25 మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌లివే!
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా ర్యాన్సమ్‌వేర్ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేల కొద్దీ సిస్టమ్‌లు వీటి బారిన పడి అతలాకుతలమవుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సైబర్ అటాక్స్‌తో ప్రపంచమే షేక్ అవుతోంది. 2017 తొలి ఆరు నెలల కాలంలో భారత్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక సైబర్ క్రైమ్ జరిగిందని తాజా డేటాలో వెల్లడైంది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది సైబర్‌క్రైమ్‌లు పెరిగిపోయాయి. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 27,482 సైబర్‌క్రైమ్ కేసులు నమోదైనట్టు తెలిసింది.
సైబర్‌క్రైమ్‌లు ఇంతలా విజృంభించడానికి ప్రధాన కారణం అత్యంత కీలకమైన పాస్‌వర్డ్‌లు సైబర్ నేరగాళ్ల చేతిలోకి చిక్కడమే. పాస్‌వర్డ్‌లు ఎంతో భద్రంగా దాచుకోవాలని, వాటిని పెట్టుకునేటప్పుడు ఎంతో జాగురుకత వహించాలని సైబర్ డిపార్ట్‌మెంట్ నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా... ప్రజలు మాత్రం నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నారని వెల్లడవుతోంది. 2016లో సైబర్ క్రైమ్ బారిన పడి, పబ్లిక్ డొమైన్‌లోకి వెళ్లిన మోస్ట్ డేంజరస్ పాస్‌వర్డ్‌ల జాబితాను కీపర్ సెక్యురిటీ విడుదల చేసింది.
ఈ జాబితా ప్రకారం 25 మోస్ట్ కామన్ పాస్‌వర్డ్‌లు చాలా డేంజర్‌గా ఉన్నట్టు తెలిసింది. అవేమిటో ఓసారి చూద్దాం..
-
123456
-
123456789
-
qwerty
-
12345678
-
111111
-
1234567890
-
1234567
-
password
-
123123
-
987654321
-
qwertyuiop
-
mynoob
-
123321
-
666666
-
18atcskd2w
-
7777777
-
1q2w3e4r
-
654321
-
555555
-
3rjs1la7qe
-
google
-
1q2w3e4r5t
-
123qwe
-
zxcvbnm