కరోనా మహమ్మరి కారణంగా ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా పెరగడంతో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఈ విషయంలో అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది.
విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని ఎస్‌బీఐ కోరింది. "మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము" అని ఎస్‌బీఐ ఒక ట్వీట్‌లో పేర్కొంది. అందులో ఈ మెసేజ్ తో పాటు ఐదు పాయింట్స్ జత చేసింది. అవి..
We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety #SBIAapkeSaath pic.twitter.com/swhJjjlIcY
— State Bank of India (@TheOfficialSBI) June 13, 2021
- పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇస్తుంది.
- ఎస్‌బీఐ, ఆర్‌బీఐ, ప్రభుత్వ కార్యాలయలు, పోలీసు, కెవైసి అథారిటీ పేరుతో కాల్ చేస్తున్న మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని తన వినియోగదారులకు సూచించింది.
- ప్లే స్టోర్ కాకుండా, టెలిఫోన్ కాల్స్ లేదా ఈ-మెయిల్ ఆధారంగా ఏ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని వినియోగదారులను కోరింది.
- అలాగే, తెలియని మూలాల నుంచి వచ్చిన మెయిల్స్‌లోని అటాచ్‌మెంట్‌లపై క్లిక్ చేయవద్దు అని తన వినియోగదారులను కోరింది.
- ఈ-మెయిల్ లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆకర్షణీయమైన, అపరిచిత ఆఫర్లకు స్పందించవద్దని ఎస్‌బీఐ తన వినియోగదారులకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment