cybercrime attacks
-
నగరవాసికి 'జపాన్' జాబ్ కలకలం! బెంగళూరు జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జపాన్‌లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్ వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం ఉందని మెయిల్ సారాంశం. ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్ నాకాకిత బాధితురాలిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్‌కు కంపెనీ నుంచి జాబ్‌కు సెలెక్ట్ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్‌తో కూడిన ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్‌తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది. జీ–20 సదస్సుతో క్యాన్సిల్ అంటూ.. ఢిల్లీలో జపాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్ కంపెనీ ఎలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే? -
వాట్సాప్‌లో చీటింగ్!
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలకు పైఎత్తులు వేస్తున్నారు. సాధారణ స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) ఫిల్టర్లను ప్రవేశపెట్టినప్పటికీ అంతకు మించి దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల వాట్సాప్ కాల్స్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో సుమారు 480 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులుండటం, ప్రపంచంలోనే అతిపెద్ద వాట్సాప్ కేంద్రం కావడంతో సైబర్ నేరగాళ్ల దృష్టి మనపై పడింది. అంతర్జాతీయ నంబర్లతో.. వాట్సాప్ వినియోగదారులకు ఎక్కువగా ఇథియోపియా (+25), మలేషియా(+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), మాలి (+223), గినియా (+224) వియత్నాం (+84)తో పాటు మరికొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ నంబర్లతో పదేపదే వాట్సాప్ కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆగ్నేయాసియా దేశాల ఐఎస్డీ కోడ్లతోనే కాల్స్ వస్తున్నాయి. కనిపెట్టడం కష్టం.. అంతర్జాతీయ నంబర్లతో వస్తున్న వాట్సాప్ కాల్స్ ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఐఎస్డీ కోడ్‌తో వచ్చే వాట్సాప్ కాల్‌ను మోసగాళ్లు అదే దేశం నుంచే చేస్తున్నట్లు నిర్ధారించలేం. విదేశాల్లో ఉండే వారి ద్వారా అక్కడి నంబర్ తీసుకుని వేరే దేశంలో ఉంటూ వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని మోసపూరిత కాల్స్ చేయవచ్చు. బయట మార్కెట్లో చాలా ఏజెన్సీలు నేరగాళ్లకు అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. ‘మనీ ఫర్ లైక్స్’ స్కామ్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా జాబ్ ఆఫర్లను పంపడం కొత్త రకం స్కామ్. ఇంటి నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు. యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని, టెలిగ్రామ్ చానెల్లో చేరాలని నమ్మబలుకుతారు. యూట్యూబ్ వీడియోల లైక్ బటన్ నొక్కడం, పోస్టులపై కామెంట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ను ప్రచారం చేయడం లాంటి పనులు చేయాలని చెబుతారు. బాధితుడిని నమ్మించడానికి తొలుత చిన్న చిన్న టాస్క్‌లు అప్పగించి చెల్లింపులు జరుపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ టాస్క్‌లను కేటాయిస్తారు. అయితే ఈసారి ముందస్తుగా భారీగా డిపాజిట్ చేయాలని కోరతారు. ఇక్కడే బాధితులు మోసపోతున్నారు. డిపాజిట్లు వసూలు చేసుకున్నాక నేరగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో నగదు రిటర్న్‌లతో నకిలీ సమస్యను సృష్టిస్తారు. యూజర్లు తమ టాస్క్‌లకు వచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు కొంత మొత్తం చెల్లించాలని వసూలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే బాధితులను స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్ల పేరుతో.. నేరగాళ్లు ‘ఏఐ’ చాటున స్పూఫింగ్ ద్వారా బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి మెసేజ్ కాల్ వస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి ఫోన్ మాట్లాడుతుండగా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపి మోసాలకు పాల్పడుతున్నారు. అనాథలు, ప్రకృతి విపత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. భావోద్వేగాలకు గురి చేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతో కాజేస్తున్నారు. లైక్ చేస్తే అంతే.. యూట్యూబ్ టాస్క్‌లు, వాట్సాప్‌కు వచ్చే లింక్‌లను ఒక్కసారి లైక్ చేస్తే సదరు యూజర్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ మరుక్షణం నుంచి గూగుల్ మెయిల్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైళ్లను సులభంగా తెలుసుకోగలుతారు. ఇందులో భాగంగానే నిత్యం ఈ–మెయిళ్లకు అనేక ప్రమోషనల్ మెయిళ్లు, లోన్ వచ్చినట్టు లింక్‌లు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే యూజర్ మీడియా యాక్సెస్ మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేస్బుక్లో యూజర్ ప్రొఫైల్‌ను బట్టి రకరకాల మోసపూరిత ఆఫర్లతో ప్రలోభపెడతారు. ఆ లింక్‌లపై క్లిక్ చేసి నగదు చెల్లిస్తే వస్తువులు ఎప్పటికీ డెలివరీ కావు. కొన్ని సందర్భాల్లో అశ్లీలతను జొప్పించి ట్రాప్ చేయడం పరిపాటిగా మారింది. వీడియో కాల్స్‌తో బ్లాక్ మెయిల్ మోసగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేందుకు వాట్సాప్ వీడియో కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు రకరకాల నంబర్ల నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అవతల మహిళ అశ్లీలంగా కనిపిస్తుంది. కాల్ డిస్కనెక్ట్ చేసేలోగా నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ తీస్తారు. ఆ తర్వాత బాధితుడికి పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. మరికొన్ని ఘటనల్లో వీడియో కాల్స్ వస్తున్నప్పటికీ యూజర్ స్క్రీన్‌పై ఎటువంటి ఆడియో లేకుండా ఖాళీ వీడియో కనిపిస్తుంది. చూస్తుండగానే కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను పంపి డబ్బులు ఇవ్వకుంటే యూజర్ కాంటాక్ట్‌లకు పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతారు. ఆ కాల్స్‌ను బ్లాక్ చేయండి సైబర్ మోసగాళ్లు అనేక విధాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తారు. వాట్సాప్‌లో అవాంఛిత, అంతర్జాతీయ కోడ్లతో ఫోన్లు వస్తే తిరస్కరించాలి. పదేపదే వస్తుంటే బ్లాక్ చేసి వాట్సాప్‌లోనే రిపోర్టు చేయాలి. ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే యూజర్ డేటా మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుపోతుంది. తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. డిస్కౌంట్లు, చెకింగ్‌ల పేరుతో ఎవరూ ఫోన్ చేసినా వివరాలు చెప్పొద్దు. సైబర్ మోసాలకు గురైన బాధితులు నేషనల్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దార్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
ఆందోళన కలిగిస్తున్న సైబర్ నేరాలు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎయిర్టెల్ తెలిపింది. కేవైసీ అప్డేట్ పేరుతో బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును తస్కరిస్తున్నారని కంపెనీ సీఈవో గోపాల్ విఠల్ గుర్తు చేశారు. ఇటువంటి నేరాలు పెరుగుతున్నందున వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘మోసపూరిత యూపీఐ హ్యాండిల్స్, వెబ్‌సైట్స్, ఓటీపీలు తరచుగా వస్తున్నాయి. ఎన్పీసీఐ, భీమ్ పదాలు, లోగోలతో తప్పుడు యూపీఐ యాప్స్, వెబ్‌సైట్స్ వెల్లువెత్తుతున్నాయి. అవి డౌన్లోడ్ చేసిన వెంటనే బ్యాంకు వివరాలను తీసుకుంటున్నాయి. దీంతో ఖాతాలో ఉన్న నగదును తస్కరించేందుకు మోసగాళ్లకు పని సులువు అవుతోంది. బ్యాంక్ ఖాతా అప్‌గ్రేడ్, రెనివల్ చేస్తామంటూ ఓటీపీ పంపి మోసం చేస్తున్నారు. నేరాలను కట్టడి చేయాలంటే కస్టమర్ ఐడీ, ఎమ్–పిన్, ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదు. నమ్మశక్యం కాని ఆఫర్లు, డిస్కౌంట్లను చూపే యాప్స్, వెబ్సైట్లను తెరువరాదు’ అని తెలిపారు. -
ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్!
కరోనా మహమ్మరి కారణంగా ఆన్లైన్ లావాదేవీలు భారీగా పెరగడంతో రోజు రోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతుంది. ఒకవైపు పోలీసులు ఈ విషయంలో అవగాహన కల్పిస్తుంటే, మరోవైపు బ్యాంకులు కూడా జాగ్రత్తగా ఉండాలని తమ ఖాతాదారులుకు సూచిస్తున్నాయి. తాజాగా ఈ సైబర్ మోసల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఎంచుకున్న వినియోగదారులు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి సూచించింది. విలువైన సమాచారాన్ని ఎవరితో పంచుకోవద్దని ఎస్బీఐ కోరింది. "మా ఖాతాదారులకు గమనిక మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి, ఆన్లైన్లో ఎటువంటి సున్నితమైన వివరాలను పంచుకోవద్దు, తెలియని వారు చెబితే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నాము" అని ఎస్బీఐ ఒక ట్వీట్లో పేర్కొంది. అందులో ఈ మెసేజ్ తో పాటు ఐదు పాయింట్స్ జత చేసింది. అవి.. We advise our customers to be alert of fraudsters and not to share any sensitive details online or download any app from an unknown source.#StaySafe #StaySecure #BeAlert #CyberSecurity #CyberSafety #SBIAapkeSaath pic.twitter.com/swhJjjlIcY — State Bank of India (@TheOfficialSBI) June 13, 2021 పుట్టిన తేదీ డెబిట్ కార్డ్ నెంబర్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, డెబిట్ కార్డు పిన్, సీవీవీ, ఓటీపీ వంటి వివరాలను షేర్ చేసుకోవద్దు అని సలహా ఇస్తుంది. ఎస్బీఐ, ఆర్బీఐ, ప్రభుత్వ కార్యాలయలు, పోలీసు, కెవైసి అథారిటీ పేరుతో కాల్ చేస్తున్న మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని తన వినియోగదారులకు సూచించింది. ప్లే స్టోర్ కాకుండా, టెలిఫోన్ కాల్స్ లేదా ఈ-మెయిల్ ఆధారంగా ఏ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేయవద్దని వినియోగదారులను కోరింది. అలాగే, తెలియని మూలాల నుంచి వచ్చిన మెయిల్స్‌లోని అటాచ్మెంట్లపై క్లిక్ చేయవద్దు అని తన వినియోగదారులను కోరింది. ఈ-మెయిల్ లు, ఎస్ఎంఎస్, ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆకర్షణీయమైన, అపరిచిత ఆఫర్లకు స్పందించవద్దని ఎస్బీఐ తన వినియోగదారులకు తెలిపింది. చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
సైబర్ నేరాలపై కీలక విషయాలను వెల్లడించిన వెరిజోన్ నివేదిక...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని వెరిజోన్ బిజినెస్ గ్రూప్ ఒక నివేదికలో పేర్కొంది. డేటా చౌర్యానికి సంబంధించి 2021 నివేదిక ప్రకారం ఫిషింగ్ దాడులు 11 శాతం, ర్యాన్సమ్వేర్ దాడులు ఆరు శాతం పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తుండటంతో పాటు కొంగొత్త డిజిటల్ టెక్నాలజీలకు చాలా వేగంగా మారుతున్నారు. సుమారు 29,207 ఉదంతాలను విశ్లేషించగా.. 5,258 కేసుల్లో రూఢీగా డేటా చౌర్యం జరిగినట్లు నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కువగా హెల్త్‌కేర్, ఫార్మా రంగాలను లక్ష్యంగా ఎంచుకుని మేథోహక్కుల చౌర్యం మొదలైన వాటికి పాల్పడుతున్నారని మంగళవారం ఒక కార్యక్రమంలో వెరిజోన్ బిజినెస్ గ్రూప్ ఆగ్నేయాసియా, భారత విభాగం హెడ్ ప్రశాంత్ గుప్తా తెలిపారు. డేటా చౌర్యం కారణంగా వ్యాపార వర్గాలకు సగటున 21,659 డాలర్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 95 శాతం సందర్భాల్లో నష్టం సుమారు 826 డాలర్ల నుంచి 6,53,587 డాలర్ల దాకా ఉందని ఉందని వివరించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎం కిషన్ రెడ్డి, అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మ్యాన్, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్ ఈ నివేదిక రూపకల్పనలో సహకారం అందించాయి. -
25 మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌లివే!
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్వేర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేల కొద్దీ సిస్టమ్‌లు వీటి బారిన పడి అతలాకుతలమవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సైబర్ అటాక్స్‌తో ప్రపంచమే షేక్ అవుతోంది. 2017 తొలి ఆరు నెలల కాలంలో భారత్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక సైబర్ క్రైమ్ జరిగిందని తాజా డేటాలో వెల్లడైంది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది సైబర్‌క్రైమ్‌లు పెరిగిపోయాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 27,482 సైబర్‌క్రైమ్ కేసులు నమోదైనట్టు తెలిసింది. సైబర్‌క్రైమ్‌లు ఇంతలా విజృంభించడానికి ప్రధాన కారణం అత్యంత కీలకమైన పాస్వర్డ్లు సైబర్ నేరగాళ్ల చేతిలోకి చిక్కడమే. పాస్వర్డ్లు ఎంతో భద్రంగా దాచుకోవాలని, వాటిని పెట్టుకునేటప్పుడు ఎంతో జాగురుకత వహించాలని సైబర్ డిపార్ట్మెంట్ నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా... ప్రజలు మాత్రం నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారని వెల్లడవుతోంది. 2016లో సైబర్ క్రైమ్ బారిన పడి, పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్లిన మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌ల జాబితాను కీపర్ సెక్యురిటీ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 25 మోస్ట్ కామన్ పాస్వర్డ్లు చాలా డేంజర్‌గా ఉన్నట్టు తెలిసింది. అవేమిటో ఓసారి చూద్దాం.. 123456 123456789 qwerty 12345678 111111 1234567890 1234567 password 123123 987654321 qwertyuiop mynoob 123321 666666 18atcskd2w 7777777 1q2w3e4r 654321 555555 3rjs1la7qe google 1q2w3e4r5t 123qwe zxcvbnm