Cyber fraud
-
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు, ఓటీపీల వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో సులభంగా మోసపోతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసు కుని లబోదిబోమంటున్నారు. గడచిన మూడు నెలల్లో వెలుగుచూసిన సంఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏకంగా రూ.1,085 కోట్ల మేర మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో నేషనల్ సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ) హెల్ప్‌లైన్ నంబరుకు 64 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని బట్టి సైబర్ మోసగాళ్లు ఏ స్ధాయిలో రెచ్చి పోతున్నారో ఇట్టే అర్ధమవుతోంది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సైబర్ డిపార్టుమెంట్ పోలీసులు మరికొందరని రూ.119 కోట్లు మోసపోకుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దంటూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మీ బంధువులు అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని, మీ పిల్లల్ని ఏదో కేసులో నేరం కింద పోలీసులు అరెస్టు చేశారని, బ్యాంకు మేనేజర్లు , సీబీఐ, కస్టమ్ డిపార్టుమెంట్ ఇలా రకరకాల శాఖల నుంచి, అలాగే కేవైసీ చేయాలని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని ఇలా రకరకాల వంకలతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోన్లు వస్తే స్పందించవద్దని, ఏ బ్యాంకు సిబ్బందీ ఇలా ఫోన్లో వివరాలు అడగరనే సందేశాలను గత కొద్ది రోజులుగా టెలికామ్ డిపార్టుమెంట్ ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.కొందరు ఆలస్యంగానైనా మేలుకుని 1930 నంబరుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా కాకపోయినా కొంతమేర అయినా పోలీసులు కాపాడగలుగుతున్నారు. లేదంటే బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమా దం ఉంటుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటీవల న్యూ ముంబైలోని మహాపే ప్రాంతంలో అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 150పైగా సిబ్బంది, 24 గంటలు విధులు నిర్వహిస్తారు. 1930 హెల్ప్‌లైన్ నంబరుకు ప్రతీరోజు సగటున ఏనిమిది వేల వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని, సా«ధ్యమైనంత వరకు అమాయకులు మోసపోకుండా ప్రయత్నిస్తుంటారని మహారాష్ట్ర సైబర్ డిపార్టుమెంట్ సూపరింటెండెంట్ సంజయ్ లాట్కర్ తెలిపారు. విదేశీ సిమ్‌కార్డులతో మరింత చిక్కు: సంజయ్ లాట్కర్ ఇదిలాఉండగా సైబర్ మోసగాళ్లు ఒకసారి వినియోగించిన ఫోన్ నంబర్లను మరోసారి వాడరు. వీటిని ఎలాగోలా సంపాదించిన కొందరు నేరగాళ్లు యువతి, యువకులు, మహిళలను మీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. బాధితులు ఈ నంబర్లు గురించి తెలిపేందుకు వీల్లేకపోవడంతో ఏమీతోచక కొందరు, పరువు పోతుందన్న భయంతో కొందరు, ఇలా వేలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోతున్నారు. గడచిన మూడు-నెలల్లో 1930 హెల్ప్‌లైన్ నంబరుకు వచి్చన 28,209 ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన 2,713 మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మిగతా నంబర్ల గురించి ఆమాత్రం సమాచారం కూడా లేదు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు విదేశీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నారని, ఒకసారి వాడిన సిమ్ కార్డును మరోసారి వినియోగించడం లేదని తెలుస్తోంది. దీంతో నేరగాళ్లందరినీ పట్టుకోవడం సాధ్యం కావడం లేదని సంజయ్ లాట్కర్ తెలిపారు. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
ఇలా జరుగుతోంది జాగ్రత్త.. ఈపీఎఫ్‌వో వార్నింగ్
మీరు జాబ్ హోల్డర్ అయిఉండి ఈపీఎఫ్‌వో (EPFO) కిందకు వస్తే ఈ వార్త మీకోసమే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల (Cyber frauds) కేసుల దృష్ట్యా, దేశంలోని సంఘటిత రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్‌వో విజ్ఞప్తి చేసింది.ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన రహస్య సమాచారం అంటే యూఏఎన్ నంబర్ (UAN), పాస్వర్డ్, పాన్ నంబర్ (PAN), ఆధార్ నంబర్ (Aadhaar), బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP) వంటి వాటిని ఎవరితోనూ పంచుకోకూడదని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తన అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిందిఆ వివరాలు చెప్పొద్దుఈపీఎఫ్వో తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ఖాతాకు సంబంధించిన వివరాలను ఏ ఉద్యోగిని అడగదు. ఒకవేళ ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మీ ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని అడిగినా.. ఫోన్, మెసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఓటీపీలు చెప్పాలని కోరినా ఎలాంటి సమాచారం ఇవ్వవద్దు’ అని అప్రమత్తం చేసింది.వెంటనే ఫిర్యాదు చేయండి‘ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. మీరు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి ఈపీఎఫ్ ఖాతాలో దాచుకున్న డబ్బును వారు దోచుకునే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ అడిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి’ అని సూచించింది.వ్యక్తిగత డివైజ్‌లనే వాడండిఈపీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో యాక్సెస్ చేయడానికి సైబర్ కేఫ్ లేదా పబ్లిక్ డివైజ్‌ని ఉపయోగించొద్దని ఈపీఎఫ్‌వో సూచించింది. ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన ఏ పని కోసమైనా ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ వంటి మీ వ్యక్తిగత పరికరాన్నే ఉపయోగించండి. సైబర్ మోసం నుండి సురక్షితంగా ఉండే మార్గాల గురించి ఈపీఎఫ్‌వో తన వెబ్సైట్ ద్వారా సభ్యులకు నిరంతరం తెలియజేస్తూనే ఉంది.Never share your UAN, password, OTP, or bank details with anyone. EPFO will never ask for this information. Protecting these details is essential to keeping your money secure.#EPFO #EPFOWithYou #HumHainNaa #EPF #PF #ईपीएफओ #ईपीएफ@mygovindia @PMOIndia @LabourMinistry… pic.twitter.com/MN1a4nYIFm— EPFO (@socialepfo) January 5, 2025 -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
సరికొత్త సైబర్ మోసాలు!
ఇది టెక్నాలజీ కాలం.. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టు..ఇదంతా నాణేనికి ఒక వైపు..సాంకేతికత ఎంతగా పెరిగిందో.. దాని వల్ల ముప్పు అంతే పొంచి ఉంటోంది. ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కళ్లకు కనిపించని సైబర్ నేరగాళ్లు ఎక్కడో కూర్చుని ఇక్కడి మన బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 2024 ఒక్క ఏడాదిలోనే తెలంగాణ వాసుల నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము రూ.1,866.9 కోట్లు అంటేనే ఈ తరహా మోసాల బారిన పడుతున్నవారు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటున్నారో అర్థమవుతుంది. ఎంత విద్యాధికులైనా.. విజ్ఞానం ఉన్నా..అత్యాశ, అమాయకత్వం, అవగాహన లోపం లాంటి వాటితో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుపోతున్నారు.మరి ఇలాంటి వారినుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సైబర్ నేరగాళ్లకు మన కష్టార్జితం చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న మోసాలు ఏంటి? నేరగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? ఇలా అనేక కోణాల్లో సైబర్ మోసాలపై పలువురు సైబర్ భద్రత నిపుణులు, పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విలువైన సూచనలు ఇస్తున్నారు. వీటిపై ‘సాక్షి’అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం.. – సాక్షి, హైదరాబాద్శ్రీధర్ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఆయన ఫోన్‌కు వీడియో కాల్ వచ్చింది. పోలీస్ యూనిఫాంలో ఉన్న అవతలి వ్యక్తి.. మేం ముంబై పోలీస్...మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలకు డబ్బులు వెళ్లాయి. మీపై మనీలాండరింగ్ చట్టాల కింద కేసు నమోదైంది. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం. మీరు ఇంకెవరితో ఫోన్లు మాట్లాడొద్దు..ఇంటినుంచి బయటికి వెళ్లొద్దు. అని బెదిరిస్తూనే చివరకు మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలంటే, మేం చెప్పిన ఖాతాలో డబ్బులు వేయాలి..’అని చెప్పారు. ఆందోళనకు గురైన శ్రీధర్ మరో ఆలోచన లేకుండా వాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. అయితే పదేపదే డబ్బులు అడగడంతో ఇది సైబర్ మోసగాళ్ల పనై ఉంటుందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోసం 1డిజిటల్ అరెస్టు డిజిటల్ అరెస్టు అనేది లేనేలేదు డిజిటల్ అరెస్టు... ఈ మధ్య కాలంలో ఎంతో ఎక్కువగా వింటున్న..జరుగుతున్న సైబర్ మోసం. ఫోన్ నంబర్, పూర్తి పేరు, అడ్రస్ ఇలా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏదో ఒక రూపంలో సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు..అది వాడి మోసానికి తెర తీస్తున్నారు. మన ఫోన్లో ముంబై పోలీస్ అనో ఇతర పోలీస్ అనో రావడం, అవతలి వ్యక్తులు పోలీస్ యూనిఫాంలోనే ఉండడం.. మన పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ పక్కాగా చెబుతుండటంతో నిజమైన పోలీసులేనేమో అని భయపడేందుకు అవకాశం ఉంటోంది. నిజానికి డిజిటల్ అరెస్టు అన్నది లేనే లేదు. వారి మాటలు నమ్మితే.. నేరగాళ్లు అసలు కథ మొదలెడతారు. ఎలా మోసగిస్తారు..? : మనీలాండరింగ్ కేసులో మీపేరుంది.. మీ చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్‌తో ఉన్న పార్శిల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. మీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు. మీ ఫోన్ నంబర్‌తో అనుమానితులకు ఫోన్లు వెళుతున్నాయి.. ఇలాంటివి చెబుతూ వీడియో కాల్స్ చేస్తారు. బెదిరిపోవద్దు..‘డిజిటల్ అరెస్టు సైబర్ మోసంలో.. నేరగాళ్లు మీపై ఏదో ఒక నేరారోపణ చేసి బెదరగొడతారు. మీ ఫోన్ నంబర్, మీ ఆధార్ నంబర్, మీ అడ్రస్ ఇలాంటి వివరాలు నేరంలో ఉన్నట్టు కంగారు పెడతారు. మనీలాండరింగ్, డ్రగ్స్ కేసు, కస్టమ్స్ కేసు, పోటా యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీ) కింద కేసు..లేదంటే మీపైన ఒక మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది..ఇలాంటి వాక్యాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. ఆందోళన పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులెవరికీ ఫోన్ చేయొద్దంటారు. మీరు మాట్లాడటం కొనసాగించే కొద్దీ ఇదేవిధంగా కంగారు పెడుతూ మెల్లగా ఈ నేరంలోంచి బయటపడేందుకు మీకు సహాయపడతామంటారు. నేరం నుంచి తప్పించుకోవాలన్నా..మీ పేరును ఈ నేరం నుంచి తొలగించాలన్నా..మేం అడిగినంత డబ్బులు పంపాలంటూ బేరాలు మొదలు పెడతారు. మీరు భయంతో అంగీకరిస్తే బ్యాంకు ఖాతాల నంబర్లు ఇస్తారు. వీలైనంతగా మీ వద్ద డబ్బు గుంజే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి పోలీసులెవరూ ఇలా ఫోన్లలో బెదిరించరని, డిజిటల్ అరెస్టు అనేది లేనే లేదని తెలుసుకోవాలి. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వస్తే సాధ్యమైనంతవరకు మాట్లాడకుండా ఉండటమే మంచిది..’అని సైబర్ భద్రత నిపుణుడు అద్వైత్ కంభం వివరించారు. ప్రణయ్.. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతడి పీఐఐ వివరాలు థర్డ్‌పార్టీ నుంచి సేకరించే సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ప్రొఫైల్ నకిలీది క్రియేట్ చేసి..దాని ద్వారా ప్రణయ్ స్నేహితులు, బంధువులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. కొద్దిరోజుల తర్వాత ప్రణయ్ నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి ‘నా భార్య అనారోగ్యంతో ఉంది.అత్యవసర సర్జరీ కోసం ఆసుపత్రిలో చేర్పించాను. నా ఆన్లైన్ బ్యాకింగ్ పనిచేయడం లేదు. అర్జంట్‌గా నేను చెప్పిన నంబర్‌కు రూ.50 వేలు పంపించు. నేను సాయంత్రం వరకు తిరిగి ఇచ్చేస్తాను..’అంటూ ప్రణయ్ ఆఫీస్ కొలీగ్ నాగేందర్‌కు మెసేజ్ వచ్చింది. అత్యవసరంలో ఉన్నాడు కదా అని డబ్బులు పంపాడు. సాయంత్రం ప్రణయ్‌కు కాల్ చేస్తే కానీ నాగేందర్‌కు తెలియలేదు..అది ఫేక్ అని..మోసం2ఐడెంటిటీ థెఫ్ట్అంటే ఏమిటి..? పర్సనల్ ఐడెంటిఫయబుల్ ఇన్ఫర్మేషన్ (పీఐఐ) అంటే మన ఫోన్ నంబర్, పేరు, ఫొటోగ్రాఫ్, ఈ–మెయిల్..వీటి ద్వారా జరిగే మోసాలను ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలుగా చెప్పవచ్చు. మన ఫొటోలను, లేదా వీడియోలను వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌తో మారి్ఫంగ్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేస్తారు. అవి నిజమైనవి కాదు అన్నది గుర్తుపట్టలేనంతగా చేస్తారు. వీటిని ఉపయోగించి సోషల్ మీడియా ఖాతాలు సృష్టించడం ద్వారా లేదంటే మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో మోసానికి తెరతీస్తారు. ఎలా మోసగిస్తారు..? మన వివరాలను వినియోగించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు.. లేదా కొద్దిపాటి మార్పులతో మన ఈ–మెయిల్‌ను పోలినట్టుగా ఈ –మెయిల్స్ క్రియేట్ చేసి.. వాటిని వినియోగించి మోసాలకు పాల్పడతారు. నిజమైన వ్యక్తులే అవసరంలో ఉండి డబ్బులు అడుగుతున్నట్టుగా నమ్మిస్తారు. సామాన్యులు, ప్రముఖులూ బాధితులే..: ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ భద్రత నిపుణుడు, ఢిల్లీఐడెంటిటీ థెఫ్ట్ సైబర్ మోసానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కీలక అధికారులు, జడ్జీలు, ఇతర రంగాల సెలబ్రెటీలు ఎక్కువగా గురవుతున్నారు. మరోవైపు సామాన్యులకు సైతం ఈ ఐడెంటిటీ థెఫ్ట్ ముప్పు తప్పడం లేదు. ఉదాహరణకు.. మాజీ ఎంపీ సోయం బాపూరావు పేరిట గత ఐదేళ్లుగా గుర్తు తెలియని వ్యక్తి ‘ఎక్స్’ ఖాతాను రన్ చేస్తున్నాడు. ఒక అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన తర్వాత ఆయన అప్రమత్తం అయి చూసుకుంటే తన పేరిట ‘ఎక్స్’ ఖాతా ఉన్నట్టు తెలిసింది. కొందరు ప్రభుత్వ అధికారులకు వారి పై అధికారుల పేరిట డబ్బులు పంపాలని వాట్సాప్‌లో, ఫేస్బుక్లో మెసేజ్ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రొఫైల్ ఫొటో అధికారిదే ఉండడంతో చాలామంది డబ్బులు పంపి మోసపోయారు. ఇలా ఒక వ్యక్తి ఫొటో, పేరు, వివరాలు వాడి మోసగించడమూ ఐడెంటిటీ థెఫ్ట్ట్గా చెప్పొచ్చు. భవిష్యత్తులో ‘ఏఐ’ముప్పు..: ఇప్పుడు టార్గెటెడ్ వ్యక్తుల వీడియోలు ఏఐ టూల్స్ వాడి ఫేక్‌వి సృష్టిస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత ముప్పు గా మారబోతోంది. వైరివర్గాన్ని దెబ్బతీసేలా వదంతులు క్రియేట్ చేసేందుకు కూడా ఈ ఐడెంటిటీ థెఫ్ట్ను వాడే అవకాశం ఉంది. కొద్దిపాటి మార్పులతో ఫేక్ ఈ–మెయిల్ అడ్రస్‌లు క్రియేట్ చేసి వాటి ద్వారా మోసాలు వ్యాపార రంగంలో జరుగుతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్ బారినపడకుండా ఉండాలంటే మన వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా యా ప్స్‌లో వీలైనంత తక్కువగా ఉపయోగించడం ఉత్తమం. సోషల్ మీడియా యాప్స్‌లో మన వివరాలు, ఫొటోలకు ప్రొఫైల్ లాక్స్ పెట్టుకోవాలి. అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు.మోసం 3స్టాక్స్‌లో పెట్టుబడులు శ్రీనివాస్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా..తన వాట్సాప్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన సమాచారం ఉంది. ఆ మెసేజ్లోని లింక్ ద్వారా ఆ వాట్సాప్ గ్రూప్‌లో చేరాడు. అందులో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై సభ్యుల చర్చను వారం పాటు గమనించాడు.ఆ తర్వాత శ్రీనివాస్ సైతం కొద్ది మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టాడు. మొదట పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నట్టుగా యాప్‌లో చూపారు. ఇలా తన పెట్టుబడి రూ.50 లక్షలకు చేరిన తర్వాత డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే రాకపోవడంతో మోసమని గుర్తించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు.ఎక్కువగా జరుగుతున్న మోసం ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా జరుగుతున్న సైబర్ మోసాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి (స్టాక్స్‌లో పెట్టుబడుల పేరిట మోసం). సోషల్ మీడియాలో ఇచ్చే ప్రకటనల్లో స్టాక్ మార్కెట్లో పేరున్న సంస్థల్లా నమ్మకాన్ని నెలకొల్పుతారు. తక్కువ రిస్క్ తో అధిక రాబడులు వస్తున్నట్టుగా నకిలీ యాప్‌లో మనకు చూపుతుంటారు.పెట్టుబడి తక్కువ సమయంలోనే రెండింతలు, మూడింతలు అవుతున్నట్టుగా అంకెల్లో మార్పులు చేస్తూ నకిలీ లేదా థర్డ్‌పార్టీ యాప్‌లలోకి డబ్బును మళ్లిస్తారు. ఆ డబ్బును సైబర్ దొంగలు వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి తరలించుకుంటారు.మోసం4పార్ట్‌టైం ఉద్యోగాలు హర్షిణి గృహిణి..ఇద్దరు పిల్లలు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలనుకున్నా కుటుంబ బాధ్యతలతో చేయలేకపోయింది. ఓ రోజు ‘ఇంటివద్దే ఉంటూ పార్ట్‌టైం జాబ్‌తో నెలకు వేలల్లో సంపాదించండి..అంటూ ఫేస్బుక్లో ఒక యాడ్ చూసింది. అందులోని నంబర్లకు ఫోన్ చేసి, వారు అడిగిన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు కొట్టడం, షేర్ చేయడం వంటి టాస్్కలు ఇచ్చారు.కొద్దిరోజులపాటు డబ్బులు తన అకౌంట్లో జమ అవడంతో నమ్మకం పెరిగింది. కొద్ది రోజుల తర్వాత స్టాక్మార్కెట్లో మేం చెప్పిన యాప్స్‌లో పెట్టుబడులతో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని ఆశపెట్టారు. ఆ మాటలు నమ్మిన హర్షిణి తన సంపాదనతోపాటు కుటుంబ సభ్యులకు చెందిన డబ్బులు పెట్టుబడిగా పెట్టి దాదాపు రూ.25 లక్షల వరకు మోసపోయింది. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు లేకుండా ఎలా? ఎలాంటి ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన పని లేకుండా ఇంట్లో కూర్చుని కూడా రోజుకు వేలల్లో సంపాదించుకోవచ్చంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ‘ఎక్స్’ వాట్సాప్‌లలో నౌకరీ, షర్, మాన్స్టర్ వంటి వెబ్సైట్ల పేరిట నకిలీ ప్రకటనలతో ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, తాత్కాలిక ఉద్యోగాలు ఉండి అదనపు సంపాదన కోసం ప్రయత్నించే వారిని టార్గెట్ చేస్తున్నారు. తొలుత పార్ట్‌టైం జాబ్స్‌తో మొదలుపెట్టి నెమ్మదిగా పెట్టుబడులు పెట్టేలా ఒత్తిడి చేస్తారు. తర్వాత మోసానికి తెరతీస్తారు. నిజమా.. కాదా.. అన్నది నిర్ధారించుకోవాలి ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చన్న ఆశతో కొందరు వీటిబారిన పడుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్.. ఇలా సోషల్ మీడియా వేదికల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ తరహా ప్రకటనలు ఇస్తున్నారు. మొదట రూ.10 వేలు, రూ.20 వేలు పెట్టుబడి పెట్టించి దాన్ని రెట్టింపు అయినట్టు చూపిస్తారు. ఈ లాభాలు డ్రా చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఇంకా లాభాలు వస్తాయి..రూ. లక్షల్లో పెట్టండి అని ప్రోత్సహిస్తారు..ఇలా మెల్లగా అవతలి వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టగలడో అంతా అయ్యే వరకు ఇలానే ప్రోత్సహిస్తారు.ఎప్పుడైతే అవతలి వ్యక్తి డబ్బులు విత్‌డ్రాకు ట్రై చేస్తారో అప్పుడు అసలు మోసం బయటపడుతుంది. అప్పటికే మనం పెట్టిన డబ్బులు సైబర్ నేరగాళ్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించి అక్కడి నుంచి డ్రా చేసుకోవడం లేదా..క్రిప్టోకరెన్సీ రూపంలో విదేశీ ఖాతాల్లోకి మళ్లించడం చేసేస్తారు. ఈ మోసాలబారిన పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా యాప్స్‌లో వచ్చే పార్ట్ టైం జాబ్స్ ప్రకటనలు నమ్మకూడదు. అవకాశం ఉంటే వ్యక్తిగతంగా వాళ్లు చెబుతున్న అడ్రస్‌కు వెళ్లి నిజంగానే ఆ ఆఫీస్ ఉందా..? లేదా...? నిర్ధారించుకున్న తర్వాతే అందులో చేరాలి. – కవిత, డీసీపీ, సైబర్ క్రైం, హైదరాబాద్ సిటీమోసం5ఫేక్ కస్టమర్ కేర్, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్ దిలీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. శామీర్‌పేట్‌లో ఉంటారు. ఇంట్లోని ఏసీ పనిచేయకపోవడంతో కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నారు. వెంటనే గూగుల్లోకి వెళ్లి సదరు కంపెనీ పేరుతో కస్టమర్ కేర్ నంబర్ అని గూగుల్ సెర్చ్ చేశారు. దానిలో వచ్చిన నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తి ‘మీకు కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నాం సార్..మీ ఇంటికి టెక్నీషియన్‌ను పంపుతాం. మీ ఇంటి అడ్రస్, ఇతర వివరాలు ఇవ్వండి. మీ మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులోని వెబ్‌లింక్ ఓపెన్ చేయండి. తర్వాత మీకు వచ్చిన ఓటీపీ చెబితే..మీ సర్వీసింగ్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ అవుతుంది..’అని ఎంతో మర్యాదగా చెప్పింది. ఆమె చెప్పినట్టే చేశారు దిలీప్. కాసేపటికి అతడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మోసం ఎలా ఉంటుంది?..: ఆన్లైన్లో ఫుడ్ఆర్డర్ అయినా..? క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన సమస్యలైనా..? ఇలా ఏ అవసరం అయినా వెంటనే కస్టమర్ కేర్‌కు లేదంటే ఆ సంస్థకు కాల్ చేసి ఫిర్యాదు చేయడం సహజం. సరిగ్గా ఇదే తమకు అనుకూలంగా మల్చుకుని సైబర్ మోసాలకు తెరతీస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లు వద్దు ‘సైబర్ నేరగాళ్లు నిజమైన సంస్థల పేర్లతో నకిలీ వెబ్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. ఎస్ఈఓ (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్)టెక్నిక్‌లు వాడి సైబర్ నేరగాళ్ల వెబ్పేజీనే ముందు మనకు కనబడేలా చేస్తున్నారు. అందులోని నంబర్‌కు మనం కాల్ చేస్తే నిజంగా ఆ సంస్థ ప్రతినిధిలా మాట్లాడుతూ, మన బ్యాంకు వివరాలు తీసుకోవడంతోపాటు ఓటీపీలు సైతం చెప్పించుకుని మోసాలకు పాల్పడతారు. అందుకే, కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో, యూ ట్యూబ్‌లో వెతకడం శ్రేయస్కరం కాదు. మీకు కావాల్సిన సంస్థ అధికారిక వెబ్సైట్లోకి, యాప్‌లోకి వెళ్లి మాత్రమే నంబర్లను తీసుకోవాలి..’అని సైబర్ భద్రత నిపుణులు నల్లమోతు శ్రీధర్ వివరించారు. అత్యాశతోనే అనర్థాలు.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న అత్యాశతో చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బారిన పడుతున్నారు. పెట్టుబడి పెట్టేముందు అ సంస్థ నిజమైనదేనా..? అన్నది తప్పకుండా ధ్రువీకరించుకోవాలి. అత్యధిక లాభాలంటూ వాస్తవ విరుద్ధంగా ఇచ్చే హామీలు ఉంటే తప్పకుండా అనుమానించాలి. తొందరపెట్టినా, ఆఫర్ చేజారిపోతుందని కంగారు పెట్టినా నమ్మవద్దు. అవసరమైతే మీకు తెలిసిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. అప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారి సూచనలు తీసుకోవాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా స్థానిక సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. – శ్రీబాల, డీసీపీ, సైబర్ క్రైమ్స్, సైబరాబాద్అప్రమత్తంగా ఉండండిసైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తరఫున ప్రజలను కోరుతున్నాం. ఆన్లైన్లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ప్రతిసారీ జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద వెబ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దు. నిర్ధారించుకోకుండా డబ్బులు ఎవరికీ పంపవద్దు. మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే టీజీసీఎస్బీ హెల్ప్‌లైన్ 1930 లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. – శిఖా గోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీమరికొన్ని రకాల సైబర్ మోసాలు..ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్..ఆరోగ్యశ్రీ, ఫేక్ ఇన్సూరెన్స్ పేరిట గేమింగ్ ఫ్రాడ్స్..ఆన్లైన్ గేమింగ్, కలర్ కోడింగ్ ఆన్లైన్ రమ్మీ, స్పిన్నింగ్ వీల్ పేరిట సైబర్‌మోసం. లాటరీ ఫ్రాడ్స్..ఆన్లైన్లో లాటరీ వచ్చిందని, మీ పేరిట భారీ డిస్కౌంట్ ఆఫర్ అంటూ.. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్..మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి మోసం..సెల్ టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్..మీ ఇంటి పరిధిలో సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు ఆఫర్ ఉందని చెబుతారు. ఐవీఆర్ కాల్స్‌తో మోసం: మీరు అనుమానాస్పద నంబర్లకు ఫోన్లు చేశారని, మీ సిమ్‌కార్డు కొద్ది సమయంలోనే బ్లాక్ అవబోతుందని, ట్రాయ్, టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ల పేరిట ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్‌చేసి బెదిరించి మోసాలు.. కేవైసీ అప్డేషన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఆధార్‌తో లింకేజీ చేయడం, కార్డు యాక్టివేషన్, కార్డు లిమిట్ పెంచడం, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు, రివార్డు పాయింట్లు డబ్బుగా మార్చుకోవాలని.. ఇలాంటి అంశాలతో మోసగిస్తారు. ఓఎల్ఎక్స్లో వస్తువులు అమ్ముతామని, లేదంటే కొంటామని నకిలీ అడ్రస్‌లు, ప్రూఫ్‌లతో మోసగిస్తారు.ఫోన్ నంబర్ ఇవ్వడమే తప్పు సాధారణంగా దొంగలు ఇంట్లోకి రాకుండా పెద్ద, పెద్ద తాళాలు వేస్తాం.. ఇంటికి నాలుగు మూలల సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటాం..అవసరమైతే కుక్కలను పెంచుకుంటాం. కానీ, కనిపించని సైబర్ దొంగల చేతికి మాత్రం ‘సమాచారం’అనే తాళాలు మనమే ఇస్తున్నాం. మందుల దుకాణం, సూపర్ మార్కెట్, మాల్స్, వస్త్ర దుకాణాలు, ఫుడ్‌కోర్టులు ఇలా ఎక్కడపడితే అక్కడ అవసరానికి మించి మన ఫోన్ నంబర్‌ను ఇస్తున్నాం. కొన్నిసార్లు అనివార్యంగా కూడా మన వివరాలు ఇవ్వక తప్పడం లేదు. ఇదే పెద్ద తప్పు అని గుర్తించాలంటున్నారు సైబర్ భద్రత నిపుణులు. ఇలా మనం ఇచ్చే సమాచారాన్ని కొన్ని సంస్థలు కాల్ సెంటర్లకు, థర్డ్‌పార్టీకి అమ్ముతున్నాయని మరవొద్దు. మన ఫోన్ నంబర్, పేరు తెలిస్తే మిగిలిన వివరాలు కనిపెట్టడం సైబర్ నేరగాళ్లకు పెద్ద కష్టమేమీ కాదు.. సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు.గుడ్డిగా నమ్మొద్దు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, మీకు ఫలానా బ్యాంకు నుంచి ఆఫర్ ఉందని, మీకు లాటరీలు వచ్చాయని..ఇలా ఏదో ఒక సాకుతో వచ్చే ఎస్ఎంఎస్లు, ఈ–మెయిల్స్‌లోని వెబ్ లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అప్రమత్తతే ఆయుధం అన్నది మరవొద్దు. సైబర్‌మోసగాళ్లు ఇచ్చే మోసపూరిత ప్రకటనలు, మెసేజ్‌లు, ఈ మెయిల్స్‌ను గుడ్డిగా నమ్మకుండా.. ఆలోచించి, నిర్ధారించుకోవాలి. -
సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన
దేశంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్స్ ద్వారా సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నడుం బిగించింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలు వెలువరించింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఈ కాలర్ ట్యూన్స్‌ను టెలికం కంపెనీలకు అందిస్తుంది. టెలికం కంపెనీలు మొబైల్ కస్టమర్లకు ప్రతిరోజు 8–10 కాల్స్‌కు ఈ సందేశాన్ని వినిపిస్తాయి. ప్రతి వారం కాలర్ ట్యూన్‌ను మారుస్తారు. ఇలా మూడు నెలలపాటు కాలర్ ట్యూన్స్ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని కాల్స్ భారత్‌లో నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి అందులో చాలా వరకు అంతర్జాతీయ స్పూఫ్డ్ ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసే వ్యవస్థను కేంద్రం, అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రూపొందించారు.ఇదీ చదవండి: ‘భారత్ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’ఇటీవల నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ స్కామ్‌లు, ప్రభుత్వం, పోలీసు అధికారులుగా నటించడం మొదలైన కేసులలో సైబర్ నేరస్థులు ఇటువంటి అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్స్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2024 నవంబర్ 15 వరకు 6.69 లక్షలకు పైగా సిమ్ కార్డ్‌లు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్ చేసింది. -
పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల వల
గోదావరిఖని: పార్ట్‌టైం ఉద్యోగం ఎరచూపి సైబర్ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు కాజేశారు. గోదావరిఖని సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గృహిణికి ఇన్‌స్ట్రాగామ్‌లో సైబర్ మోసగాళ్లు పరిచయమయ్యారు. మాటల్లో పెట్టి పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని, దీనిద్వారా ఆదాయం వస్తుందని నమ్మించారు. ఇందుకోసం తొలుత తమకు రూ.10 వేలు డిపాజిట్‌గా పంపించాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌కు రూ.13 వేలు పంపించారు. మరోసారి రూ.10 వేలు పంపిస్తే రూ.18 వేలు ఖాతాలో జమచేశారు. ఇలా రూ.లక్ష వరకు పంపించగా.. ఇక టాస్క్ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకూ సొమ్ము పంపించాలని చెప్పగానే.. విడతల వారీగా రూ.31.60 లక్షలను ఆమె అవతలి వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు పంపించింది. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, వారి నుంచి సమాచారం కూడా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం సీఐ కృష్ణకుమార్.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన సోహెల్ రెస్టారెంట్లో పనిచేస్తున్న మహమ్మద్ అవాద్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట బ్యాంకుల్లో మూడు ఖాతాలు తెరిచి ఇలియాస్ అనే వ్యక్తికి ఇచ్చానని, ఇందులో డబ్బు జమచేస్తామని, ఆ తర్వాత తమ బ్యాంకులోకి మళ్లించుకుంటారని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
PAN 2.0: కొత్త పాన్ కార్డ్ ఎంత వరకూ సేఫ్?
ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ అప్‌గ్రేడ్ వెర్షన్ 'పాన్ 2.0'ను ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటిది యాక్సెసిబిలిటీ.. మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రెండవది డేటా స్టోరేజ్.. ఇదీ సురక్షితం. ఇక మూడవది సులభతరమైన అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ. కొత్త పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటుంది కాబట్టి డిజిటల్ వర్క్‌లో దాని ఉపయోగం మునుపటి కంటే సులభతరం అవుతుంది.ఎలా సురక్షితం?'పాన్ 2.0'లో ఈ-పాన్ కార్డ్ ఎటువంటి ఛార్జీ లేకుండా దరఖాస్తుదారు ఈ-మెయిల్‌కు వెంటనే డెలివరీ అవుతుంది. నామమాత్రపు రుసుముతో భౌతిక కార్డ్ కూడా పొందవచ్చు. కొత్త టెక్నికల్ సదుపాయాలు చేరిన తర్వాత కూడా పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి కొత్త పాన్ కార్డు రక్షణ పొందుతుందా లేదా అనే ప్రశ్న సహజమే. సైబర్ నేరగాళ్ల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి ప్రజలను రక్షించడంలో కొత్త కార్డ్ ఎంతవరకు సమర్థంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..తాజా సమాచారంకొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ కార్డ్ ఆదాయపు పన్ను శాఖ తాజా ఫార్మాట్‌కి అప్‌గ్రేడ్ అవుతుంది. దానితో మీరు మీ కొత్త డేటాను అప్డేట్ చేయవచ్చు.దుర్వినియోగానికి కళ్లెంకొత్త పాన్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్ కారణంగా, సైబర్ దుండగులు దానిని సులభంగా నకిలీ చేయలేరు. తద్వారా సైబర్ మోసాలను కట్టడి చేయడాన్ని ఇది సులభతరం చేస్తుంది.మరింత సురక్షితంకొత్త పాన్ కార్డ్ క్యూఆర్ కోడ్‌లోని వ్యక్తిగత డేటా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా అధీకృత సాఫ్ట్వేర్ ద్వారా మాత్రమే రీడ్ చేసేందుకు వీలవుతుంది. దీంతో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే సంఘటనలను ఇది తగ్గిస్తుంది. అంతే కాకుండా పాన్ ధ్రువీకరించడంలో ఆర్థిక సంస్థలకు సహాయపడుతుంది.వేగవంతమైన ధ్రువీకరణక్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా పాన్ని సులభంగా ధ్రువీకరించవచ్చు. తద్వారా సమాచార దొంగతనం, టాంపరింగ్‌కు పాల్పడటం సులభం కాదు. ఇక కొత్త ఫీచర్లు ఎంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయో చూస్తే.. ఒక వేళ అన్నింటికీ ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేస్తే.. రియల్ టైమ్ వ్యాలిడేషన్, అధునాతన డేటా అనలిటిక్స్ వంటి ఫీచర్లు కొత్త సిస్టమ్‌కు జత కలుస్తాయి. దీంతో సైబర్ భద్రతకు బలమైన వ్యవస్థ ఏర్పడుతుంది. అయితే సైబర్ సెక్యూరిటీ ముప్పులు నేడు కొత్త రూపాల్లో వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా, సమర్ధవంతంగా ఉంటుందో అన్నది రానున్న రోజులలో తెలుస్తుంది. -
తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్థులు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, పేటీఎం, ఫోన్‌పే, జీపే వంటి థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలియని నంబర్ నుంచి మెసేజ్‌లు, లింకులు వస్తే వాటిని ఓపెన్ చేయకూడదని సైబర్ పోలీసులు తెలియజేస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు చిన్నమొత్తాల్లో ఖాతాల్లోకి డబ్బు పంపించి తిరిగి ఆ ఖాతాలను లూటీ చేసేలా ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఇటీవల సైబర్ మోసగాళ్లు ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌ల ద్వారా తక్కువ మొత్తంలో నగదును ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. దాంతో డబ్బు అందుకున్న వారికి మెసేజ్ వస్తుంది. దాన్ని ఆసరాగా చేసుకుని, వారిని నమ్మించి ‘మీ ఖాతాలో నగదు జమైంది. ఈ లింక్‌పై క్లిక్ చేయండి’అంటూ మెసేజ్‌లో కింద లింక్ ఇస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే పిన్ జనరేట్ చేయమనేలా అడుగుతుంది. పొరపాటున పిన్ జనరేట్ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు ట్రాన్స్పర్ చేసుకునేందుకు పూర్తి అనుమతి ఇచ్చినట్లవుతుందని పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయంఖాతాలో గుర్తు తెలియని నంబర్ల ద్వారా చిన్న మొత్తాల్లో డబ్బు జమ అవుతుందంటే అనుమానించాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. తెలియని నంబర్ల నుంచి వచ్చిన మేసేజ్‌లను, లింక్‌లను ఓపెన్ చేయకుండా నేరుగా డెలిట్ చేయాలని చెబుతున్నారు. -
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
37 గుర్రాలను అటాచ్ చేసిన ఈడీ.. విలువ రూ.3.98 కోట్లు!
అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్‌కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్ఎల్పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్‌కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.మోసపూరిత వ్యాపార ఒప్పందాలుకునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్‌ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ, జీడీ ఇన్ఫోటెక్‌తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.రేసింగ్‌లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..కునాల్గుప్తా, పవన్ జైస్వాల్ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్‌లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్‌లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లులెక్కల్లోలేని లావాదేవీలుజీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్లీఫ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది. -
మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి
'కల్కి', 'కంగువ' సినిమాలతో సౌత్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటానీ తండ్రి మోసపోయారు. మాజీ ఎస్పీ అయిన ఈయనకు మాయమాటలు చెప్పిన ఐదుగురు వ్యక్తులు.. ఏకంగా రూ.25 లక్షలు కాజేశారు. దీంతో దిశా తండ్రి పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్)ఇంతకీ ఏం జరిగింది?దిశా తండ్రి జగదీష్ పటానీ గతంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బరేలీలో ఉంటున్నారు. ఈయనకు బాగా పరిచయమున్న శివేంద్ర ప్రతాప్ సింగ్.. దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తుల్ని పరిచయం చేశాడు. తమకు చాలా పొలిటికల్ పరిచయాలున్నాయని.. ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామని నమ్మబలికారు.కొన్నిరోజులకు వీళ్లని నమ్మిన జగదీష్ పటానీ.. రూ.5 లక్షలు డబ్బుగా, రూ.20 లక్షల మొత్తాన్ని మూడుసార్లు పలు బ్యాంక్ అకౌంట్స్‌లో జమ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు అవుతున్నా ఏ విషయం తేలకపోయేసరికి సదరు వ్యక్తుల్ని ఉద్యోగం గురించి అడగ్గా.. తొలుత వడ్డీతో సహా డబ్బు తిరిగొచ్చేస్తా అన్నారు. మరోసారి అడిగేసరికి ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇదేదో పెద్ద ఫ్రాడ్లా ఉందని అనుమాన పడిన దిశా పటానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్ల బండారం బయటపడింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్) -
ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ ఫ్రాడ్
-
గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!
ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.మోసం జరిగిందిలా..గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్ అయ్యాయి.దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది. -
సర్వే అంటారు..సర్వం దోచేస్తారు
-
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..
50 వేలు కట్టండి.. లక్ష రూపాయలు ఇస్తాం.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి మీ డబ్బులు డబుల్ త్రిపుల్ అవుతాయి.. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. ఇంత డబ్బులు చెల్లించకపోతే జైలు ఊసలు లెక్కపెడతారు..! మీ మొబైల్‌కి ఓటీపీ వచ్చిందా? అయితే ఇక్కడ టైప్ చేయండి లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..! ఈ ఆన్లైన్ గేమ్ ఆడితే రోజుకు 50 వేలు సంపాదించవచ్చు.. ఓ సారి ట్రై చేయండి..! ఇవన్నీ మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో విన్న మాటలు. ఇవి నమ్మినవాళ్లు ఇప్పటికీ చాలా డబ్బులే పొగొట్టుకోని ఉంటారు.గతంలో సైబర్ ఫ్రాడ్ అంటే ఏదో న్యూస్‌లో వస్తే విన్న సందర్భాలే కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మోసాల బాధితులు మన పక్కనే కనిపిస్తారు.. మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో కేటుగాళ్ల వలలో చిక్కుకుని మన దగ్గర లబోదిబోమని బాధపడిన సందర్భాలు ఎక్కువే ఉండి ఉంటాయి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ లెక్కలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటిపడుతున్నాయి.త్వరలోనే సైబర్ ఫ్రాడ్ మోసాల ఎకానమీ సైజు...ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటాయట. ఇది పోలీసులతో పాటు అనేకమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న వాస్తవం! ఏంటి నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే లెక్కలు వింటే మీకే అర్థమవుతోంది.రోజుకు 15,000 సైబర్ మోసాలుప్రతి 6 సెకన్లకు ఒకటి.. నిమిషానికి 10.. రోజుకు 15,000.. ఏడాదికి 50లక్షలు.. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కుకోని విలవిలలాడుతున్నడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోని వెళ్లాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ ఫ్రాడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ పౌరులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రతిరోజూ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని మొదటి ఐదు సైబర్ ఫ్రాడ్ బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక 2022లో అయితే సైబర్ ఫ్రాడ్ కేసుల్లో తెలంగాణ టాప్ పొజిషన్లో నిలిచింది. 96శాతం సైబర్ నేరాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇందులో మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం, ఇతరులతో పాటు మోసగాళ్లతో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లాంటివి చేయడం కారణంగానే సైబర్ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది.ఏడాదికి లక్షల కోట్లుసైబర్ క్రైమ్ మోసాల డబ్బుల లెక్కలు ఏడాదికి లక్షల కోట్లు దాటుతుంది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల మాట. 10.5 ట్రిలియన్ డాలర్స్ అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 87 లక్షల కోట్లు. అంటే USA, చైనా తర్వాత ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది సమానం. ఇక అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్-3లో ఉంది.2023లో ఆన్లైన్ స్కామ్స్‌లో భారత్ భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్ దాడులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ఏరియాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాల్లోనే రికార్డయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డవని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్‌స్టేషన్ గడప వరకు రాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.సైబర్ నేరాలకు హాట్స్పాట్లుముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి, కేసుల్లో దాదాపు 40శాతం సిటీస్ నుంచే రికార్డవుతున్నాయి. అయితే అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలనే కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూర్లు, టౌన్స్ నుంచి సిటీలకు చదువు కోసం ఉద్యోగాల కోసం వచ్చేవారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే విలేజ్ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుందట. అందుకే మోసగాళ్ల ట్రాప్‌లో చిక్కుకుని వీరంతా బలైపోతున్నారు.నకిలీ క్రిప్టోకరెన్సీ పాత్రసైబర్ ఫ్రాడ్ కేసుల్లో నకిలీ క్రిప్టోకరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని.. అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపెడతారు.. ఆ తర్వాత మొత్తం దోచుకుంటారు. ఇక KYC అప్డేట్ మెయిల్ లింక్స్, వాట్సాప్‌లో ఇన్స్టాంట్ లోన్ మెసేజీలు పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఇక బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలను డూప్ చేస్తూ నకిలీ ఇమెయిల్స్ పంపుతారు. ఆ మెసేజీలు అచ్చం బ్యాంక్‌వారు పంపినట్టే ఉంటాయి.. లోగో కూడా వారిదే ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న లింకులు క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్‌కు గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్లు నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రమికవేత్తలు డిజిటల్ అరెస్టుల ఫ్రాడ్లకు చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.డిజిటల్ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్లో సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు సెటప్ ఉంటుంది. నేరుగా డూప్ సీజేఐ మాట్లాడతారు..! కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతి, కష్టపడి సంపాదించుకున్నదంతా క్షణకాలంలో ఆవిరైపోతుంది. బతుకులను వీధిపాలు చేస్తుంది, ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. మీ పిల్లలను, తల్లిదండ్రులను దిక్కులేనివారిని చేస్తుంది..! సో బీకేర్ ఫుల్. -
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు, డబుల్..
-
సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్‌కార్డు - ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్‌కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు -
సైబర్ కేటుగాళ్లు.. మహారాష్ట్ర సీఎం పేరుతో రూ.40 లక్షలు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్, హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగిన కేటుగాళ్లు.. ఓ గృహిణి నుండి రూ.40 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన 40 ఏళ్ల గృహిణికి ఫెడెక్స్ కొరియర్ పేరిట కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆమె ఆధార్ నెంబర్‌తో ఎండి.ఎం.ఏ డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు.అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి, అతనికి ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయని భయపెట్టారు. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని, లేదంటే ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేసి, వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ.40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికా మహిళకు రూ.3.3 కోట్ల టోకరా.. ఈడీ అరెస్ట్
ఢిల్లీ: క్రిప్టో కరెన్సీ పేరుతో సైబర్ మోసానికి పాల్పడిన లక్షయ్ విజ్(33) అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. లిసా రోత్ అనే అమెరికా మహిళ వద్ద 3.3 కోట్లు దొచుకున్నట్లు లక్షయ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) ఆరోపణలు చేసింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం జూలై 22 (సోమావారం) లక్షయ్‌ని ఈడీ అదుపులోకి తీసుకున్న తీసుకుంది. అనంతరం అతన్ని ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు జూలై 28 వరకు ఈడీ కస్టడీ విధించింది. మరోవైపు.. అమెరికా మహిళను మోసం చేసిన పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేస్తోంది.అమెరికాకు చెందిన మహిళను నిందితుడు తాను ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా చెప్పుకొని సంప్రదించాడు. ఆమె వాడుతున్న బ్యాంక్ అకౌంట్ సురక్షితం కాదని నమ్మించాడు. అందులో ఉన్న డబ్బులను అమె బ్యాంక్ ఖాతా నుంచి క్రిప్టో కరెన్సీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని ఒప్పించాడు. ఆమె పర్సనల్ కంప్యూటర్ అనధికారిక యాక్సెస్‌ను సంపాధించి.. ఆమె పేరు మీద క్రిప్టోకరెన్సీ ఖాతాను క్రియేట్ చేశారు. ఈ ఖాతాకు 400,000 అమెరికా డాలర్లను బదిలీ చేయాలని తెలిపారు. బాధితురాలు తన బ్యాంక్ వివరాలను చెక్ చేసుకోగా.. తన డబ్బులు మాయం అయినట్లు గుర్తించారు.నిందితుడు ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి దొచుకున్న డబ్బును వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాలెట్లలోకి ట్రాన్స్ఫెర్ చేసినట్లు ఈడీ విచారణలో తెలిసింది. ఆ డబ్బును ఇండియన్ కరెన్సీలోకి నిందితులు మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బు పలు నకిలీ సంస్థలు, వ్యక్తుల ఖాలా ట్రాన్ఫర్ అయినట్లు తెలిపారు.జూన్ 6న ఈడీ నిర్వించిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పేరుతో రికార్డు అయిన ట్రాన్జాక్షన్ల ఆధారంగా వారి వద్ద ఈడీ అధికారులు స్టేట్మెంట్లు తీసుకున్నారు. లక్షయ్ విజ్.. ప్రధానంగా వాట్సాప్ గ్రూపులను ఉపయోగించి ట్రాన్జాక్షన్లు చేసిన క్రిప్టోకరెన్సీ హ్యాండ్లర్‌గా ఈడీ అధికారులు గుర్తించారు. -
తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ లింకుల్ని క్లిక్ చేయొద్దు
హైదరాబాద్, సాక్షి: రుణమాఫీ సొమ్ము జమ అవుతున్న వేళ.. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. అనవసరమైన లింకుల్ని క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్‌లో ఏపీకే(APK) లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయి. అవి క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని తెలంగాణ రైతుల్ని సీఎస్బీ అప్రమత్తం చేస్తోంది. ఒకవేళ పొరపాటున లింకులు క్లిక్ చేసి ఎవరైనా డబ్బులు పొగ్గొటుకుంటే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతోంది.మరోవైపు.. రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు, మెసేజ్ లు వస్తాయని, వాటిని ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీసులు రైతులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిని క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, అలాగే.. రుణమాఫీ పేరుతో ఎవరు ఫోన్ చేసిన మీ ఓటీపీలు, వివరాలు చెపొద్దని రైతులకు అలర్ట్ జారీ చేసింది. -
అంబానీ డీప్ ఫేక్ వీడియో : లక్షల స్కాం వెలుగులోకి
‘కూటికోసం కోటి విద్యలు’ అనేదాన్ని ‘కోటి మోసాలు’గా మార్చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్య పెట్టి, మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కోవలోకి డీప్ ఫేక్ వీడియోలు వచ్చి చేరుతున్నాయి. సామాన్యుల నుంచి, ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఆఫీసర్లు. హై ఫ్రొఫైల్ వ్యక్తుల దాకా నమ్మించి బోల్తా కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త పేరుతో డీప్ ఫేక్ వీడియో ద్వారా రూ.7లక్షలు మోసానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.ఏం జరిగిందంటే..రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేరుతో తయారు చేసిన డీప్ ఫేక్ వీడియో ద్వారా ముంబైలోని అంధేరికి చెందిన మహిళా ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ కె హెచ్ పాటిల్ నుంచి రూ.7 లక్షలు కొల్లగొట్టారు నేరగాళ్లు. అధిక రాబడి కోసం ‘రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్’ కంపెనీకి చెందిన బీసీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అకాడమీలో చేరాలని అంబానీ రికమెండ్ చేస్తున్నట్టు ఈ వీడియోను సృష్టించారు. తద్వారా తక్కువ పెట్టుబడికే, అధిక రాబడులు వస్తాయని నమ్మ బలికారు. ఏప్రిల్ 15న తన ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను చూసిన పాటిల్ ఆన్లైన్లో వెరిఫై చేయడానికి ప్రయత్నించినా కూడా అసలు విషయాన్ని పసిగట్టలేకపోయింది. లండన్, ముంబైలో కార్యాలయాలు ఉన్నాయని నమ్మి, పలుమార్లు నగదును డిపాజిట్ చేసింది. మే-జూన్ నెలల మధ్య 16 వేర్వేరు ఖాతాల్లో మొత్తంగా రూ. 7.1 లక్షలు జమ చేయగా, దీనికి రూ.30 లక్షల లాభాన్ని ఆర్జించినట్టు ట్రేడింగ్ వెబ్ సైట్లో కనిపిస్తోంది. కానీ దానిని విత్‌డ్రా చేసుకొనే అవకాశంలేకపోవడంతో అనుమానం వచ్చింది. చివరికి మోస పోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ పాటిల్ డబ్బు బదిలీ చేసిన 16 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. ఈ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సీబీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అండ్ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ల ముఠా ఒక రిటైర్డ్ ఉద్యోగిని నిలువునా ముంచేసింది. ఒకటీ, రెండూ కాదు ఏకంగా రూ.85 లక్షలను స్వాహా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒక ఎంఎన్సీ(జర్మనీకి చెందిన ఫార్మా)లో అసోసియేట్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి తన కొడుకు చదువుకోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మే 2న రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బులు అతని ఉత్తమ్ నగర్ బ్రాంచ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న ఆయన కుమారుడి వీసా అపాయింట్మెంట్ మే 17న ఉంది. ఇక్కడే ముఠా తమ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. మే 14న, తండ్రి రికార్డులను తనిఖీ చేస్తామంటూ నకిలీ ముఠా రంగంలోకి దిగింది. పథకం ప్రకారమే రెండు రోజుల పాటు స్కైప్‌లో 'ఇంటరాగేషన్’ చేసి, ఫేక్ ఐడీ కార్డులు చూపించి ఆయన్ను నమ్మించింది. నకిలీ సైబర్ క్రైమ్ డీసీపీ అంటూ బాధితుడికి మరో వ్యక్తి ఫోన్ చేశాడు. మాదక ద్రవ్యాలు , మనీలాండరింగ్ అలాంటి అనేక కేసుల్లో నీ పేరు వచ్చిందని, ఈ కేసులన్నింటికీ తన ఆధార్ లింక్ చేసి ఉన్నట్టు బెదించారు. అంతేకాదు మరొక వ్యక్తికి డయల్ చేసి,ఇతనిపై (రిటైర్డ్ ఉద్యోగి)ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అంటూ నాటకమాటాడు. ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అంటూ ఆదేశించాడు. లేదంటే జైలుకెళతావని కూడా బెదిరించాడు. దీంతో తీవ్ర భయానికి, ఒత్తిడికి లోనైనాడు. ఇంతలోనే నకిలీ డీసిపీ మళ్లీ ఫోన్ చేసి మీరు నిర్దోషిగా కనిపిస్తున్నారు, కాబట్టి. రూ.85 లక్షలు తక్షణమే చెల్లించండి. వెరిఫికేషన్ తర్వాత 15 నిమిషాల్లో తిరిగి ఇస్తానని నకిలీ అధికారులు హామీ ఇవ్వడంతో దీన్ని నమ్మిన బాధితుడు చెక్కు ద్వారా చెల్లింపు చేశారు. విశాఖపట్నంలో పోలీసులకు దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రకారం ఈ నగదును ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో హెచ్‌డిఎఫ్‌సి ఖాతాను నిర్వహిస్తున్న 'రాణా గార్మెంట్స్' అనే కంపెనీకి బదిలీ చేసింది. తరువాత దేశవ్యాప్తంగా ఉన్న మరో 105 ఖాతాలకు ఈ సొమ్మును బదిలీ చేసినట్టు తేలింది. విశాఖ బ్యాంకులోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, రిటైర్మెంట్ తర్వాత అతను పొందిన డబ్బులు, తన ఖాతా గురించి మొత్తం సమాచారం ఈ ముఠాకు తెలుసునని ఆరోపించారు. అలాగే రాణా గార్మెంట్స్ KYC వివరాలు బ్యాంకు దగ్గర లేవా ఆయన అని ప్రశ్నించారు.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉత్తమ్ నగర్ బ్రాంచ్ కూడాపోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ క్రైం బ్రాంచ్ ఈ కేసును టేకోవర్ చేసింది. కేసు దర్యాప్తులో ఉందని, తమకు కొన్ని ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. -
నకిలీల మకిలి వదిలిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ మోసగాళ్లకు చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ). సైబర్ నేరగాళ్లు అమాయకులకు గాలం వేసేందుకు వాడుతున్న నకిలీ వెబ్సైట్లు, యాప్‌లకు సంబంధించిన యూఆర్ఎల్ (యూనిఫాం రిసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయిస్తున్నారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు వాడుతున్న ఫేక్ కస్టమర్ నంబర్లను కూడా బ్లాక్ చేయిస్తున్నారు. ఒకే నకిలీ వెబ్సైట్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్‌ను వినియోగించి సైబర్ కేటుగాళ్లు మరోమారు మోసగించేందుకు అవ కాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేíÙస్తున్న టీఎస్‌సీఎస్‌బీ అధికారులు అందులోని అనుమానాస్పద వెబ్సైట్లు, యాప్‌లపై ఫోకస్ పెడుతున్నారు.శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తూ ఆయా సంబంధిత మాతృ కంపెనీలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అనుమానాస్పద యూఆర్ఎల్లను డౌన్ (డిలీట్) చేయిస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తు, విశ్లేషణ కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరో అందుబాటులోకి వచ్చిన తర్వాత నకిలీ వెబ్సైట్లు, యాప్‌ల మకిలి వదిలించే పని ముమ్మరంగా కొనసాగుతోందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా సిబ్బంది... సైబర్ మోసాలకు సంబంధించి పౌరుల నుంచి 1930 కాల్ సెంటర్‌కు లేదా సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్‌కు అందే ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ప్రధానంగా రెండు రకాల విధులను టీఎస్‌సీఎస్‌బీ నిర్వర్తిస్తోంది. బాధితులు పొగొట్టుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టకుండా బ్యాంకులకు వెంటనే సమాచారం ఇచ్చి ఆ సొమ్మును ఫ్రీజ్ చేయించడంతోపాటు కేసు దర్యాప్తు కొనసాగించడం ఒక ప్రధాన విధి. మరోవైపు సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు వినియోగించిన యాప్ లేదా వెబ్సైట్ వివరాల నుంచి అవి నిజమైనవా నకిలీవా కనిపెట్టి ఆ అనుమానాస్పద యూఆర్ఎల్ను డౌన్ చేయించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు సేకరించడం. ఇందుకోసం టీఎస్సీఎస్బీలో ప్రత్యేక సిబ్బంది పనిచేస్తున్నారు. డబ్బు పోగొట్టుకోవడంతోపాటు సెక్స్టార్షన్, సైబర్ బుల్లియింగ్‌కు గురైన బాధితుల ఫిర్యాదుల నుంచి సేకరించిన వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.టీఎస్సీఎస్బీలోని ప్రత్యేక సిబ్బంది ఓపెన్ సోర్స్ టూల్స్‌ను, ఇతర సాంకేతికతను వినియోగించి సదరు యూఆర్ఎల్ నకిలీదని గుర్తిస్తారు. ఆ తర్వాత ఆ ఫేక్ వెబ్‌సైట్‌గా గుర్తించిన యూఆర్ఎల్ యాక్టివ్‌గా ఉందా.. లేదా అన్నది విశ్లేíÙస్తారు. ఆ తర్వాత సదరు నకిలీ వెబ్సైట్ ఏ పేరుతో ఉంది..దాన్ని హోస్ట్ చేస్తున్న వర్చువల్ సర్వర్ ఐపీ అడ్రస్ గుర్తిస్తారు. హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరైతే వారికి టీఎస్‌సీఎస్‌బీ నుంచి అధికారికంగా లేఖ రాస్తారు. అదేవిధంగా ఆధారాలు పంపి..దాన్ని డౌన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా 2023లో జూన్ నుంచి డిసెంబర్ వరకు 1,457 ఫేక్ యూఆర్ఎల్లను డౌన్ చేయించారు. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 817 యూఆర్ఎల్స్ను డౌన్ చేయించారు. ఇది నిరంతరం కొనసాగుతోందని, దీనివల్ల సైబర్ నేరగాళ్లు మళ్లీమళ్లీ మోసాలకు పాల్పడకుండా కట్టడి చేసేందుకు వీలుపడుతుందని టీఎస్‌సీఎస్‌బీ అధికారులు పేర్కొన్నారు. -
IPL టికెట్లు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా?.. పోలీసుల హెచ్చరిక ఇదే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ టికెట్లు విక్రయిస్తామంటూ సైబర్ ముఠా మోసాలకు తెర తీసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి, క్యూఆర్ కోడ్లు పంపి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నై-హైదరాబాద్ మ్యాచ్‌కి టికెట్లు మొత్తం అమ్ముడుపోగా, ఆన్లైన్లో అమ్మకాలను పేటీఎం నిలిపివేసింది. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. టికెట్లపై డిస్కౌంట్ సైతం ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. క్రికెట్ అభిమానుల అప్రమతంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
ఆ లింక్‌పై క్లిక్ చేశా..రూ.2 లక్షలు పోయాయి: కీర్తి భట్ ఆవేదన
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ మయం ఐపోయేసరికి దానికి తగ్గట్లే కేటుగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఫేం కీర్తిభట్ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానల్లో తెలియజేస్తూ ఓ వీడియోని వదిలారు. అసలేం జరిగింది? ఆమె మాటల్లోనే.. ‘నాకొక ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది. వారం రోజులు అయినా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశా. వాళ్లు డెలివరీ చేశాం.. మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మికొక కొరియర్ రావాలికదా? అన్నారు. అవును ఇంకా రాలేదు అని చెప్పాను. మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు మేడం. ఒక్కసారి వాట్సాఫ్ ద్వారా మీ అడ్రస్ని పంపించండి అని ఒక నెంబర్ ఇచ్చారు. నేను కాల్ మాట్లాడుతూ.. ఆ నెంబర్‌కి అడ్రస్ పంపించాను. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అప్డేట్ కావడం లేదు.. నార్మల్ మెసేజ్ చేస్తా..దానికి రిప్లై ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్‌కి ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయమని చెప్పారు. ఆ లింక్‌ని కాపీ చేసి వాళ్లు పంపిన వేరే నెంబర్‌కి ఫార్వర్డ్ చేయమన్నారు. అలాగే చేశాను. ఆ తరువాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్నిఓపెన్ చేయమన్నారు. అడ్రస్ అప్డేట్కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన్నారు. రెండు రూపాయలే కదా అనుకొని నేను సరే అన్నాను. యూపీఐ మెన్షన్ చేయమని అన్నారు. నాకు డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదే అని చెప్పాను. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్డేట్ ఇస్తాం అని అన్నారు. వాళ్లు ఫోన్ కట్ చేసిన కాసేపటికి రెండు రూపాయిలు నా అకౌంట్ నుంచి కట్ అయ్యింది. సరే రెండు రూపాయిలే కదా అని నేను పట్టించుకోలేదు. ఆ తరువాత నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను. సరిగ్గా మిడ్నైట్ 12 గంటలకు రూ. 99 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో రూ.99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాలెన్స్ చెక్ చేస్తే..నిజంగానే రూ. 2లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు చూపించింది. . వెంటనే నాకు ఏం చేయాలో తెలియక.. కార్తీక్‌కి ఫోన్ చేస్తే.. సైబర్లో కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. సైబర్ క్రైమ్ వాళ్లు యాక్షన్ తీసుకున్నారు. ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి.. ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ల అకౌంట్లను బ్లాక్ చేయించగలిగాం. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ వాళ్లకి సెల్యూట్ చేస్తున్నా. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి’ అని కీర్తీభట్ సూచించింది. -
ఆర్థిక సైబర్ నేరాలకు చెక్
సాక్షి, అమరావతి :‘బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి. మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది చెప్పిండి’ ఇటీవల కాలంలో మితిమీరి పెరుగుతున్న కాల్స్ ఇవీ. ఆ ఫోన్ కాల్ బ్యాంకు నుంచో లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచే వచ్చిందని నమ్మి ఓటీపీ చెబితే.. బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మంతా కొల్లగొడుతున్నారు. ఇలాంటి సైబర్ మోసాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉపక్రమించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల పేరుతో మితిమీరుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇటీవల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై చర్చించాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్’ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక సిరీస్‌తో నంబర్ల కేటాయింపు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు కాల్ చేసే నంబర్లకు ప్రత్యేక సిరీస్ కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం సాధారణ టెలికాం సంస్థలు వినియోగదారులకు కేటాయిస్తున్న 10 అంకెల సిరీస్ నంబర్లనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కూడా కేటాయిస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. 2023లో అటువంటి మోసాలకు పాల్పడ్డ 1.40 లక్షల ఫోన్ నంబర్లను సైబర్ పోలీసులు గుర్తించి వాటిని బ్లాక్ చేశారు. అంటే ఈ తరహా మోసాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఆధార్ కార్డ్ అప్డేట్ లేదా పాన్ నంబర్ లింక్ చేయాలనో.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలనో రకరకాల పేరుతో బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. అవగాహనలేకో పొరపాటులో ఓటీపీ నంబర్ చెబితే నగదు కాజేస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సాధారణ టెలికాం వినియోగదారులకు కేటాయించే సెల్‌ఫోన్ నంబర్ సిరీస్ కేటాయించకూడదని హోం శాఖ తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ (ట్రాయ్) గతంలోనే సూచించిన విధంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రత్యేకంగా నంబర్ సిరీస్ (140+...)తో ఫోన్ నంబర్లు కేటాయిస్తారు. కాబట్టి ఆ సిరీస్ నంబర్ల నుంచి కాల్ వస్తేనే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చేసినట్టుగా భావించాలి. సాధారణ ఫోన్ నంబర్ల సిరీస్ నుంచి కాల్చేసి తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేస్తున్నామని చెబితే.. వినియోగదారులు వెంటనే అప్రమత్తమవుతారు. సైబర్ నేరాల ముఠాల పనేనని గుర్తించి ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్త పడతారు. మోసపోయిన సొమ్ము తిరిగి ఇప్పించేలా.. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాన్ని నిర్ణిత వ్యవధిలోనే తిరిగి ఇప్పించే ప్రక్రియను కూడా కేంద్ర హోం, ఆర్థిక శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశాయి. బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. మోసానికి పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం, ఆ ఖాతాల్లో ఉన్న మొత్తం నుంచి బాధితుల సొమ్మును వారి ఖాతాలకు మళ్లించడం అనే ప్రక్రియకు నిర్ణిత గడువును నిర్దేశించాలన్నారు. బాధితులు పదేపదే పోలీస్ స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి ఇప్పించనున్నారు. బ్యాంకులు ని ర్ణిత ఫార్మాట్లో సైబర్ పోలీసులకు సమరి్పంచాల్సిన సమాచారం నమూనాను రూపొందించారు. -
పార్ట్‌టైమ్ జాబ్ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ జాగ్రత్త!
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు. మేనేజర్ రూ.72.05 లక్షలు ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్‌ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్‌లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌సీఎస్‌బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్‌లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్‌ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్‌గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
సైబర్ కేటుగాళ్లు ఎంత దోచేశారంటే.. ప్రభుత్వం లెక్కలు!
ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ సైబర్, ఆర్థిక మోసాలు సైతం అదే స్థాయిలో పెగుతున్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో చోట ఇలాంటి మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు, ఆర్థిక సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. దేశంలో మూడేళ్లలో నమోదైన సైబర్, ఆర్థిక మోసాల కేసుల వివరాలను ప్రభుత్వం తాజాగా తెలియజేసింది. 12,000 మోసాలు.. రూ.461 కోట్లు దేశవ్యాప్తంగా మూడేళ్లలో సైబర్, ఆర్థిక మోసాలు భారీగానే జరిగాయి. ‘కార్డ్/ఇంటర్నెట్/ఏటీఎం / డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు’ కేటగిరి కింద గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం సుమారు 12,000 మోసాలు నమోదయ్యాయని ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. వీటి ద్వారా రూ.461 కోట్ల మేర బాధితులు మోసపోయారని పేర్కొంది. ఇదీ చదవండి: రుణాల ‘ఎవర్‌గ్రీనింగ్’కు చెక్.. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం మరోవైపు సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మాడ్యూల్ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 14 నాటికి నాలుగు లక్షలకు పైగా ఘటనల్లో రూ. 1,000 కోట్లకుపైగా బాధితులు మోసపోకుండా కాపాడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ టెలికాం శాఖ అందించిన వివరాలను ఉటంకిస్తూ తెలిపారు. నకిలీ పత్రాలతో తీసుకున్నవి, అనుమానిత కనెక్షన్లు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాల్లో ప్రమేయం ఉన్నవి దాదాపు 72 లక్షల మొబైల్ కనెక్షన్లను తొలగించినట్లు పేర్కొన్నారు. -
55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లు.. ప్రభుత్వం ఏం చేసింది?
దేశవ్యాప్తంగా 55.5 లక్షల ఫేక్ మొబైల్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తొలగించింది. టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ దాని దుర్వినియోగం, సైబర్ మోసాలు సైతం అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పడు చర్యలు తీసుకుంటోంది. టెలికాం వినియోగదారుల భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటుకు తెలియజేసింది. నకిలీ, ఫోర్జరీ ధ్రువపత్రాలతో పొందిన మోసపూరిత మొబైల్ కనెక్షన్లను గుర్తించి తొలగించడానికి ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ వినియోగదారులు తమ పేరుతో జారీ అయిన అన్ని మొబైల్ కనెక్షన్లను సరిచూసుకుని మోసపూరితమైన, అవసరం లేని కనెక్షన్లను నివేదించడానికి అనుమతించే సంచార్ సాథీ పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. మొబైల్ కనెక్షన్లను విక్రయించేందుకు ఇప్పటికే ఉన్న కేవైసీ మార్గదర్శకాలను మరింత బలోపేతం చేస్తూ టెలికాం కంపెనీలకు సూచనలిచ్చినట్లు చెప్పారు. 55.5 లక్షల మొబైల్ కనెక్షన్ల తొలగింపు అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎస్సెమ్మెస్ ఆధారిత సైబర్ మోసాలను 36 శాతం కట్టడి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న చర్యల ఫలితంగా సుమారు 4 లక్షల మంది పౌరులు సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోకుండా రూ. 1,000 కోట్లకు పైగా రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన అలాగే 55.5 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించినట్లు వివరించారు. వీటిలో బ్యాంక్‌లు, పేమెంట్ వాలెట్లకు లింక్ అయిన మొబైల్ కనెక్షన్లు 9.8 లక్షలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారులు నివేదించిన 13.4 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్లు రీ వెరిఫికేషన్‌లో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు చెప్పింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నివేదించిన ప్రకారం సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలకు పాల్పడినందుకు మొత్తం 2.8 లక్షల మొబైల్ కనెక్షన్లు తొలగించడంతోపాటు 1.3 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్‌తో రూ.లక్ష మాయం..
టెక్నాలజీ విస్తృతం అవుతున్నకొద్దీ సైబర్ నేరాలూ పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్‌నే బురిడీ కొట్టించి రూ.లక్ష కాజేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ కాలర్‌తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ తన బ్యాంక్ ఖాతా నుంచి సుమారు రూ. లక్ష డెబిట్ అయ్యాయని దయానిధి మారన్ ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. దయానిధి మారన్‌కు అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ అందుకున్న తర్వాత, ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 99,999 డెబిట్ అయింది. తాను బ్యాంక్ సిబ్బంది అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. దయానిధి మారన్ బ్యాంకు వివరాలు అడిగారు. కానీ ఆయన ఆ వివరాలేవీ ఆ వ్యక్తితో పంచుకోనప్పటికీ, కొద్దిసేపటికే అనధికార లావాదేవీ జరిగినట్లు గుర్తించామని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. ఎంపీ దయానిధి మారన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న అక్కడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)లో కేసు నమోదు చేశారు. మాజీ టెలికాం మంత్రి.. దయనిధి మారన్ గతంలో కేంద్ర ఐటీ, టెలికం మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. నోకియా, మోటరోలా, ఎరిక్సన్, ఫ్లెక్స్‌ట్రానిక్స్, డెల్‌తో సహా అనేక బహుళజాతి టెలికాం కంపెనీలు దేశంలో యూనిట్లను ఏర్పాటు చేశాయి. -
రూ. 854 కోట్ల భారీ సైబర్ స్కామ్.. వేలాది మంది బాధితులు
పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి రూ.వందల కోట్లు కాజేసిన భారీ సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. రూ. 854 కోట్ల సైబర్ ఫ్రాడ్ స్కామ్‌ను బెంగళూరు పోలీసులు ఛేదించారు. దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులను మోసం చేసిన ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వల.. నిందితుల ముఠా వాట్సాప్, టెలిగ్రామ్‌ల ద్వారా బాధితులను ఆకర్షించింది. మొదట్లో రోజుకు రూ.1,000 నుంచి 5,000 వరకు లాభం వస్తుందని నమ్మించి బాధితుల నుంచి రూ.1,000 నుంచి 10,000 వరకు చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెట్టించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. ఇలా వేలాది మంది బాధితులు రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు పెట్టుబడి పెట్టారని వివరించారు. బాధితులు పెట్టుబడి పెట్టిన సొమ్మును కేటుగాళ్లు ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసుకున్నారు. అయితే, పెట్టుబడి ప్రక్రియ పూర్తయిన తర్వాత, బాధితులు ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు, వారికి ఎలాంటి వాపసు రాలేదని అధికారి తెలిపారు. మొత్తం సేకరించిన తర్వాత, నిందితులు ఏకీకృత డబ్బును మ్యూల్ ఖాతాలకు (మనీలాండరింగ్‌కు సంబంధించిన) మళ్లించారని పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన మొత్తం రూ.854 కోట్లు క్రిప్టో (బినాన్స్), పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్‌ల ద్వారా వివిధ ఆన్లైన్ చెల్లింపు మోడ్‌లలోకి డంప్ చేశారని వివరించారు. -
సర్కారు డబ్బులు వచ్చాయా? ఇదో రకం సైబర్ మోసం..!
‘సరోజిని ఇంట్లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది. చేస్తున్న పని వదిలేసి, ఫోన్ అందుకుంది. గవర్నమెంట్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామనగానే తమ పొదుపు సంఘం గురించే అని, అవతలి వాళ్లు చెప్పేది వినడానికి చెవులు రిక్కించింది. ‘ప్రభుత్వం నుంచి వచ్చే పథకం మొత్తం డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయా’ అని అడిగారు అవతలి నుంచి. ‘ఇంకా రాలేదు సార్! వచ్చాక చెబుతా!’ అంది సరోజిని. ‘అంటే, మీరు వడ్డీ డబ్బులు కట్టలేదు. వడ్డీ వెంటనే కడితే వచ్చే మొత్తం జమ అవుతుంది, లేదంటే లేదు’ అని చెప్పడంతో కంగారు పడింది. ‘మా సంఘం వాళ్లందరినీ అడిగి చెబుతాను’ అంటే ‘అంత టైమ్ లేదు ఇప్పుడే కట్టేయాలి. అనడంతో తన ఖాతా నెంబర్, ఫోన్‌కి వచ్చిన నెంబర్ చెప్పింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. అంతలో అదే బృందంలో ఉండే కమల పరిగెత్తుకుంటూ వచ్చి, ‘బ్యాంక్ వాళ్లు ఫోన్ చేశారు, ఆ తర్వాత వాళ్లేదో ఓటీపీ అని అడిగారు. చెప్పగానే నా ఖాతాలో పన్నెండువేల రూపాయలు కట్ అయ్యాయి. అవి మళ్లీ వస్తాయా?!’ అని అడిగింది. అప్పుడే సరోజిని అకౌంట్ నుంచి పదివేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. చూశారుగా... సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు ఇవి. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఖాతాలో ఉన్నదంతా దోచుకుంటున్న ఈ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు సైబర్ నిపుణులు. అనుమానం రాకుండా దోపిడీ.. సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటారు. ప్రభుత్వ పథకాల పేరిట పొదుపు సంఘాల మహిళలకు ఫోన్ చేసి తెలుగు భాషలో మాట్లాడుతుంటారు. వెంటనే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెబుతారు. మీ ఖాతాలో కొంత నగదు నిల్వ ఉండాలని పొదుపు సంఘాల మహిళలకు ఫోన్లు చేస్తుంటారు. ‘తమ ఖాతాలో నగదు నిల్వ లేదు’ అని మహిళలు చెబితే ‘ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నా.. మీ ఖాతాలో డబ్బులు లేకపోవడం ఏంటని, బ్యాంకులో తగినంత నగదు లేకపోతే పథకం డబ్బులు రావని చెబుతుంటారు. నేరగాళ్ల మాటలు నమ్మి, మహిళలు తమ స్మార్ట్ ఫోన్లోని మనీ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఏ మాత్రం నమ్మకూడదు. మోసగాళ్ల బారిన పడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పకూడదు. ఈ సైబర్ మోసాల పట్ల గ్రామీణ మహిళలు అవగాహన పెంచుకోవాలి. తెలిసిన వారు గ్రామీణ మహిళలను సైబర్ నేరాల పాలిటపడకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను తెలియజేయాలి. వెబ్సైట్ అయితే.. ప్రభుత్వ సైట్లు.. అంటే, ఆయుష్మాన్ యోజన, కిసాన్ యోజన, జన్ ధన్ యోజన వంటి పోర్టల్‌లు, అనేక నకిలీ వెబ్సైట్లు ప్రజలను మోసగించడానికి స్కామర్లకు సాధారణ పద్ధతిగా మారాయి. ఈ మోసపూరిత వెబ్సైట్లు తరచుగా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల రూపకల్పన, కంటెంట్‌ను అనుకరిస్తాయి. వారు ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటారు. అటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి, మీరు తీసుకోవలసిన కొన్ని చర్యలు: అధికారిక ప్రభుత్వ డొమైన్‌తో సరిపోలుతుందని నిర్ధారించుకోవడానికి వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని చెక్ చేయాలి. ప్రభుత్వ వెబ్సైట్లు సాధారణంగా భారతదేశంలో ‘gov.in‘ వంటి స్థిరమైన డొమైన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డొమైన్ లో అక్షరదోషాలు లేదా వైవిధ్యాలు ఉన్న వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. వినియోగదారుల డేటాను రక్షించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు సురక్షిత కనెక్షన్లను (HTTP) ఉపయోగిస్తాయి. సైట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి అడ్రస్ బార్ లో ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని తనిఖీ చేయాలి. అధికారిక మూలాలు: అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు లేదా అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లలో అందించిన సమాచారం, లింక్‌లను మాత్రమే నమ్మాలి. లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఈ–మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల నుండి సమాచారాన్ని షేర్ చేయడం మానుకోవాలి. మీకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ పథకాన్ని అధికారిక మూలాల నుండి నేరుగా పరిశోధించాలి. ఇది మీకు అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తెలియని వెబ్సైట్ల సమాచారంపై మాత్రమే ఆధారపడకూడదు. పథకం లేదా ఆఫర్ ప్రామాణికత గురించి మీకు ఖచ్చితంగా తెలియకుంటే, వివరాలను ధృవీకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారిక హెల్ప్‌లైన్ లేదా కస్టమర్ సేవను సంప్రదించాలి. ప్రభుత్వ పథకాలకు సాధారణంగా రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు అవసరం లేదు. ఏదైనా ప్రయోజనాన్ని అందించే ముందు ఫీజు చెల్లించమని వెబ్సైట్ మిమ్మల్ని అడిగితే జాగ్రత్తపడాలి. ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే, అది బహుశా అలానే ఉంటుంది. స్కామర్లు బాధితులను తమ ఉచ్చులోకి లాగేందుకు తరచుగా మనోహరమైన వాగ్దానాలను ఉపయోగిస్తారు. ఈ మోసాల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా పడకుండా వారికి అవగాహన కల్పించండి. మోసపోయామని గ్రహిస్తే బాధితులు వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. 1930కి కాల్ చేయవచ్చు. https://www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. (చదవండి: భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!) -
Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు
పశ్చిమ గోదావరి: ఉండి మండలం పెదపుల్లేరులో సైబర్ మోసంపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామకృష్ణంరాజుకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి మార్చి నెల 28న కరెంటు బిల్లు కట్టలేదని.. కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. దానిలో ఫోన్ నంబర్ ఉండడంతో.. కరెంట్ బిల్లు కట్టానని సదరు వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. మీకు ఓ లింక్ పంపుతున్నాము దానిని క్లిక్ చేస్తే తెలుస్తుందని చెప్పడంతో క్లిక్ చేశాడు. అందులో కరెంట్ బిల్లు కట్టినట్లు తెలియడం లేదని గుర్తు తెలియని వ్యక్తికి రామకృష్ణంరాజు ఫోన్ చేసి చెప్పాడు. ఓ నంబర్ పంపుతున్నాం.. దానికి రూ.5 ఫోన్ పే ద్వారా పంపితే తెలుస్తుందని చెప్పడంతో దానికి నగదు పంపించారు. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో.. ఏం జరిగిందో తెలియని రామకృష్ణంరాజు దానిని వదిలేశారు. ఈ నెలలో బ్యాంకుకు వెళ్ళి ఖాతాను పరిశీలిస్తే మార్చి నెల 28న తన ఖాతా నుంచి రూ.1.85 లక్షలు మాయమైనట్లు గమనించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుపై ఎస్సై కే.గంగాధరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్లైన్ లింక్‌లు క్లిక్ చెయొద్దని ఆలా చేస్తే మోసాలు తప్పవని ఎస్సై తెలిపారు. ఎవరైనా అలాంటివి పంపిస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్‌క్రైం పోలీసులకు తెలియచేయాలని సూచించారు. -
కొత్త రకం మోసం.. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని లావాదేవీలు..
సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’ ... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్‌ను కొత్త ఫోన్లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు. సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు. ఎక్కువగా ఈ దేశాల నుంచే.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్బీఐ ఏం చేయాలంటే.. ♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెట్టాలి. ♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. ♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి. ♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి. -
పర్సు ఇంట్లో మరిచిపోయా.. కాల్ చేస్తే స్విచాఫ్.. న్యాయవాదికే మస్కా కొట్టిన కేటుగాళ్లు
జయపురం(భువనేశ్వర్): ‘సార్.. పర్స్ ఇంట్లో మరచిపోయాను. చికిత్స కోసం డబ్బు అవసరం. ఫోన్ పేలో పంపించగలరు. ఉదయం 11గంటలకు తిరిగి ఇస్తా’నని కొరాపుట్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బీరేష్ పట్నాయక్‌కు ఓ సైబర్ నేరగాడి నుంచి ఫోన్ వచ్చింది. పరిచయస్తుని పేరు చెప్పడంతో అతను కూడా వివిధ దఫాలుగా రూ.30 వేలు జమ చేశారు. అయితే కొద్ది సేపటికే ఫోన్ స్విచాఫ్ రావడం, డబ్బు తిరిగి జమ కాకపోవవంతో మోసపోయానని గ్రహించిన న్యాయవాది జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బాధితుడి వివరణ ప్రకారం... మంగళవారం ఉదయం 7750874432 నంబర్ నుంచి ఫోను వచ్చింది. తనకు తెలిసిన వ్యక్తి దాస్ బాబుగా పేరు చెప్పి, ఆస్పత్రిలో ఉన్నానని.. చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా, పర్స్ మర్చిపోయానని తెలిపాడు. రూ.10 వేలు అవసరం అయ్యాయని, ఇంటికి వచ్చి ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అడిగినంత ఫోన్ పే చేశారు. కొద్ది సేపటికే మరో రూ.10 వేలు అడగ్గా, మళ్లీ బదిలీ చేశారు. అనంతరం ఫోన్ చేసి ఫోన్ పేలో రూ.30 వేలు పంపానని నకిలీ రసీదు వాట్సాప్‌కు పంపించాడు. పారపాటున రూ.10 వేలు అధికంగా జమయ్యాయని, మిగతా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలని కోరడంతో తిరిగి జమ చేశారు. అయితే అకౌంట్లో చూడగా నగదు లేకపోవడం, సంబంధిత వ్యక్తి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన అతను.. పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో! -
ఫోన్‌కు స్పందించొద్దు.. వివరాలు చెప్పొద్దు
సిద్దిపేటకమాన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌కమిషనర్ శ్వేత అన్నారు. లాటరీ, లోన్, బహుమతి పేరుతో, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని వచ్చే ఫోన్‌కాల్స్‌కు ఎవరూ స్పందించకూడదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలు చెప్పొద్దన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం సైబర్ మోసాల ద్వారా పోగొట్టుకున్న వాటిలో రూ.46,55,964 ఫ్రీజ్ చేశామని, త్వరలో విడతల వారీగా సంబంధిత బాధితుల ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన పలు సైబర్ నేరాలపై సీపీ తెలిపిన వరాల ప్రకారం.. ఇండియన్ బుల్స్ కంపెనీ పేరుతో.. సిద్దిపేట వన్‌టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఒకరు ఫోన్‌చేసి ఇండియా బుల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మీకు లోన్ మంజూరైంది... లోన్ ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తి సూచించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు గుర్తు తెలియని వ్యక్తి సూచించిన నంబర్‌కు ఫోన్ ఫే ద్వారా రూ.10,653 పంపించాడు. తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని గుర్తు తెలియని వ్యక్తి భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. లోన్‌యాప్ పేరిట.. రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్లైన్లో లోన్ టీకాయాప్లో లోన్ తీసుకుని తిరిగి మిత్తితో సహా అసలు మొత్తం డబ్బు చెల్లించాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో బాధితుడు ఆన్లైన్లో రూ.6,100 పంపించాడు. అనంతరం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు పంపించాలని లేదంటే నీ ఫొటోలు న్యూడ్‌గా ఎడిట్ చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాధితుడిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ డీపీతో... రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని డబ్బులు పంపించాలని కోరాడు. స్పందించకపోవడంతో ఆమె డీపీ (ఫొటో)ను ఉపయోగించి వేరే ఫోన్‌నంబర్ ద్వారా వాట్సాప్ క్రియేట్ చేశాడు. మెసేజ్ పంపించగా స్పందించిన బాధితురాలు ఆన్లైన్లో రూ.5 వేలు పంపించింది. తర్వాత విచారణ చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపినట్టు సైబర్ మోసం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. -
నల్లగొండ జిల్లాలో ఫిష్ గ్రూప్ పేరిట సైబర్ మోసం
-
డిజిటల్ చెల్లింపుల్లో పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
ముంబై: సైబర్‌సెక్యూరిటీ రిస్కులను సమర్ధమంతంగా ఎదుర్కొనేలా, డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మార్చేలా అధీకృత నాన్-బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు (పీఎస్వో) రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ముసాయిదాను ప్రకటించింది. సైబర్‌సెక్యూరిటీ రిస్కులను గుర్తించడం, మదింపు చేయడం, సమీక్షించడం, ఎదుర్కొనడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. ఇదీ చదవండి: రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్ వైరల్ డిజిటల్ పేమెంట్ లావాదేవీలను సురక్షితంగా చేసేందుకు తీసుకోతగిన భద్రతాపరమైన చర్యలను సూచించింది. సమాచార భద్రతపరంగా రిస్కులు తలెత్తకుండా పీఎస్వో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బోర్డు) బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ముసాయిదాలో ప్రతిపాదించింది. దీని ప్రకారం సైబర్ దాడులను గుర్తించి, స్పందించి, కట్టడి చేసి, రికవర్ చేసేందుకు పీఎస్వోలు .. సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళిక (సీసీఎంపీ)ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. (10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో నెక్సన్ ఈవీ మ్యాక్స్: ధర ఎంతో తెలుసా?) తమ సంస్థలో కీలక హోదాల్లో ఉన్న వారు, అసెట్లు, ప్రక్రియలు, కీలకమైన కార్యకలాపాలు, థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు మొదలైన వివరాలను రికార్డు రూపంలో ఉంచాలి. డేటా భద్రతకు సంబంధించి సమగ్రమైన డేటా చోరీ నివారణ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. పరిశ్రమ వర్గాలు ఈ ముసాయిదాపై జూన్ 30లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. మరిన్ని ముఖ్యమైన వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
వాట్సాప్‌లో చీటింగ్!
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలకు పైఎత్తులు వేస్తున్నారు. సాధారణ స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) ఫిల్టర్లను ప్రవేశపెట్టినప్పటికీ అంతకు మించి దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల వాట్సాప్ కాల్స్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో సుమారు 480 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులుండటం, ప్రపంచంలోనే అతిపెద్ద వాట్సాప్ కేంద్రం కావడంతో సైబర్ నేరగాళ్ల దృష్టి మనపై పడింది. అంతర్జాతీయ నంబర్లతో.. వాట్సాప్ వినియోగదారులకు ఎక్కువగా ఇథియోపియా (+25), మలేషియా(+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), మాలి (+223), గినియా (+224) వియత్నాం (+84)తో పాటు మరికొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ నంబర్లతో పదేపదే వాట్సాప్ కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆగ్నేయాసియా దేశాల ఐఎస్డీ కోడ్లతోనే కాల్స్ వస్తున్నాయి. కనిపెట్టడం కష్టం.. అంతర్జాతీయ నంబర్లతో వస్తున్న వాట్సాప్ కాల్స్ ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఐఎస్డీ కోడ్‌తో వచ్చే వాట్సాప్ కాల్‌ను మోసగాళ్లు అదే దేశం నుంచే చేస్తున్నట్లు నిర్ధారించలేం. విదేశాల్లో ఉండే వారి ద్వారా అక్కడి నంబర్ తీసుకుని వేరే దేశంలో ఉంటూ వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని మోసపూరిత కాల్స్ చేయవచ్చు. బయట మార్కెట్లో చాలా ఏజెన్సీలు నేరగాళ్లకు అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. ‘మనీ ఫర్ లైక్స్’ స్కామ్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా జాబ్ ఆఫర్లను పంపడం కొత్త రకం స్కామ్. ఇంటి నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు. యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని, టెలిగ్రామ్ చానెల్లో చేరాలని నమ్మబలుకుతారు. యూట్యూబ్ వీడియోల లైక్ బటన్ నొక్కడం, పోస్టులపై కామెంట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ను ప్రచారం చేయడం లాంటి పనులు చేయాలని చెబుతారు. బాధితుడిని నమ్మించడానికి తొలుత చిన్న చిన్న టాస్క్‌లు అప్పగించి చెల్లింపులు జరుపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ టాస్క్‌లను కేటాయిస్తారు. అయితే ఈసారి ముందస్తుగా భారీగా డిపాజిట్ చేయాలని కోరతారు. ఇక్కడే బాధితులు మోసపోతున్నారు. డిపాజిట్లు వసూలు చేసుకున్నాక నేరగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో నగదు రిటర్న్‌లతో నకిలీ సమస్యను సృష్టిస్తారు. యూజర్లు తమ టాస్క్‌లకు వచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు కొంత మొత్తం చెల్లించాలని వసూలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే బాధితులను స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్ల పేరుతో.. నేరగాళ్లు ‘ఏఐ’ చాటున స్పూఫింగ్ ద్వారా బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి మెసేజ్ కాల్ వస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి ఫోన్ మాట్లాడుతుండగా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపి మోసాలకు పాల్పడుతున్నారు. అనాథలు, ప్రకృతి విపత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. భావోద్వేగాలకు గురి చేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతో కాజేస్తున్నారు. లైక్ చేస్తే అంతే.. యూట్యూబ్ టాస్క్‌లు, వాట్సాప్‌కు వచ్చే లింక్‌లను ఒక్కసారి లైక్ చేస్తే సదరు యూజర్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ మరుక్షణం నుంచి గూగుల్ మెయిల్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైళ్లను సులభంగా తెలుసుకోగలుతారు. ఇందులో భాగంగానే నిత్యం ఈ–మెయిళ్లకు అనేక ప్రమోషనల్ మెయిళ్లు, లోన్ వచ్చినట్టు లింక్‌లు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే యూజర్ మీడియా యాక్సెస్ మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేస్బుక్లో యూజర్ ప్రొఫైల్‌ను బట్టి రకరకాల మోసపూరిత ఆఫర్లతో ప్రలోభపెడతారు. ఆ లింక్‌లపై క్లిక్ చేసి నగదు చెల్లిస్తే వస్తువులు ఎప్పటికీ డెలివరీ కావు. కొన్ని సందర్భాల్లో అశ్లీలతను జొప్పించి ట్రాప్ చేయడం పరిపాటిగా మారింది. వీడియో కాల్స్‌తో బ్లాక్ మెయిల్ మోసగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేందుకు వాట్సాప్ వీడియో కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు రకరకాల నంబర్ల నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అవతల మహిళ అశ్లీలంగా కనిపిస్తుంది. కాల్ డిస్కనెక్ట్ చేసేలోగా నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ తీస్తారు. ఆ తర్వాత బాధితుడికి పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. మరికొన్ని ఘటనల్లో వీడియో కాల్స్ వస్తున్నప్పటికీ యూజర్ స్క్రీన్‌పై ఎటువంటి ఆడియో లేకుండా ఖాళీ వీడియో కనిపిస్తుంది. చూస్తుండగానే కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను పంపి డబ్బులు ఇవ్వకుంటే యూజర్ కాంటాక్ట్‌లకు పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతారు. ఆ కాల్స్‌ను బ్లాక్ చేయండి సైబర్ మోసగాళ్లు అనేక విధాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తారు. వాట్సాప్‌లో అవాంఛిత, అంతర్జాతీయ కోడ్లతో ఫోన్లు వస్తే తిరస్కరించాలి. పదేపదే వస్తుంటే బ్లాక్ చేసి వాట్సాప్‌లోనే రిపోర్టు చేయాలి. ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే యూజర్ డేటా మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుపోతుంది. తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. డిస్కౌంట్లు, చెకింగ్‌ల పేరుతో ఎవరూ ఫోన్ చేసినా వివరాలు చెప్పొద్దు. సైబర్ మోసాలకు గురైన బాధితులు నేషనల్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దార్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
సంగారెడ్డి జిల్లా అమిన్ పురలో భారీ సైబర్ మోసం
-
యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా..
► ఏప్రిల్ 14న అనంతపురంలోని ఓ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న విక్రమ్‌కు వీడియోకాల్ వచ్చింది. ఆన్ చేయగానే యువతి నగ్నంగా కనిపించింది. ఇంకేముంది విక్రమ్ ఆసక్తిగా మాట్లాడాడు. కాల్ పూర్తయ్యాక వీడియో రికార్డింగ్ మొత్తం మొబైల్‌కు వచ్చింది. తర్వాత ఆ యువతి డబ్బు డిమాండ్ చేసింది. ► అనంతపురం సాయినగర్‌లో కేఫ్ యజమానికీ ఇలాగే కాల్ రావడంతో మాట్లాడాడు. అమ్మాయి మాటలు నమ్మి ఇంటి చిరునామా, పర్సనల్ మొబైల్ నంబర్ అన్నీ ఇచ్చాడు. మాట్లాడిన వీడియోలు పంపుతూ టార్చర్ పెడుతోందని వాపోయాడు. మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతానంటూ కూడా భయపెడుతోందని తెలిపాడు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏదో రకంగా డబ్బు సంపాదించాలి.. కష్టపడకుండానే డబ్బు వచ్చి ఒళ్లో వాలిపోవాలి. చుక్క చెమట పట్టకుండా లక్షాధికారులు కావాలి.. పెడదారిలో వెళుతున్న యువత ఆలోచనలు ఇవీ. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత బ్లాక్‌మెయిలింగ్ మరింతగా పెరిగింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మాయ చేసి మోసగిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో జరిగిన కొన్ని ఘటనలతో కుర్రాళ్లు బెంబేలెత్తుతున్నారు. ఆశ పడితే.. అధోగతే! కొంతమంది అమ్మాయిలు వీడియోకాల్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే నగ్నంగా కనిపిస్తారు. వెంటనే ఫోన్ కట్ చేస్తే ఫరవాలేదు. కొంతమంది కుర్రాళ్లు ఇలాంటి దృశ్యాలు చూసి ‘ఆశ’గా మాటలు కలుపుతారు. కుర్రాళ్లను కూడా బట్టలు లేకుండా వీడియోకాల్‌లోకి రావాలని కోరుతారు. ఈ వీడియోను రికార్డింగ్ చేస్తారు. ఇలా మాట్లాడుతుండగానే ఫోన్‌కట్ అవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ కాల్ చేస్తారు. బ్లాక్మెయిల్ ఇలా చేస్తున్నారు.. ఎవరైతే వీడియోకాల్‌లో మాట్లాడారో ఆ వీడియోను మొబైల్‌కు పంపిస్తారు. అనంతరం డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే ఈ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తారు. ఈ వీడియోలో ఇరువురి ఫొటోలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా అబ్బాయిలు కలవరపాటుకు గురవుతారు. ఎంతోకొంత ఫోన్ పే చేసి వదిలించుకుంటారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇది ఒకరకంగా హనీట్రాప్ లాంటిదని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తం సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. మనకు తెలియని వ్యక్తులు వీడియోకాల్ చేసినా, లింక్‌లు పంపినా వాటిని క్లిక్ చేయొద్దు. చాలామంది మొబైల్స్‌లో ఇలాంటి లింకులతో కొత్త యాప్ చేరి మన ఆధారాలన్నీ దొంగల చేతికి వెళుతున్నాయి. ఖాతాల్లో సొమ్ము పోవడానికీ ఇదే కారణం. మొబైల్లో ఉన్న ఇలాంటి దొంగ యాప్‌లను తొలగించడం కూడా చాలామందికి తెలియదు. అందుకే పోలీసులతోనే వీటిని మొబైల్‌నుంచి ఎలా తొలగించాలో ప్రొజెక్టర్ల ద్వారా చూపించి చేయాలని నిర్ణయించాం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్స్‌లో ప్రమాదకర యాప్‌లను తొలగించే ప్రక్రియ చేపడుతున్నాం. – ఆర్ఎన్. అమ్మిరెడ్డి, డీఐజీ, అనంతపురం రేంజ్ -
ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు
రైల్వే ప్రయాణికుల్ని ఐఆర్సీటీసీ అప్రమత్తం చేసింది. irctcconnect.apk పేరుతో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవద్దని సలహా ఇచ్చింది. ఇండియన్ రైల్వే పేరుతో ఓ ఫేక్ యాప్ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్, టెలిగ్రాంలలో ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన ఐఆర్సీటీసీ అధికారులు.. సర్క్యులేట్ అవుతున్న ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని తెలిపారు. సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం అడ్డదార్లు తొక్కుతున్నారని, వినియోగదారులు వ్యక్తిగత యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ వివరాల్ని సేకరించి వాటి ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు సూచించింది. కాబట్టి యూజర్లు ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ యాప్స్‌నే డౌన్లోడ్ చేసుకోండి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లు, యాప్స్‌ను పోలి ఉండేలా సైబర్ నేరస్తులు ఫేక్ వెబ్సైట్లు, యాప్స్‌ను తయారు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం కలగకుండా ఈ యాప్‌తో కూడిన మోసపూరిత లింక్ (ఫిషింగ్ అటాక్)లను ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునేవారికి సెండ్ చేస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్‌ను క్లిక్ చేస్తే ..ఫిషింగ్ దాడికి గురైన బాధితుల నుండి యూపీఐ వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ సమాచారంతో సహా సున్నితమైన నెట్ బ్యాంకింగ్ వివరాల్ని దొంగిలిస్తున్నారు. ఇక నేరస్తులు ఐఆర్సీటీసీ పేరుతో షేర్ చేస్తున్న లింక్‌లతో యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐఆర్సీటీసీ అఫిషియల్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ వంటి మొబైల్ యాప్స్‌ను గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ల నుంచి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
సైబర్ మోసంలో డబ్బు పొగొట్టుకున్న భార్య.. తలాక్ చెప్పిన భర్త
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుందని భార్యకు తలాక్ చెప్పాడో ఓ వ్యక్తి. ఈ విచిత్ర ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కేంద్రపరా జిల్లాకు చెందిన 32 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పోగొట్టుకుంది. గుజరాత్లో ఉన్న తన భర్త ఈ విషయం తెలుసుకుని ఏప్రిల్ 1న తనకు మూడుసార్లు తలాక్ చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు చట్ట విరుద్ధంగా విడాకులు ఇచ్చారని వాపోయింది. ఆ దంపతులకు పెళ్లై 15 ఏళ్లు, పైగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె సైబర్ నేరగాళ్ల చేతిలో ఎలా డబ్బులు పోగొట్టుకుందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఏక్నాథ్ షిండే అయోధ్య పర్యటన: 'మా నమ్మకాలకి సంబంధించింది') -
డేటా లీకు మూలం ‘పునరుద్ధరణే’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 16.8 కోట్ల మంది డేటా లీకు కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రక్షణ శాఖతో పాటు టెలికం, విద్యుత్, ఇంధనం వంటి కీలకమైన ప్రభుత్వ సంస్థల వ్యక్తిగత సమాచారం కూడా తస్కరణకు గురికావటాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల నుంచే ఈ కీలక సమాచారం బహిర్గతమైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల రెండో రోజు కస్టడీ విచారణపూర్తిగా ప్రభుత్వ సంస్థల డేటా లీకు మూలాలను కనుక్కొనే దిశలోనే సాగింది. వెబ్సైట్ల పునరుద్ధరణ నుంచే లీకు.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖతో పాటు పలు కేంద్ర సంస్థలకు చెందిన వెబ్సైట్లను పునరుద్ధరణ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డుల నిర్వహణ సేవలను థర్డ్ పార్టీలకు అందిస్తుంటాయి. ఇదే తరహాలో కేంద్ర సంస్థల వెబ్సైట్ల రీడెవలప్ సేవలు కూడా ఆయా యాజమాన్యలు ఐటీ కంపెనీలకు అందించాయి. నోయిడా, ముంబైకి చెందిన ఔట్సోర్సింగ్ కంపెనీల నుంచే ఈ వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని సైబరాబాద్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు.. నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న 12 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, వెబ్సైట్లను సైబరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ పోలీసు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (టీఎస్పీసీసీ) విశ్లేషించి.. పలు కీలక సమాచారాన్ని గుర్తించినట్లు తెలిసింది. పలు అనుమానిత ఈ–మెయిల్స్, వెబ్‌పేజీలను వినియోగించే చిరునామా యూనిఫాం రిసోర్స్ లొకేటర్ (యూఆర్ఎల్)లను గుర్తించారు. వీటిని నిర్ధారించేందుకు టెలికం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ)లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈమేరకు పలు కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం గొలుసుకట్టు తరహాలో ఉండటంతో మరింతమంది ఈ కేసులో అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రకోణం ఉంటే కేసు ఎన్ఐఏకు బదిలీ? బహిరంగ మార్కెట్లో నిందితులు అమ్మకానికి పెట్టిన డేటాలో 2.60 లక్షల మంది రక్షణ శాఖకు చెందిన వ్యక్తిగత సమాచారం కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికే పలుమార్లు సైబరాబాద్ పోలీసులతో హైదరాబాద్, ఢిల్లీకి చెందిన రక్షణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) అధికారులు కూడా భేటి కానున్నట్లు తెలిసింది. సైబర్ మోసాల కోసమే డేటా చోరీ చేశారా లేక ఏమైనా ఉగ్రకోణం దాగి ఉందా అని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఉగ్రకోణం అంశాలు వెలుగులోకి వస్తే గనక ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఏడుగురిలో నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్ రెహ్మాన్ కీలకమని పోలీసుల విచారణలో తేలింది. ఇతను ముంబైకి చెందిన ఓ వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసి, జస్ట్ డయల్, డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గ్లోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో, ఇన్‌స్పైరీ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ డేటాను విక్రయించేవాడు. -
యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50
హైదరాబాద్: యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామని వల వేసి..తొలుత లాభాలు ఇచ్చి నమ్మించి..ఆ తర్వాత కొల్లగొట్టారు సైబర్‌నేరగాళ్లు. ఇలా ఆరుగురి వ్యక్తుల నుంచి దాదాపు రూ.75 లక్షల మేర లూటీ చేయడంతో వారంతా సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఒక్కరోజులో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇంత పెద్ద మోతాదులో సైబర్ కేటుగాళ్లు డబ్బు కాజేయడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే..భరత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి పార్ట్‌టెం జాబ్ ఉందంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉన్న ఆ యువకుడు వాట్సప్ మెసేజ్‌లో ఉన్న ఫోన్‌నెంబర్‌కు కాల్ చేసి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం వచ్చేలోపు తాము పంపే యూట్యూబ్ వీడియోస్‌కు లైక్ కొట్టాలన్నారు. ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామన్నారు. కొద్దిరోజులు ఇలా లైక్ రూ.50 చొప్పున చెల్లించారు. దీంతో వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. ఆ తర్వాత పలు దఫాలుగా రూ.25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడి పెట్టించి ఎగ్గొట్టారు. సిటీకి వలస వచి్చన రైతుకు కూడా ఇదే తరహాలో మెసేజ్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ సమయంలో కోటీశ్వరులు కావొచ్చన్నారు. దీనికి ఒప్పుకున్న రైతు నుంచి పలు దఫాలుగా రూ.25 లక్షలు కాజేశారు. షేక్‌పేట్‌కు చెందిన యువకుడికి పార్ట్‌టెం ఉద్యోగమని చెప్పి రూ.9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయించారు. యూసఫ్‌గూడ వాసి నుంచి రూ.10 లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కూడా ఇదే పంథాలో కాజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. -
ఓటీపీ..డబ్బంతా లూటీ
ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు. సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తతే రక్షా కవచం మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్) సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు : ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్) టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112 జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930 -
ఆ ఉచ్చులో పడితే అంతే.. చైనాలో సూత్రధారులు.. ఉత్తరాదిలో పాత్రధారులు
మాజీ సైనికోద్యోగి నుంచి 21 లక్షలు.. పదవీ విరమణ చేసిన ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.53 లక్షలు.. ఓ వ్యాపారి నుంచి రూ.48 లక్షలు.. కేవలం గత మూడు రోజుల్లో పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము ఇది. కేవలం లైకులు కొడితే చాలంటూ.. ఇంటి నుంచే పనిచేస్తూ సంపాదించుకోవచ్చంటూ.. గాలం వేసి డబ్బులు కాజేస్తున్న ఈ తరహా నేరాలు బాగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌లు అంటూ వచ్చే మెసేజీలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న సందేశంతో మొదలై.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని.. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంటి నుంచే సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేసే ఈ ముఠాలు వర్చువల్ నంబర్లతోపాటు నకిలీ గుర్తింపుకార్డులతో తీసుకున్న ఫోన్ నంబర్లతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తాయి. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్ చేస్తే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లోని గ్రూపులు తెరుచుకుంటాయి. అక్కడ ఈ పార్ట్‌టైమ్ జాబ్‌ల వివరాలు ఉంటాయి. కేవలం లైకులు కొడితే చాలు డబ్బులు వస్తాయని.. తనకు నెల రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము వచ్చిందని.. ఇందులో చేరితే బాగుంటుందని.. ఇలా ఆ గ్రూపుల్లో చర్చలు జరుగుతుంటాయి. ఇలా కామెంట్స్ చేసే వారంతా ఆ సైబర్ క్రైమ్ ముఠా వారే ఉంటారు. అవి చూసిన అమాయకులు ఆశతో ముందడుగు వేస్తారు. యాప్స్, వాలెట్స్‌లో డబ్బులు జమ చేయించి.. సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తితో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. ప్రత్యేక యాప్స్, వెబ్సైట్లకు చెందిన లింకులను పంపుతారు. వాటిలో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతారు. అందులో ఉండే వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని.. దానికి అనుగుణంగా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ విధానంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. స్కీమ్ ఎంపిక చేసుకుని, డబ్బులను అందులో జమ చేశాక.. వరుసగా వీడియోలు వస్తుంటాయి. వాటిని లైక్ చేస్తూ పోవాలని, ప్రతి లైక్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు వస్తాయని చెబుతారు. ఇలా లైకులు చేసే కొద్దీ అందుకు సంబంధించిన సొమ్ము బాధితుడి వర్చువల్ ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. చిన్న మొత్తాలు ఇచ్చి.. పెద్ద మొత్తానికి గాలమేసి.. బాధితులు జమ చేసిన మొత్తం, లైకుల ద్వారా సంపాదించిన సొమ్ము వారి వర్చువల్ ఖాతాలోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే సొమ్ము బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో కొంతమొత్తం సొమ్మును ఒకట్రెండు సార్లు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని, డ్రా చేసుకోవడానికీ అవకాశమిస్తారు. ఇలా పూర్తిగా నమ్మించి.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వీడియోలను లైక్ చేసే అవకాశం వస్తుందని.. ఎక్కువ లాభం వస్తుందని గాలం వేస్తారు. దీంతో కొందరు బాధితులు లక్షల్లో సొమ్మును యాప్స్/వాలెట్లలోకి జమ చేస్తారు. వీడియోలు లైక్ చేసిన కొద్దీ వచ్చే సొమ్ము వారి వర్చువల్ ఖాతాలో కనిపిస్తుంటుంది. ఇక్కడే మరింత మోసం మొదలవుతుంది. వర్చువల్ ఖాతాల్లో భారీగా సొమ్ము కనిపించినా.. బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇవ్వరు. అలా డ్రా చేసుకోవాలంటే, రూల్ ప్రకారం మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలంటూ.. బాధితులతో వీలైనంత మేర జమ చేయిస్తారు. ఆ సొమ్మంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్టే. తర్వాత ఆ యాప్/ వెబ్సైట్ మాయమైపోతాయి. తమ ఫోన్‌కు వచ్చిన లింకులు, వెబ్ అడ్రస్‌ల ద్వారా తెరవడానికి ప్రయత్నించినా.. సదరు యాప్స్/వెబ్సైట్లు అందుబాటులో లేవని చూపిస్తుంది. ఇలాంటి సైబర్ గ్యాంగులు దేశవ్యాప్తంగా అమాయకులకు గాలం వేసి వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఎక్కువగా పంజా విసరుతున్నాయి. లైకులు, ఇన్వెస్ట్మెంట్స్, సేల్స్ పేరుతో జరిగే ఈ స్కామ్స్‌కు చైనీయులే సూత్రధారులని.. ఉత్తరాది రాష్ట్రాల వారి సాయంతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కేవలం లైకులు, షేర్లు చేయడం వల్ల డబ్బు రాదని.. తెలియని అంశాల్లో పెట్టుబడులు వద్దని సూచిస్తున్నారు. చదవండి:ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే? -
వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..
వైఎస్సార్ జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేశారని పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కడప పోలీసులు విచారణ చేపట్టగా.. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠా గుట్టు రట్టయింది. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దందా బట్టబయలైంది. కడప పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.50 లక్షలు గల్లంతయ్యాయి. దీనిపై విచారించగా హరియాణలోని ఓ ముఠా దందా వెలుగుచూసింది. ఆన్లైన్లో రుణాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ ఆయన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కాపీలతోపాటు వేలిముద్రలు కూడా తీసుకుంది. అనంతరం క్లోనింగ్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేసేసింది. సాక్షి, అమరావతి: దేశంలో కొత్తరూపు సంతరించుకుంటున్న సైబర్ నేరాలకు తాజా ఉదాహరణలు ఇవి. ఏఈపీఎస్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్ ద్వారా వారి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్ నేరాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ప్రకారం గత ఆరునెలల్లో దాదాపు నాలుగువేల కేసులు నమోదవడం ఈ తరహా సైబర్ నేరాల తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ రీతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యధికంగా హరియాణలో కేంద్రీకృతం కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుంచి దందా సాగిస్తున్నాయని సైబర్ పోలీసుల విభాగం గుర్తించింది. సైబర్ మోసం ఇలా.. సైబర్ నేరగాళ్లు ఏఈపీఎస్ను దుర్వినియోగం చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదును కొట్టేస్తున్నారు. అందుకోసం రెండుమూడు తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా వివిధ వెబ్సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్ పేపర్’పై కాపీచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ, ట్రెజరీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, ఆన్లైన్ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్ ద్వారా నకిలీ సిలికాన్/రబ్బర్ వేలిముద్రలు తయారు చేస్తారు. ఆధార్ నంబరు అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో ఆ వ్యక్తుల అసలైన ఆన్లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లు వారి నియంత్రణలోకి వస్తాయి. అనంతరం తాము క్లోనింగ్ చేసిన వేలిముద్రలు ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మరికొన్నిసార్లు బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్స్, ఏజెంట్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్లో బయోమెట్రిక్ డివైజ్ స్కానర్స్తో స్కాన్‌చేసి నగదు లాగేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏకంగా ఆన్లైన్ రుణ కంపెనీల పేరిట నకిలీ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. రుణాలు ఇస్తామని ఆన్లైన్లో ప్రకటనలు చేస్తున్నాయి. రుణాల కోసం తమను సంప్రదించే వ్యక్తుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల కాపీలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నాయి. అనంతరం క్లోనింగ్ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును తస్కరిస్తున్నాయి. ఆధార్ నంబర్లతో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా కూడా సిఫోనింగ్ చేసి మరీ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అందుకు ఖాతాదారులతోపాటు ప్రభుత్వ సంçÜ్థలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ వెబ్సైట్లను ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦తమ వెబ్సైట్లను తరచు సేఫ్టీ ఆడిట్ చేయాలి. ♦ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్‌కాకుండా తగిన ప్రమాణాలు పాటించాలి. ♦అందుకోసం కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఖాతాదారులకు సూచనలు ఏఈపీఎస్ విధానాన్ని తరచు వినియోగించని ఖాతాదారులు ఆ సౌలభ్యాన్ని ఉపసంహరించుకోవాలి. వెబ్సైట్లలో తమ వేలిముద్రలు నమోదు చేయకూడదు. ఎటువంటి వ్యవహారం కోసమైనా సరే వేలిముద్రలు అడిగితే తిరస్కరించాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని గుర్తిస్తే 24 గంటల్లోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీంతో వారి ఖాతానుంచి నగదు బదిలీ అయిన ఖాతాను సైబర్ పోలీసులు స్తంభింపజేయడానికి అవకాశం ఉంటుంది. సైబర్ నేరం జరిగినట్టు తెలియగానే ఏపీ సైబర్‌మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100)నుగానీ, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930)ను గానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలి. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
ఆన్లైన్లో డబ్బులు పోతే ఏం చేయాలి?!
కూతురు పుట్టినరోజుకు డ్రెస్ కొనుగోలు చేసిన సౌమ్య ఫోన్ యాప్ ద్వారా పేమెంట్ చేసింది. అయితే, పేమెంట్ మోడ్‌కి వచ్చేసరికి డబ్బులు డెబిట్ అయినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది కానీ, షాప్ యజమాని ఖాతాలో నగదు క్రెడిట్ కాలేదు. దీంతో ఒకటికి రెండు సార్లు పేమెంట్ చేసింది. ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ అమౌంట్ రిటర్న్ అవుతుందిలే అని ఊరుకుంది. కానీ, అలా రిటర్న్ అయిన మెసేజ్ ఏమీ రాలేదు. ఆ అమౌంట్‌ను తిరిగి ఎలాపొందడం, లేకపోతే అంతమొత్తం ఎలా వదిలేయడం.. ఓ రెండు రోజులు ఆగి చూద్దామా.. ఇలాంటి సందేహాలతోనే సౌమ్యకు ఆ రోజు గడిచిపోయింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే. పండ్లు, కూరగాయల బండి వద్ద కూడా యాప్ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి వాటి ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటాం, ఇలాంటప్పుడు సర్వర్ సరిగ్గా పనిచేయకనో లేదా మరో కారణంగానో ఆన్లైన్ లావాదేవీలు నిలిచిపోయినప్పుడు లేదా ఆన్ లైన్ నగదు మోసాల జరిగినప్పుడు ఏం చేయాలో ప్రతిఒక్కరికీ అవగాహన తప్పక ఉండాలి. ఫిర్యాదులకు వేదిక సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRM ) ) అనేది భారతదేశంలో పౌరులు ఆర్థిక సైబర్ మోసాలను ఫిర్యాదు చేయడానికి ఒక వేదిక. ఆర్థిక సైబర్ మోసానికి సంబంధించిన సంఘటనలను నివేదించడానికి, నిర్వహించడానికి పౌరులకు అనుకూలమైన, సురక్షితమైన మార్గాన్ని అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ లక్ష్యం. మోసానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సాక్ష్యాలను దీనిలో అప్లోడ్ చేయచ్చు. ఇది ఆర్థిక సైబర్ మోసాన్ని ఎలా నిరోధించాలనే దానిపై సమాచారం, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. నివేదిక ఇచ్చాక, విచారణ కోసం సంబంధిత చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీకి పంపిస్తుంది. తగిన చర్య కోసం బ్యాంకింగ్ అధికారులకు పంపుతుంది. మోసగాడి ఖాతాలో బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంకు దానిని హోల్డ్‌లో ఉంచుతుంది. తర్వాత, ఫిర్యాదుదారు అధికారికంగా కోర్టుకు హాజరు కావాలి. ఆ పై డబ్బు బాధితుడి ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఈ స్థితిని ట్రాక్ చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. CFCFRM టోల్ ఫ్రీ నెంబర్: 1930 ♦ వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలి (12 గంటల్లోపు) ♦ ప్రత్యామ్నాయంగా https://cybercrime.gov.in పోర్టల్‌కు లాగిన్ అయ్యి, ఫిర్యాదు చేయాలి. ♦బ్యాంక్ అకౌంట్ నెంబర్, వాలెట్ యుపిఐ, లావాదేవీ ఐడీ, తేదీ, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు మొదలైనవి ఇవ్వాలి. ♦ సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి, రసీదు సంఖ్యను ఎఫ్ఐఆర్గా మార్చవచ్చు. RBI వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ : టోల్ ఫ్రీ నెం. 14448 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ పథకం’ అందుబాటులోకి వచ్చింది. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థలకు సంబంధించిన వాటితో సహా అన్ని డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులకు ఒకే పా యింట్ ఆఫ్ కాంటాక్ట్ అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద, వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి, పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రంలో ఆర్బిఐచే నియమించబడిన అంబుడ్స్‌మన్ ఉంటారు. ఫిర్యాదులను స్వీకరించడం, విషయాన్ని విచారించడం, ఫిర్యాదు సరైనదేనని తేలిన సందర్భాల్లో బాధిత వినియోగదారులకు పరిహారం అందించే అధికారం ఈ అంబుడ్స్‌మన్ కు ఉంటుంది. అంబుడ్స్‌మన్ స్వతంత్రంగా, నిష్పక్షపా తంగా పని చేస్తారు. వారి నిర్ణయాలకు బ్యాంకింగ్ సంస్థలు కట్టుబడి ఉంటాయి. దశల వారీగా నివేదించే ప్రక్రియ... ♦ సంబంధిత యుపిఐ సర్వీస్ప్రొవైడర్ పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పె మొదలైన వాటిపై ఫిర్యాదు. ♦టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. ♦https://cms.rbi.org.in పోర్టల్‌కు లాగిన్ చేసి, ఫిర్యాదు ఇవ్వచ్చు. ♦మీ ఫిర్యాదును CRPC@rbi.org కి ఇ–మెయిల్ చేయచ్చు. (బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీ స్క్రీన్ షాట్లు / యుపిఐ, యాప్ లావాదేవీ స్క్రీన్ షాట్లు/ పంపిన, స్వీకరించిన ఫోన్ నంబర్లు రెండింటినీ జత చేయాలి) ♦ బాధితుడి డబ్బు ఇంకా అందుబాటులో ఉంటే, బ్యాంక్ దానిని హోల్డ్‌లో ఉంచుతుంది, తర్వాత ఫిర్యాదుదారు ఖాతాకు బదిలీ చేస్తుంది. డబ్బులు ఇరుక్కుపోతే.. డబ్బులు బదిలి చేసినప్పుడు మన అకౌంట్ నుంచి డిడక్ట్ అయినా అవతలి వారికి వెళ్లకపోవడం, లేదా పేమెంట్ ఆగిపోవడం వంటివి జరిగినప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా యుపిఐ వివాదానికి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి కస్టమర్ PSP యాప్ (పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు) / TPAPయాప్ (థర్డ్ పా ర్టీ అప్లికేషన్ప్రొవైడర్లు)లో UPIలావాదేవీకి సంబంధించి NPCI పోర్టల్ https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanism లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కింది కారణాల వల్ల మాత్రమే అభ్యర్థనలను ఇవ్వాలి.. (ఎ) ఖాతా నుంచి మొత్తం డెబిట్ అయ్యింది కానీ లబ్ధిదారునికి క్రెడిట్ కాలేదు (బి) ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది కానీ మొత్తం నగదు డెబిట్ అయ్యింది (సి) చేయాల్సిన ఖాతాకు కాకుండా వేరొక ఖాతాకు తప్పుగా బదిలీ అయ్యింది (డి) లావాదేవీ సమయం ముగిసింది కానీ ఖాతా నుంచి డెబిట్ అయ్యింది (ఇ) మోసపూరితమైన లావాదేవీ జరిగింది (ఎఫ్) నగదు లావాదేవీ పెండింగ్‌లో ఉండిపోయింది (జి) లావాదేవీ అసలు యాక్సెస్ అవలేదు (హెచ్) లావాదేవీ రిజక్ట్ అయ్యింది (ఐ) పరిమితిని మించి పొ రపా టున లావాదేవీ జరిగింది. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్‌దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
మొబైల్‌కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 'సిమ్ స్వాపింగ్' టెక్నిక్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు. -
యూకే నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్..కాస్ట్లీ గిఫ్ట్..కట్ చేస్తే!
సాక్షి, ముంబై: సోషల్‌మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపడం, ఆనక మెల్లిగా మాటకలిపి, ఖరీదైన బహుమతులంటూ ఎరవేసి, అమాయకులకు కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెడుతున్న సంఘటన గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇలాంటి నేరాలపై ఎన్ని సార్లు హెచ్చరించినా మళ్లీ మళ్లీ ఇలాంటి ఉదంతాలు రిపీట్ అవుతూనేఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్‌కు చెందిన ఓ మహిళ రూ.1.12 కోట్ల రూపాయలను పొగొట్టకుంది. రిటైర్డ్ మహిళా కోర్టు సూపరింటెండెంట్‌కు ఏడాది జూన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ నివాసిని అంటూ ఒక వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దాన్ని ఈమె అంగీకరించారు. ఆ తరువాత అతనితో కలిపి మరో ఇద్దరు మాట కలిపి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు. ఫోన్లలో తరచూ మాట్లాడుతూ బంగారం , ఇతర కాస్ట్లీ గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ మభ్య పెట్టారు. అయితే దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లించవలసి ఉంటుందని నమ్మబలికారు. దీంతో ఆమె వారికి ఏకంగా 1.12 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఆ తరువాతనుంచి వారి నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా, ఫోన్లను స్విచాఫ్ చేసుకున్నారు.మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, కుట్ర కేసు నమోదు చేశామనీ, cనిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
మీరు మోసపోతే , దానికి నా భర్త కారణం కాదు : నటి వార్నింగ్
హీరోయిన్ పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లాడిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టిన పూర్ణ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. అటు పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేస్తున్న పూర్ణ ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. వాళ్ల ప్రొఫైల్‌తో సామాన్యుల దగ్గర్నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. తాజాగా ఇదే పరిస్థితి నటి పూర్ణకు సైతం ఎదురైంది. తన భర్త షానిద్ ఆసిఫ్ ఫోటోను వాట్సాప్ డీపీగా క్రియేట్ చేసి ఓ నంబర్ నుంచి కొందరు లావాదేవీలు జరుపుతున్నారని పూర్ణ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన పూర్ణ.. అది తన భర్త నెంబర్ కాదని, ఒకవేళ ఎవరైనా మోసపోతే అందుకు తన భర్త కారణం కాదంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. -
సైబర్ మోసాలపై వెంటనే ఫిర్యాదు...లేదంటే! ఎస్బీఐ కీలక హెచ్చరిక
సాక్షి, ముంబై: దేశంలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్, డిజిటల్ మోసాల కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక సూచనలు జారీ చేసింది. డిజిటల్ చెల్లింపు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో అనధికారిక లావాదేలపై తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను అప్రమత్తం చేసింది. తద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు ఫిషింగ్, ర్యాన్సమ్ దాడుల నుండి, సైబర్ కేటుగాళ్ల మోసాలనుంచి సురక్షితంగా ఉండవచ్చని పేర్కొది. ఎస్బీఐ ఖాతాకు సంబంధించి ఏదైనా ఆర్థిక మోసం జరిగినట్లయితే, ఖాతాదారుడు ఫిర్యాదు చేయాలని తెలిపింది. పెరుగుతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తమ ఖాతాల్లో ఏదైనా అనధికార లావాదేవీలు జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని తెలిపింది. అలా కాకుండా ఫిర్యాదుకు ఎక్కువ సమయం తీసుకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది. అనధికార లావాదేవీని గమనించిన వెంటనే తమ టోల్-ఫ్రీ నంబర్ 18001-2-3-4కు తెలియజేయాలని వెల్లడించింది. తద్వారా సకాలంలో సరైన చర్యలు తీసుకొనే అవకాశం తమకు ఉంటుందని, లేదంటే భారీ మూల్యం తప్పదని పేర్కొంది. 1800 1234 లేదా 1800 2100లో తమ కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిఎస్బీఐ బ్యాంకింగ్ అవసరాలను తీసు కోవచ్చంటూ ట్వీట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో సైబర్ నేరగాళ్ల ఎత్తులనుంచి, సైబర్ దాడులనుంచి కస్టమర్లు తమని తాము రక్షించు కోవడం చాలా ముఖ్యమని పేర్కొంది. టోల్-ఫ్రీ నంబర్‌ను డయల్ చేయడంతో పాటు, కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ , భీమ్ ఎస్బీఐ పే సేవలకు సంబంధించిన ఫిర్యాదులను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత మోసపూరిత ఛానెల్‌ను బ్లాక్ చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. రిజిస్టర్డ్ ఫిర్యాదు నంబర్, ఇతర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామనీ, అలా వచ్చిన ఫిర్యాదును 90 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. Fulfill your banking needs, just call! Call SBI Contact Centre toll-free at 1800 1234 or 1800 2100.#SBI #SBIContactCentre #TollFree #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/RtrXf042KO — State Bank of India (@TheOfficialSBI) October 25, 2022 -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. న్యూడ్ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్
హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మధుకర్ (పేరు మార్చాము)కు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్ ద్వారా వీడియో కాల్ వచ్చింది. ఆన్సర్ చేశాడు. వెంటనే అవతలి వైపు నుంచి ఓ చైల్డ్ న్యూడ్ వీడియో ప్లే అయ్యింది. దాని తర్వాత ఓ యూట్యూబ్ లింకు అతని ఫేస్బుక్ మెసెంజర్‌కు వచ్చింది. అది ఓపెన్ చేయగానే తాను వీడియో చూస్తున్నట్టు స్క్రీన్ రికార్డు ద్వారా రికార్డు చేసిన వీడియో కన్పించింది. దీనితో కంగారుపడిన మధుకర్ మెసెంజర్లో అవతలి వైపు ఉన్న సైబర్ నేరస్తుడితో చాట్ చేస్తూ వీడియో తీసెయ్యాలని బతిమిలాడాడు. రూ.5 వేలు పంపిస్తే తీసేస్తామని బెదిరింపులకు దిగడంతో ఫోన్ పే ద్వారా ఒక నంబర్‌కు పంపాడు, అలా మొదలైన బ్లాక్‌మెయిలింగ్ రూ.1.2 లక్షలకు చేరడంతో చివరకు వాళ్ల అన్నకు విషయం చెప్పాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ వీడియో లింకును యూట్యూబ్ నుంచి తొలగించారు. సాక్షి, హైదరాబాద్: టీనేజర్ల బలహీనత సైబర్ నేరస్తులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు వారిని లక్ష్యంగా చేసుకొని అశ్లీల వీడియోల ఆధారంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. దేశంలో ప్రతి ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహా పోర్నోగ్రఫీ బ్లాక్ మెయిలింగ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా, టిండర్, టెలిగ్రామ్ తదితర సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పోర్నోగ్రఫీ వీడియోలు, న్యూడ్ వీడియో కాల్లతో మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. దేశంలో ఇలాంటి కేసులు ఏటా 3 లక్షలు దాటిపోతున్నాయంటే ఏ స్థాయిలో సైబర్ నేరగాళ్లు దండుకుంటున్నారో అర్థమవుతోంది. మధుకర్ విషయంలో అన్న సహాయం చేశాడు కాబట్టి బయటపడ్డాడు. కానీ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న మిగతా టీనేజీ పిల్లల మాటేమిటి? సైబర్ నేరస్తుల బెదిరింపులతో ఆత్మహత్యే శరణ్యమనుకున్న ఘటనలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకే ఏడాదిలో 3.8 లక్షల కేసులు ఒక్క 2021 (కరోనా సమయం)లోనే ఈ తరహా కేసులు 3.8 లక్షలు నమోదయినట్టు కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు రాజస్తాన్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. 2021లో ఢిల్లీ పోలీసులు ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్న 70 మంది ముఠాను అరెస్టు చేశారు. మరోవైపు సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లలోనూ కుప్పలుతెప్పలుగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. పిల్లల్ని ప్రతిక్షణం గమనించాలి టీనేజ్‌లో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రతిక్షణం గమనించాలని, రాత్రి వేళల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఉండకుండా చూసుకోవాలని రాష్ట్ర పోలీసులు సూచిస్తున్నారు. యుక్తవయస్సులో పిల్లలు దారితప్పితే ప్రమాదమని పేర్కొంటున్నారు. చిక్కుల్లో పడినప్పుడు చెప్పుకోవడానికి జంకుతారని, అందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలల్లో వేలాది మందిని సైబర్ వారియర్స్‌గా ఏర్పాటు చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరును వారు వివరిస్తున్నట్టు చెప్పారు. వల ఇలా.. టార్గెట్ చేసిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ముందుగా ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. అమ్మాయి పేరుతో ఫేక్ ఐడీ, ఫోటో నకిలీది పెట్టి ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టిస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయగానే మెల్లిగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాటింగ్ కాస్తా మొబైల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకు వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్ చాట్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేలా చేస్తారు. అడల్డ్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునే వరకు తీసుకువస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చాట్ కాస్త వీడియో కాల్స్‌లోకి వెళ్లగానే ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్‌లో చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని సైతం న్యూడ్‌చాట్‌లోకి తీసుకువస్తారు. ఈ మొత్తం కాల్ని రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్ చేస్తారు. ఇలా షేర్ చేసిన వీడియోతో బెదిరింపులు ప్రారంభిస్తారు. డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామంటారు. యువతులను బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి అమ్ముకుంటున్నట్టుగా ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సైబర్ నిపుణులు వెల్లడించారు. ఈ తరహా కాల్స్‌లో 90 శాతం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్య జరుగుతున్నవేనని తెలిపారు. -
లోన్ యాప్‌ల మాయలో పడి మోసపోవద్దు
రాయచోటి : సెల్ఫోన్ల వినియోగంలో భాగంగా లోన్ యాప్‌ల మాయలో పడి ప్రజలు మోసపోవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు హితబోధ చేశారు. శనివారం ఈ మేరకు ఎస్పీ ఒక ప్రకటనల విడుదల చేసి సైబర్ నేరాలపై స్పందించారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు పొంది వారి వేధింపులకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నారు. సైబర్ మోసగాళ్లు సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్తులు రుణయాప్‌లకు ఆకర్షితులవుతున్నారన్నారు. రుణాలు తీసుకున్నాకా అధిక వడ్డీ, అనేక అసంబంధమైన చార్జీల పేరిట యాప్ నిర్వాహకులు రుణగ్రహీతల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని, రుణగ్రహీతల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తద్వారా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వారి ఫోన్ల నుండి సేకరించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలమైన ఫొటోలు, వీడియోలను వారి ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు పంపించి వేధిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని వివరించారు. ప్రజలు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలని సూచించారు. నకిలీ యాప్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. -
అర్ధరాత్రి కరెంట్ కట్ చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ బిల్లులు చెల్లించాలి, లేకుంటే రాత్రిపూట విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని’ పేర్కొంటూ వినియోగదారులకు కొందరు వ్యక్తులు ఎస్ఎంఎస్లు/ఫోన్ కాల్స్ చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డిబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సమాచారం, ఓటీపీలను తెలపవద్దని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎవరైనా ఈ సమాచారం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సైబర్ మోసగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు/ చెల్లింపుల కోసం తమ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని, బిల్లు చెల్లింపులు జరపడానికి ఎలాంటి వెబ్సైట్ లింకులను ఎస్ఎంఎస్ ద్వారా తాము పంపమని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించినా, విద్యుత్ బిల్లు పెండింగ్ ఉందని ఎవరైనా వ్యక్తులు ఫోన్/మెసేజ్ చేస్తే.. బిల్లుల చెల్లింపు వివరాలను సంస్థ వెబ్ సైట్ www. tssouthernpower. com లేదా టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో చెక్‌చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా తేడాలుంటే ఆన్లైన్ ద్వారా సంస్థను లేదా సంబంధిత సెక్షన్ ఆఫీసర్(అఉ)ని సంప్రదించి సరిచూసుకోవాలని కోరారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి..
సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎందరో అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే ఇలా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడం పోలీసులకు సాహసమనే చెప్పాలి. కానీ ముంబైలోని ఓషివారా పోలీసులు మాత్రం ఓ సైబర్ క్రైమ్‌ను చేధించి అతి త్వరగా ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాందిచుకుంది బుల్లితెర బ్యూటీ అమన్ సంధు (Aman Sandhu). ప్రస్తుతం గోరేగామ్లో నివసిస్తోన్న అమన్ తాజాగా సైబర్ నేరగాళ్ల (Cyber Crime) ట్రాప్‌లో పడింది. తన తల్లికి డాక్టర్ అపాయింట్మెంట్ కోసమని జుహుకి చెందిన ఆస్పత్రి వెబ్సైట్ కోసం జులై 6న నెట్లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్సైట్లా కనిపించే నకిలీ సైట్లో తన నెంబర్‌ను నమోదు చేసింది. ఆమె నెంబర్‌కు కాల్ చేసిన వ్యక్తి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం పంపిన వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయాలని సూచించాడు. ఆ లింక్‌పై నటి అమన్ సంధు క్లిక్ చేయగానే తన మూడు ఖాతాల నుంచు రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన అమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య సత్వరమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా ఆ డబ్బును రికవరీ చేశారు. అలాగే కాజేసిన అకౌంట్‌ను బ్లాక్ చేశామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి అమన్ సంధు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఓషివారా పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. 'నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి. కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు' అని ఇన్‌స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్.. పెళ్లికి రెడీ అయిన బుల్లితెర బ్యూటీ!.. అతనెవరంటే ? View this post on Instagram A post shared by Aman Sandhu 🧿ਜੱਟੀ (@officialamansandhu) -
మేకలు అమ్మి ఫోన్ కొనిస్తే! ఆ కొడుకేమో..
భర్త కాలం చేసింది చానారోజులే అయ్యింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించేందుకు అహర్నిశలు కష్టపడేది ఆ తల్లి. కొడుకు సరస్వతి పుత్రుడు. అందుకే ఆన్లైన్ సదువుకు ఫోన్ కావాలని అడగ్గానే.. ఉన్న రెండు మేకలను అమ్మేసి కొడుకు చేతులో సొమ్ములు పెట్టింది ఆ తల్లి. కానీ, ఆ బిడ్డ.. ఆ తల్లి నమ్మకాన్ని మాత్రమే దెబ్బ తీయలేదు. కటకటాల పాలై జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు కూడా. బిహార్ నవాడా జిల్లా థాల్పోస్ గ్రామం ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం.. ఆ ఊరి నుంచి సైబర్ నేరాలనుగానూ పోలీసులు అరెస్ట్ చేయడం. జిల్లావ్యాప్తంగా ఒకే తరహాలో జరిగిన స్కామ్‌లో మొత్తం 33 మందిని అరెస్ట్‌చేస్తే.. అందులో 31 మంది థాల్పోస్ గ్రామం నుంచే కావడం ఆశ్చర్యం కలిగించేదే కదా!. అందునా నేరాలకు పాల్పడింది 14 నుంచి 40 ఏళ్లలోపు వాళ్లే కావడం గమనార్హం. అందులో ఒకడే 19 ఏళ్ల గుల్షన్. అరెస్ట్ అయిన చాలామంది ఈపాటికే బెయిల్ మీద బయటకు వచ్చారు. కొందరేమో ఆర్థిక స్థితి బాగోలేక జైల్లోనే ఉండిపోయారు. మరికొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నారు. గుల్షన్ తండ్రి చనిపోయాక అన్నితానై చూసుకుంది ఆ తల్లి. అలాగని గుల్షన్ సుద్దమొద్దు కాదు. 2019లో పదవ తరగతి ఫస్ట్ డివిజన్లో పాసయ్యాడు. ముఖ్యమంత్రి బాలక్ బాలికా ప్రోత్సాహన్ యోజన కింద 10 వేల రూపాయల స్కాలర్షిప్ కూడా అందుకున్నాడు. స్థానికంగా ట్యూషన్స్ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ.. తల్లి, తమ్ముడి పోషణలో భాగం అయ్యాడు కూడా. అలాంటోడి జీవితాన్ని సెల్‌ఫోన్ దెబ్బ తీసింది. సులువుగా డబ్బు సంపాదించాలన్నా దుర్భుది.. అతని కుటుంబం పరువు తీయడంతో పాటు వ్యక్తిగతంగా ఆ కుర్రాడిని కటకటాల పాల్జేసింది. అతనికి బెయిల్ ఇప్పించే పరిస్థితిలోనూ లేదు 42 ఏళ్ల సర్విలా దేవి. అరెస్ట్ అయిన చాలామందివి పేద కుటుంబాలే. కాస్తో కూస్తో చదువుకున్నారు. అప్పో సొప్పో చేసి స్మార్ట్ఫోన్లు కొని సైబర్‌నేరాలకు పాల్పడ్డారంతా. ఓటీపీ నేరాల దగ్గరి నుంచి, నకిలీ ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే దాకా.. వాళ్లు పాల్పడి నేరాలంటూ లేవు. ఉన్నంత చదువు, ఆన్లైన్ మోసాలపై పెంచుకున్న జ్ఞానం వాళ్లతో నేరాలు చేయించింది. ఊరిలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. పోలాల దగ్గర, బోరు బావిల దగ్గర, ఊళ్లో చెట్ల అరుగుల మీద కూర్చుని ఈ నేరాలకు పాల్పడ్డారని థాల్పోస్ ఎస్సై బెయిడ్నాథ్ ప్రసాద్ చెప్తున్నారు. బీహార్‌లో నమోదు అయ్యే సైబర్ నేరాలు తక్కువేం కాదు. ఒక్క నవాడా జిల్లా పరిధిలో 2019-20 మధ్య 18 కేసులకుగానూ 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020-21లో ఆ సంఖ్య 14 కేసులకు 30 మందికి చేరింది. కానీ, 2022లో అదీ మార్చి వరకే 11 కేసుల్లో 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంతా. పేదరికం, కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, వలస కూలీలకు పనులు లేకపోవడం, బడిలు బంద్ కావడంతో చాలామంది ఇటువంటి నేరాల వైపు మళ్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ ద్వారా వీళ్లలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది పోలీస్ శాఖ. -
వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్‌పై చేయడంతో...
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సులభంగా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వర్క్‌ఫ్రమ్ హోం వలలో చిక్కుకుని ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రూ.20 లక్షలు కోల్పోయాడు. తీరా తనను దగా చేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం పేరుతో వచ్చిన ఓ లింకును క్లిక్ చేశాడు. చదవండి: చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో.. వారి సూచనలు పాటించడంతో రూ.20 నుంచి రూ. 20లక్షల వరకు ఆన్లైన్ పేమెంట్‌ను చెల్లించాడు. రూ.20 లక్షలకు రూ.40 లక్షలు ఇస్తామని, రూ.40 లక్షలు పొందాలంటే తొలుత రూ.8 లక్షలు పన్ను చెల్లించాలని మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కొటాలకు చెందిన యువకుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులకు తెలిసింది. ఆ యువకుడు పరువుపోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
యువతికి ఉద్యోగం ఆశ చూపి..
హిమాయత్‌నగర్(హైదరాబాద్): చార్టెట్ అకౌంట్ చేసిన ఓ యువతి ఉద్యోగం కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఓ పథకం ప్రకారం ఆమెకు వల వేశారు. మీ ప్రొఫైల్ బాగుంది.. మంచి కంపెనీలో సీఏగా పెట్టిస్తాము అంటూ నమ్మబలికారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా యువతికి వాట్సప్ లింకు పంపారు. ఆ లింకును క్లిక్ చేసిన యువతి చేత తొలుత రూ. 100 కట్టించారు. మరుసటి రోజు రోజు రూ. 100కి రూ. 200 లాభం ఇచ్చి ఆశ చూపించారు. ఇదేదో బాగుంది కదా అని ఆశ పడ్డ యువతికి సుమారు రూ. 5 వేల వరకు ఇన్వెస్ట్ చేపించడం లాభాలు ఇవ్వడం చేశారు. ఆ తర్వాత నుంచి పలు దఫాలుగా డబ్బులు పెడుతుందే కానీ లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా ఇప్పటి వరకు రూ. 4.53 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు శుక్రవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కె.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు. -
రూ.కోటి రుణానికి రూ.18లక్షల కమీషన్
హైదరాబాద్: ‘సార్ మీ బ్యాంక్ స్టేట్మెంట్, మీ అసెట్స్ అన్నీ రీజనబుల్‌గా ఉన్నాయి. మీకు రూ.కోటి వరకు లోను ఇస్తామంటూ’ నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే రిటైర్డ్ ఉద్యోగికి ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి లోను ఎర వేశాడు. రూ.కోటి ఇస్తానంటే ఎందుకు కాదనుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగి సరేనన్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఇంటి పత్రాలు జిరాక్స్ అన్నీ ఆన్లైన్ ద్వారా సేకరించారు నేరగాళ్లు. ఆ తర్వాత కోటికి పదిశాతం కమీషన్ అంటూ మాయ మాటలు చెప్పసాగారు. అలా డాక్యుమెంట్స్ పేరుతో, ఐటీ పేరుతో తదితర కారణాలు చెప్పి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.18లక్షలు కాజేశారు. ఈ డబ్బంతా ఆయన పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిందే. డబ్బు తీసుకుంటున్నారే కానీ రూ.కోటి లోను మాత్రం మంజూరు చేయడం లేదు. తాను ఎక్కడో మోసపోయానని ఆలస్యంగా తేరుకున్న ఆ ఉద్యోగి సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. -
మహిళ ఫోన్ కాల్.. దండిగా లాభాలు వస్తాయని చెప్పి
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): దండిగా లాభాలు పంచుతామని ఆశపెట్టిన సైబర్ వంచకురాలు ఓ వ్యాపారి నుంచి రూ.లక్షలు కాజేసింది. హుబ్లీలోని ఎగ్గెరి కాలనీకి చెందిన వ్యాపారవేత్త గురుమూర్తి నాణ్యదకు ఓ మహిళ ఫోన్ చేసి తన పేరు లక్ష్మీమెహర్ అని చెప్పి పరిచయం చేసుకుంది. ఓ కంపెనీ పేరు చెప్పి అందులో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టింది. రూ.32 లక్షలు దశలవారీగా తన బ్యాంకు ఖాతాకు నిధులు మళ్లించుకుంది. లాభాలు రాకపోగా మళ్లీ నగదు జమ చేయాలని ఒత్తిడి చేసింది. అనుమానం వచ్చి ఆరా తీయగా ఆమె చేసిన మోసం బట్టబయలైంది. దీంతో బాధితుడు హుబ్లీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. యాప్ అప్డేట్ పేరుతో వంచన హుబ్లీ: ఎస్బీఐ యోనో యాప్ అప్డేట్ పేరుతో సైబర్ వంచకులు ఓ మహిళను నిండా ముంచారు. వివరాలు...మీ ఎస్బీఐ యాప్ త్వరలోనే స్తంభించనుందని, తక్షణమే అప్డేట్ చేసుకోవాలని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ధార్వాడకు చెందిన డాక్టర్ అనుశ్రీ అగ్నిహొత్ర అనే మహిళ సెల్‌కు సందేశం వచ్చింది. నమ్మిన బాధిత మహిళ సదరు లింక్‌ను ఓపెన్ చేసి పాన్ కార్డు నంబర్, పుట్టిన తేదీతో పాటు ఓటీపీ పంపారు. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.3,94,690 మొత్తాన్ని తమ ఖాతాకు బదలాయించుకున్నారు. దీంతో బాధితురాలు హుబ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
విజయవాడలో భారీ సైబర్ మోసం
-
ఆన్లైన్ వ్యాపారం ముసుగులో భారీ సైబర్ మోసం
విజయవాడ స్పోర్ట్స్: ఆన్లైన్ వైద్య పరికరాల వ్యాపారం ముసుగులో జరుగుతున్న సైబర్ మోసం విజయవాడలో వెలుగు చూసింది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయామంటూ శనివారం సాయంత్రం సైబర్, సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జూన్ చివరి వారంలో టెలివియా అనే సంస్థ లవ్‌లైఫ్ అండ్ న్యాచురల్ హెల్త్‌కేర్ పేరుతో ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించి ఆన్లైన్లో వైద్య పరికరాల విక్రయం ప్రారంభించింది. ఈ యాప్‌లో ఉన్న వైద్య పరికరాలను కొనుగోలు చేయండి.. సదరు పరికరాలను మేమే అద్దెకు ఇచ్చి, వచ్చిన లాభాన్ని మీకు ఇస్తామనే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా సమయంలో వైద్య పరికరాలకు గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే లక్షలు ఆర్జించవచ్చనే ఆశతో ఎంతో మంది ఈ యాప్‌ను డౌన్‌లోన్ చేసుకుని వైద్య పరికరాలపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న పెట్టుబడిదారులతో 372 టెలిగ్రాం గ్రూపులను (ఒక్కో గ్రూపునకు 250 మంది సభ్యులు) ఏర్పాటు చేసి వ్యాపారం లావాదేవీలను ఎప్పటికపుడు అప్డేట్ చేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు ఇచ్చేయడంతో పాటు తరుచూ గిఫ్ట్ కూపన్లను ఇవ్వడంతో వేలాది మంది ఈ వ్యాపారం పట్ల ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరు రూ.లక్షల్లో నగదును నిర్వాహకులకు యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా పంపారు. ఈ నెల 19వ తేదీ నుంచి సంస్థ బోర్డ్ తిప్పేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నగర ప్రజల నుంచి ఈ సంస్థ కోట్లాది రూపాయలు వసూలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, విచారణ చేస్తున్నామని సైబర్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
మరో వారం రోజుల్లో కేన్సర్ చికిత్స.. అయ్యో కేటుగాళ్లు..
సాక్షి, మహబూబాబాద్(వరంగల్): రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలోనుంచి రూ.2.30 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మానుకోట జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. మాజీ సైనికుడు పెద్దబోయిన భిక్షపతి మానుకోట సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈయనకు ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో రూ.95 వేలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో రూ.35 వేలు మాయమయ్యాయి. బాధితుడు భిక్షపతి ఎస్బీఐ బ్యాంకు ఖాతాలో చెక్‌బుక్ కోసమని దరఖాస్తు చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి మాట్లాడి ఫోన్ పెట్టేయగానే మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు వివరాలు అడగగానే బ్యాంకు వారే అనుకుని వారు అడిగిన సమాచారం అందించి ఫోన్ కట్‌చేశాడు. ఆ వెంటనే ఆయన ఫోన్‌కు రూ.2.30 లక్షలు ఉపసంహరణ (డ్రా) అయినట్లు మెసేజ్ వచ్చింది. సదరు మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్‌నంబర్ లింకు చేశారు. బ్యాంకు అధికారులు అనుకుని గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్‌కు స్పందించి సమాచారం ఇవ్వడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంకు ఖాతాల్లో నగదు పోయినట్లు గుర్తించి వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఆయన ఖాతాల్లోని నగదు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. తనకు మోసం జరిగిందని గుర్తించిన సదరు బాధితుడు భిక్షపతి, మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరో వారం రోజుల్లో భిక్షపతికి కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ఇంతపెద్ద గోరం జరిగిందని గుండె బాదుకుంటూ బోరున విలపించాడు. పోలీసులు, బ్యాంకు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరాడు. చదవండి: వివాహితతో పరిచయం .. చేనులోకి బలవంతంగా తీసుకెళ్లి.. -
సైబర్ మోసాలకు చెక్ పెట్టే మొబైల్ యాప్! ఇక సైబర్ కేటుగాళ్ల ఆటకట్టు..
KL Deemed University Student: ఇటీవలకాలంలో చాలా సైబర్ మోసాలను చూసే ఉంటాం. ఆఖరికి బ్యాంక్ ఉద్యోగులను సైతం బురిడీ కొట్టంచే కేటుగాళ్లను సైతం చూస్తూనే ఉన్నాం. పైగా ఫిర్యాదు చేద్దాం అంటే ఈ సైబర్ కేసులను సంబంధించిన ఫిర్యాదులు ఎలా చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక అటువంటి సమస్య ఉండదంటా. ఎవ్వరూ సైబర్ మోసానికి గురకాకుండా ఉండేలానే కాకుండా సైబర్ చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన సరికొత్త యూప్ వచ్చింది. (చదవండి: కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్) అసలు విషయంలోకెళ్లితే...కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో లా ఫైనలియర్ చదువుతున్న డీ శశాంక్ డిజిట్ భద్రతకు సంబంధించిన సైబర్ అలర్ట్ అనే మొబైల్ అప్లికేషన్ని అభివృద్ధి చేశారు. అయితే ఈ సరికొత్త యాప్ వినియోగదారులను సైబర్ మోసానికి గురికాకముందే హెచ్చరించడమే కాక సైబర్ ఫిర్యాదులను ఫైల్ చేసేలా అనుమతి ఇస్తుంది. పైగా ఫిర్యాదులను ట్రాక్ చేయడమే కాక సైబర్ భద్రత, చట్టాలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు జీపీఎస్‌తో కూడిన స్టేషన్ల జాబితాను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు వినయోగదారులు సత్వరమే న్యాయ సహాయం పొందేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ మేరకు సైబర్ అలర్ట్ వ్యసస్థాపకుడు డీ రాహుల్ శశాంక్ మాట్లాడుతూ..."కరోనా మహమ్మారి సమయంలో పెరిగిన సైబర్-దాడుల సంఖ్య మమ్మల్ని ఈ యాప్‌ను ప్రారంభించేలా చేసింది. మా యూనివర్సిటీ ప్రోఫెసర్లు నేను తయారు చేసిన యాప్ పై చాలా విశ్వాసం ఉంచడమే కాక మా ప్రయత్నానికి పూర్తి సహాయసహకారాలను అందించారు." అని అన్నారు. అంతేకాదు యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. పార్ధ సారధి వర్మ ప్రిన్సిపాల్ ఎన్ రంగయ్య శశాంక్ని అభినందించారు. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) -
హస్కి వాయిస్.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకోని..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియోకాల్ చేపించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాడు. క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో..బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అమ్మాయిల వాట్సప్‌లో పరిచయమయ్యాడు. సాంకేతికను అడ్డం పెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు.. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా(న్యూడ్) ఉన్న ఫొటోస్‌ని పంపి యువకుడికి గాలం వేశారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్సప్ వీడియో కాల్ చేపించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే..యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. ఆపై యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. తదనంతరం డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో పాటు..యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా యువకుడు పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.4లక్షలు పంపాడు. ఎంత పంపినా తీసుకుంటున్నారే కానీ..వీడియో డిలీట్ చేయడం లేదని, మరికొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
మాటల్లో దించి.. మాయచేసి..
సాంకేతిక పెరిగేకొద్ది సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. రోజు కొత్త ఎత్తుగడలతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసి నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరగాళ్లు మాత్రం తమదైన శైలిలో దోచుకుంటున్నారు. బ్యాంక్ అధికారులు ఎప్పుడూ ఫోన్ చేయరని, అలాంటి ఫోన్లు వస్తే ఎలాంటి వివరాలు ఇవ్వరాదని సమీపంలోని స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధి వాసులు సైబర్ వలకు చిక్కకుండా పోలీసులు, కాలనీ సంక్షేమ సభ్యులు, విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. – బాలానగర్ మచ్చుకుకొన్ని.. లింక్ ఓపెన్ చేయడంతో.. బాలానగర్ ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా ‘మీ బ్యాంక్ అకౌంట్ 24 గంటల్లో డియాక్టివేట్ అవుతుంది’. వెంటనే మీ కేవైసీ డాక్యుమెంట్స్‌ను చేయాలని ఓ లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేసి బ్యాంక్ సీఆర్ఎం నంబర్, పాస్వర్డ్ ఎంట్రీ చేయగా ఆ వ్యక్తి అకౌంట్ నుంచి రూ.49,999 డెబిట్ అయ్యాయి. నౌకరీ.కామ్ పేరుతో.. 27 ఏప్రిల్ 2021 రాత్రి 11.41 సమయంలో ఓ మహిళలకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి నౌకరీ.కామ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు మంచి ఉద్యోగం ఇస్తాం ఓ లింక్ పంపించాం. ఆన్లైన్లో ఇంటర్వ్యూకి హాజరు కావాలని ఉంది. అందుకు గాను రూ. 25తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఆ లింక్‌ను తెరిచిన ఆమె వివరాలు అందించి పేమెంట్ చేయడానికి ప్రయత్నించగా కాలేదు. ఆ తర్వాత ఆమె దాని గురించి పట్టించుకోలేదు. అప్పటికే తమ దగ్గర ఉన్న వివరాలతో సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ నుంచి రూ.16,665 దోచుకున్నారు. ఇట్లు అద్దెకు తీసుకుంటానని.. ఇంటిని అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. బాలానగర్ డివిజన్ సాయినగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్.కామ్‌లో పోస్టు చేశాడు. అది చూసిన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇంటిని అద్దెకు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇంటి అద్దె, అడ్వాన్స్ గురించి యజమాని తెలుపగా మొత్తం రూ. 45 వేలు చెల్లిస్తానని గూగుల్ పేమెంట్ నంబర్ నుండి అకౌంట్‌కు వివరాలు పంపాలని చెప్పడంతో బాధితుడి విరాలు పంపగా క్షణల్లో సైబర్ నేరగాళ్లు మూడు దఫాల్లో రూ. లక్ష తమ ఖాతల్లోకి మార్చుకున్నారు. ఈఎంఐ చెల్లించే క్రమంలో.. ఫిరోజ్‌గూడలో నివసించే ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు ఈఎంఐ లోన్ కట్టేందుకు గూగుల్‌లో వెతుకుతుండగా కస్టమర్ కేర్ అని కనిపించిన ఓ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఈఎంఐ నగదు డెబిట్ కాలేదు.. కారణమేంటని ప్రశ్నించగా మీ నగదు జమ కావాలంటే మీ ఫోన్లో ఎనీ డెస్క్ యాప్‌ను ఇన్స్టాల్ చేసి క్రెడిట్ కార్డు నెంబర్, ఓటీపీనీ చెప్పాలని అవతలి నుంచి సమాధానం వచ్చింది. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు చేయడంతో అరగంటలో దాదాపుగా రూ. 15 వేలకు పైగా బాధితుడి ఖాతాలోంచి దోచుకున్నారు. ► బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది మార్చి 24వ తేదీన సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కాగా ఎక్కువగా విద్యావంతులే సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకున్నారు. అందులో 7 మంది మహిళలు ఉన్నారు. ► సైబర్ నేరగాళ్లు రూ. 54. 31 లక్షలు దోచుకోగా అందులో నుంచి రూ. 8.75 లక్షలు రికవరీ చేశారు. ► బాధితులు ఎవరైన ఉంటే ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి, లేదా 155260 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ► సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన కొందరైతే.. బంధువులు, స్నేహితులకు తెలిస్తే వారి దగ్గర చులకన అవుతామనే ఆలోచనలతో ఫిర్యాదు చేయడం లేదు. బ్యాంక్ వివరాలు ఇవొద్దు.. సైబర్ నేరాలు తగ్గాలంటే ప్రజల్లో అవగాహన రావాలి. కేవైసీ అప్డేట్, బీమా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలను వేదికగా చేసుకొని మోసం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరాగాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎవ్వరికీ బ్యాంక్ వివరాలు ఇవొద్దు. బాధితులుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయండి. –ఎండీ. వాహిదుద్దీన్, బాలానగర్ సీఐ చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి -
సైబర్ కేటుగాళ్ల వల.. ఒకే రోజు ఐదుగురి వద్ద నుంచి..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): నగరంలో ప్రతిరోజూ ఆన్లైన్ వేదికగా మోసాలు జరుగుతున్నాయని తెలుస్తున్నా.. కొందరు మాత్రం ఆన్లైన్ కేటుగాళ్లు విసిరే వలలకు ఇట్టే పడిపోతున్నారు. బుధవారం ఐదు కేసుల్లో అక్షరాల రూ.12,69,988 లక్షలను పోగొట్టుకున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాధితులు సిటీ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. సర్జికల్ ఐటెంస్‌తో పంపుతానంటూ.. తార్నాకకు చెందిన విజయ్‌కుమార్‌కు మెడికల్ షాప్ ఉంది. హ్యాండ్ గ్లౌజెస్, ఇతర సర్జికల్ ఐటెంస్ కావాలంటూ గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో కనిపించిన ఓ నంబర్‌కు ఫోన్ చేసి అడగ్గా.. విజయ్‌కుమార్ ఇచ్చిన లిస్టులో ఉన్న అన్నీంటినీ పంపిస్తానన్నాడు. ఇందుకు గాను రూ.3,57,500 లక్షలను పంపాలనడంతో అకౌంట్లలో వేశాడు. రోజులు గడచినా సర్జికల్ ఐటెంస్ రావకపోవడంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొబైల్ యాక్ససిరీస్ పేరుతో... మొబైల్ షాపు యజమానైన గోవిందరావు మొబైల్ యాక్ససిరీస్ కావాలంటూ గూగుల్ ద్వారా ఓ వ్యక్తిని సంప్రదించాడు. తొలుత రూ.50వేల ఐటెంస్‌ను కావాలనడంతో.. ఆ డబ్బును ముందుగానే పంపాడు. డబ్బుకు సరిపడా ఐటెంస్ అన్నీంటినీ నిర్ణిత సమయంలో గోవిందరావుకు పంపాడు. ఆ తర్వాత ఒకేసారి బల్క్‌లో ఎక్కువ ఐటెంస్‌ను బుక్ చేశాడు. వీటికి గాను రూ.3.48లక్షలు అవుతాయనడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్నా యాక్ససిరీస్ అందలేదు. దీంతో అనుమానం వచ్చిన గోవిందరావు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హల్దీరామ్ డీలర్షిప్ నీకేనంటూ... వ్యాపారంపై మక్కువ ఉన్న చిక్కడపల్లి వాసి ఆర్సీజైన్ ఆన్లైన్ వేదికగా వ్యాపార మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో హల్దీరామ్‌కు సంబంధించి ఓ నంబర్ దొరకగా ఆ వ్యక్తిని సంప్రదించాడు. చిక్కడపల్లి ప్రాంతానికి సంబంధించి హల్దీరామ్ డీలర్షిప్ నీకే ఇస్తానంటూ నమ్మబలికాడు. ఇందుకు గాను రూ.3.24లక్షలు చెల్లించాలనడంతో ఆ మొత్తాన్ని పంపాడు. ఆ తర్వాత డీలర్షిప్ ఇవ్వకపోగా.. ఇచ్చిన డబ్బులను సైతం వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తర ఎయిర్‌లైన్ పేరుతో... ప్రముఖ ఎయిర్‌లైన్స్ అయిన విస్తర పేరుతో ఓ వ్యక్తి నగర వాసికి టోకరా వేశాడు. వారసిగూడకు చెందిన వాణీశ్వర్ తన రెసూమ్‌ను క్విక్కర్, మోనిస్టర్ సైట్లలో పెట్టాడు. రెసూమ్‌ని చూసిన ఓ వ్యక్తి “తాను విస్తర ఎయిర్ లైన్స్‌ను నుంచి మాట్లాడుతున్నానని, టికెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు మీరు ఎంపికయ్యారని చెప్పాడు. ప్రాసెసింగ్ ఫీజు, తదితర వాటికి గాను రూ.1,94,600 లక్షలను తీసుకున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోగా.. తప్పించుకోవడంతో మోసపోయానని గ్రహించి వాణీశ్వర్ బుధవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్బీఐ కేవైసీ పేరుతో... ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ హిమాయత్‌నగర్ వాసి పంకజ్‌మహత్‌ను మోసం చేశాడో సైబర్ నేరగాడు. మీ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ అప్డేట్ చేయమంటూ లింక్ పంపాడు. ఆ లింక్ ఓపెన్ చేసిన పంకజ్‌మహత్ బ్యాంకు వివరాలన్నీ నమోదు చేశాడు. అంతే క్షణాల్లో డెబిట్ కార్డు నుంచి రూ.20వేలు, నెట్ బ్యాంకింగ్ నుంచి రూ.25వేల చొప్పున మొత్తం రూ.45వేలు లూటీ చేశారు. దీంతో బాధితుడు బుధవారం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్రైం ఇన్స్పెక్టర్ ముత్తినేని రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైరస్ వల.. సాయం వంకతో భారీగా సైబర్ నేరాలు
బెంగళూరు: టెక్నికల్ సపోర్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ చింతలు తీరుస్తామంటూ చిక్కుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఈ తరహా నేరాలు భారీగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వల విసురుతున్న సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే టెక్ సపోర్ట్ పేరుతో మెసాలకు పాల్పడుతున్న 2,00,00ల మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామంటూ ప్రముఖ టెక్ సర్వీసెస్ సంస్థ అవాస్ట్ పేర్కొంది. ఇలా గుర్తించిన వారందరినీ బ్లాక్ చేయడం చేసినట్టు తెలిపింది. హానికర మాల్వేర్ సైబర్ నేరగాళ్లు టెక్ సపోర్ట్ పేరుతో వల వేస్తున్నారు. సామాన్యుల కంప్యూటర్లతో యాక్సెస్ దొరకగానే ... మాల్వేర్లను చొప్పిస్తున్నారు. అనంతరం డేటాను దొంగిలిస్తున్నారు. కొన్నిసార్లు సిస్టమ్ మొత్తం క్రాష్ అయ్యేలా హానికరమైన మాల్వేర్ను సైతం పంపిస్తున్నారు. దీంతో వీరి వలలో పడినవారు తీవ్రంగా నష్టపోతున్నట్టు అసలైన టెక్సపోర్ట్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. సపోర్ట్ పేరుతో.. టెక్ సపోర్ట్ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపడం ద్వారా కంప్యూటర్ యూజర్లతో సైబర్ నేరగాళ్లు కాంటాక్ట్‌లోకి వస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లో సమస్య ఉందని దాన్ని పరిష్కరించుకోవాలంటూ సూచిస్తారు. తమ టెక్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లను వాడితే సమస్య దూరమైపోతుందంటూ నమ్మిస్తున్నారు. ఆ వెంటనే తమ ప్రణాళికను అమల్లో పెడుతున్నారు. ఆర్థిక నేరాలు కంప్యూటర్లలో విలువైన సమాచారం చేతికి వచ్చిన తర్వాత కొందరు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల ఆధారంగా ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటే మరికొందరు వ్యక్తిగత సమాచారం ఆధారంగా బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఆన్లైన్ టెక్ సపోర్ట్ పేరుతో సంప్రదించే నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. -
ఆన్లైన్ మోసాలపై హెల్ప్‌లైన్ అస్త్రం
న్యూఢిల్లీ: మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారా? వారి మాయమాటలు నమ్మి, సొమ్ము బదిలీ చేశారా? ఓటీపీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేశారా? సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 155260 అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది. ఆర్బీఐసహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్లైన్ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్) హెల్ప్‌లైన్ అమల్లో ఉంది. డబ్బును ఆన్లైన్ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్ ఎకోసిస్టమ్ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు. -
ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
కరోనా మహమ్మరి కారణంగా ఆన్లైన్ లావాదేవీలు భారీగా పెరగడంతో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఈ విషయంలో అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది. విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని ఎస్బీఐ కోరింది. "మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్లైన్లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము" అని ఎస్బీఐ ఒక ట్వీట్లో పేర్కొంది. అందులో ఈ మెసేజ్ తో పాటు ఐదు పాయింట్స్ జత చేసింది. అవి.. We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety #SBIAapkeSaath pic.twitter.com/swhJjjlIcY — State Bank of India (@TheOfficialSBI) June 13, 2021 పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇస్తుంది. ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ కార్యాలయలు, పోలీసు, కెవైసి అథారిటీ పేరుతో కాల్ చేస్తున్న మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని తన వినియోగదారులకు సూచించింది. ప్లే స్టోర్ కాకుండా, టెలిఫోన్ కాల్స్ లేదా ఈ-మెయిల్ ఆధారంగా ఏ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేయవద్దని వినియోగదారులను కోరింది. అలాగే, తెలియని మూలాల నుంచి వచ్చిన మెయిల్స్‌లోని అటాచ్మెంట్లపై క్లిక్ చేయవద్దు అని తన వినియోగదారులను కోరింది. ఈ-మెయిల్ లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆకర్షణీయమైన, అపరిచిత ఆఫర్లకు స్పందించవద్దని ఎస్బీఐ తన వినియోగదారులకు తెలిపింది. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
అమ్మాయితో ఫోన్.. ఉచిత ఇన్సూరెన్స్.. తీరాచూస్తే..
సాక్షి, జీడిమెట్ల(హైదరాబాద్): ఉచితంగా ఇన్సూరెన్స్ వస్తుందని నమ్మి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన వ్యక్తి రూ.98 వేలు పోగొట్టుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం... చింతల్ ప్రసూన నగర్‌కు చెందిన గుళ్లపల్లి కిషోర్ ప్రైవేట్ ఉద్యోగి. ఇతను స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నాడు. గత నెల 29న కిషోర్ ఫోన్‌కు వరినీక అనే పేరుతో ఓ అమ్మాయి ఫోన్ చేసి తాను స్టాండర్డ్ చార్టెడ్ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని హిందీలో మాట్లాడి పరిచయం చేసుకుంది. అనంతరం మీ క్రెడిట్ కార్డుతో ఫ్రీగా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి అతడి వివరాలు అడిగింది. దీంతో కిషోర్ తన పేరు, కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, కార్డు వ్యాలిడిటీ అన్నీ చెప్పాడు. అనంతరం మీ కార్డుకు ఓటీపీ వస్తుంది అది చెప్పండి అని అడగ్గా కిషోర్ ఆమెను గుడ్డిగా నమ్మి చెప్పేశాడు. వెంటనే అతడి క్రెడిట్ కార్డు నుంచి రూ.98 వేలు వాడుకున్నట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయాన్ని సదరు అమ్మాయికి తెలపగా మళ్లీ ఇంకో ఓటీపీ వస్తుందని, అది చెప్తే రూ.98 వేలు తిరిగి మీ అకౌంట్‌కు వస్తాయని చెప్పింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన కిషోర్ ఫోన్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాయి తేజ్ పేరుతో మోసం.. నమ్మకండి అంటూ సుప్రీం హీరో విజ్ఞప్తి
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు మరింత పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త తరహాలో మోసాలలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. పేదోడు, ఉన్నోడు అని తేడా లేకుండా అందినకాడికి దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్కుల్లో ఒకరి పేరుని వాడుకుని కొందరు సైబర్ దొంగల ముఠా డబ్బులు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లతో చాటింగ్ చేసి ఆపదలో ఉన్నామంటూ, అర్జెంట్‌గా డబ్బులు అవసరమని చెప్పి మోసాలకు పాల్పడడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయాయి. తాజాగా సాయిధరమ్ తేజ్‌ని కూడా సైబర్ నేరగాళ్లు వదలేదు. ఆయన పేరుతో ఓ సైబర్ నేరగాడు డబ్బులు వసూలు చేయబోయాడు. తాను సాయిధరమ్ తేజ్‌ని అని ,15000 కావాలని ఓ ఫ్రెండ్‌ని అడుగుతున్నట్టుగా ఓ వాట్సాప్ చాట్‌ని తాజాగా సాయి తేజ్ పంచుకున్నారు. ఇలాంటి నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు. ‘నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి’ అని సాయి తేజ్ ట్వీట్ చేశారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరోని కేవలం 15వేలు అడగడం ఏంటి? అయినా అంత తక్కువ అడిగితే ఎలా నమ్ముతారనుకున్నాడు? అని సెటైర్లు వేస్తున్నారు. PLEASE BE CAREFUL !!! 🙏🏼 pic.twitter.com/KMGqR3Z6xY — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 30, 2021 -
ఆక్సిజన్ కాన్సట్రేటర్ పేరుతో సైబర్ నేరగాళ్ల మోసం
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఎక్కడా సిలిండర్లు దొరకని పరిస్థితులు ఉండటంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. దీన్ని కూడా సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ తరహాకు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. సిద్ధి అంబర్‌బజార్ ప్రాంతానికి చెందిన ఆనంద్ శర్మ ఆక్సిజన్ కాన్సట్రేటర్ మిషన్ ఖరీదు చేయాలని భావించారు. విద్యుత్‌తో పని చేసే ఈ యంత్రం చుట్టూ గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను సమీకరించి రోగికి అందిస్తుంది. ఇది స్థానికంగా మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో నరీన ఆక్సిజన్ కాన్సట్రేటర్ పేరుతో ఓ సంస్థ వివరాలు కనిపించాయి. వారిని ఫోన్లో సంప్రదించగా... అవసరమైన యంత్రాలు పంపిస్తామంటూ రూ. 2.73 లక్షలు బదిలీ చేయించుకుని మోసం చేశారు. మరో ఉదంతంలో సికింద్రాబాద్ వాసి ఇలాంటి యంత్రం విక్రేతల వివరాలు చెప్పాలని తన స్నేహితుడిని కోరారు. ఆయన ద్వారా మరో స్నేహితుడి నంబర్ వచ్చింది. ఇలా మొత్తం ఆరుగురిని సంప్రదించారు. ఆఖరి వ్యక్తి ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూసి ఓ నంబర్ ఇచ్చారు. సికింద్రాబాద్ వ్యక్తి ఆ నంబర్‌కు ఫోన్ చేసి రెండు యంత్రాలు కావాలని చెప్పారు. ఒక్కోటి రూ. 52,700 సరఫరా చేస్తానని చెప్పిన సైబర్ నేరగాడు రూ. 1,05,400 బదిలీ చేయించుకుని మోసం చేశారు. వీరిద్దరి ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ సంస్థలు మరిన్ని సోషల్ మీడియా, ఇంటర్నెట్ల్లో ఉన్నాయని, వాటిని నమ్మి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో ఆగని మృత్యుఘోష -
అలర్ట్ : సిమ్ బ్లాక్ అంటూ లక్షలు మాయం
సాక్షి, భువనేశ్వర్ : మొబైల్ సిమ్‌కార్డు యాక్టివేట్ చేసుకోవాలంటూ సాక్షాత్తూ ఒక వైద్యుడిని నిలువునా ముంచేసిన వైనం కలకలం రేపింది. బ్యాంకు అధికారులు, ఇతర నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. చదువుకున్న వారు సైతం సైబర్ మాయగాళ్ల వలలో పడి లక్షల రూపాయలను పోగొట్టుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని కటక్‌కు చెందిన డాక్టర్ సనతాన్ మొహంతి సైబర్ మోసానికి దారుణంగా బలయ్యాడు. కేటుగాడి మాయలోపడి రూ .77 లక్షలకు పైగా నష్టపోయారు. తన మొబైల్ సిమ్ కార్డును త్వరగా యాక్టివేట్ చేసుకోవాలని., లేదంటే బ్లాక్ అవుతుందంటూ ఫిబ్రవరి 9 మహంతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘క్విక్ సపోర్ట్’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంక్ వివరాలను ఇవ్వమని తానే స్వయంగా సిమ్ యాక్టివేట్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతని మాటల్ని విశ్వసించిన మహంతి మరో ఆలోచన చేయకుండా డెబిట్ కార్డు నంబర్, ఇతర బ్యాంక్ వివరాలను యాప్‌లోని షేర్ చేశారు. అంతే...అదే రోజు సాయంత్రం ఏటీఎం లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు అకస్మాత్తుగా ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చింది. అంతేకాదు ఈ వ్యవహారంపై బ్యాంకులో ఫిర్యాదు చేసిన తరువాత కూడా అతని ఖాతాలోని నగదు సర్వం గోవిందా అయిపోయింది. దీంతో ఖంగుతిన్న మహంతి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత తులసీపూర్ ఎస్బీఐ బ్రాంచ్‌లో మహంతి మొదట ఫిర్యాదు చేశారు. 25 వేల రూపాయల చొప్పున రెండుసార్లు తన ఖాతాలనుంచి నగదు విత్‌డ్రా అయిందని డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొత్త ఎటిఎం కార్డు జారీ చేస్తామని, ఇకపై మెసపూరిత లావాదేవీలు జరగవని బ్రాంచ్ మేనేజర్ హామీ ఇచ్చారు. కానీ ఫిబ్రవరి 9నుండి ఫిబ్రవరి 15 వరకు తనకు సంబంధం లేకుండానే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనీ, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ .67లక్షలు మాయమయ్యాయని తెలిపారు. మొత్తం జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న రూ. 77,86,727 రూపాయలు నష్టపోయానని మహంతి ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరిపి తన డబ్బును తిరిగి ఇప్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐఐఈని ఆశ్రయించారు.