హిమాయత్‌నగర్(హైదరాబాద్): చార్టెట్ అకౌంట్ చేసిన ఓ యువతి ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఓ పథకం ప్రకారం ఆమెకు వల వేశారు. మీ ప్రొఫైల్ బాగుంది.. మంచి కంపెనీలో సీఏగా పెట్టిస్తాము అంటూ నమ్మబలికారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా యువతికి వాట్సప్ లింకు పంపారు. ఆ లింకును క్లిక్ చేసిన యువతి చేత తొలుత రూ. 100 కట్టించారు. మరుసటి రోజు రోజు రూ. 100కి రూ. 200 లాభం ఇచ్చి ఆశ చూపించారు.
ఇదేదో బాగుంది కదా అని ఆశ పడ్డ యువతికి సుమారు రూ. 5 వేల వరకు ఇన్వెస్ట్ చేపించడం లాభాలు ఇవ్వడం చేశారు. ఆ తర్వాత నుంచి పలు దఫాలుగా డబ్బులు పెడుతుందే కానీ లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 4.53 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు శుక్రవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కె.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment