం శ్రీనివాస్, విజయ్ కృష్ణ, విజయ్ భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.
చదవండి: Shilpa Chowdary: శిల్పా చౌదరికి బెయిల్.. చంచల్‌గూడ జైలు నుంచి విడుదల
Comments
Please login to add a commentAdd a comment