న్యూఢిల్లీ: సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎయిర్‌టెల్ తెలిపింది. కేవైసీ అప్‌డేట్ పేరుతో బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును తస్కరిస్తున్నారని కంపెనీ సీఈవో గోపాల్ విఠల్ గుర్తు చేశారు. ఇటువంటి నేరాలు పెరుగుతున్నందున వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘మోసపూరిత యూపీఐ హ్యాండిల్స్, వెబ్‌సైట్స్, ఓటీపీలు తరచుగా వస్తున్నాయి.
ఎన్‌పీసీఐ, భీమ్ పదాలు, లోగోలతో తప్పుడు యూపీఐ యాప్స్, వెబ్‌సైట్స్ వెల్లువెత్తుతున్నాయి. అవి డౌన్‌లోడ్ చేసిన వెంటనే బ్యాంకు వివరాలను తీసుకుంటున్నాయి. దీంతో ఖాతాలో ఉన్న నగదును తస్కరించేందుకు మోసగాళ్లకు పని సులువు అవుతోంది. బ్యాంక్ ఖాతా అప్‌గ్రేడ్, రెనివల్ చేస్తామంటూ ఓటీపీ పంపి మోసం చేస్తున్నారు. నేరాలను కట్టడి చేయాలంటే కస్టమర్ ఐడీ, ఎమ్–పిన్, ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదు. నమ్మశక్యం కాని ఆఫర్లు, డిస్కౌంట్లను చూపే యాప్స్, వెబ్‌సైట్లను తెరువరాదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment