Gopal Vittal
-
ఎయిర్టెల్ నెట్వర్క్ తగ్గడానికి కారణం ఇదే.. సీఈవో గోపాల్ విఠల్
ముంబై: వేగవంతమైన టెలికం నెట్‌వర్క్‌ను సమర్ధంగా వినియోగించుకోగలిగే సర్వీసులు లేకపోవడం వల్లే 5జీ నెట్వర్క్ ప్రయోజనాలు దేశీయంగా పూర్తి స్థాయిలో లభించడం లేదని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. ఫలితంగా స్ప్రెడ్‌షీట్ లేదా వర్డ్ డాక్యుమెంటును ఉపయోగించే యూజర్లకు 4జీ, 5జీ సర్వీసుల మధ్య వ్యత్యాసం తెలియకుండా పోతోందని వ్యాఖ్యానించారు. 5జీ లాంటి ఆధునిక టెక్నాలజీ నుంచి అపరిమిత ప్రయోజనాలు పొందడానికి అవకాశమున్నా తిరోగమన నియంత్రణ విధానాల వల్ల పరిమిత స్థాయిలోనే లభ్యమవుతున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఫ్రేమ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విఠల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 1.5 లక్షల పైచిలుకు గ్రామాలు, 7,000 పట్టణాలకు తమ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కానీ 5జీ నెట్వర్క్ విస్తరిస్తున్న స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే సర్వీసులు అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. ఇందుకోసం 5జీ టెక్నాలజీని ఉపయోగించుకునే వ్యవస్థ అంతా సమిష్టిగా పని చేయాల్సి ఉంటుందని విఠల్ వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై నడుస్తున్న అనుభూతిని అందించడం, ఓ సర్జన్‌కు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో తోడ్పాటు అందించడం వంటి మార్గాల్లో 5జీతో ఒనగూరే ప్రయోజనాలను సోదాహరణంగా తాము చూపించామని ఆయన చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో మార్పులు జరుగుతున్నంత వేగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు, వినోద రంగాలు ముందుకు పరుగెత్తడం లేదని వ్యాఖ్యానించారు. -
5జీ సేవల్లో జియోకు గట్టి పోటీ...ఎయిర్టెల్ గుడ్‌న్యూస్, షేర్లు జూమ్
న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ నెల రోజుల్లోగా 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ నాటికి ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేస్తామని సంస్థ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. దీపావళికి రిలయన్స్ జియో 5జీ సేవలను లాంచ్ చేయనున్న నేపథ్యంలో ఎయిర్టెల్ వేగం పెంచింది. శరవేంగంగా దేశంలో 5జీ సేవలను లాంచ్ చేయనుంది. ఈ వార్తలతో గురువారం ఇంట్రాడే ట్రేడ్‌లో ఎయిర్టెల్ షేరు రెండు శాతానికిపైగా లాభపడి రూ.770 స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాలను 2023లోగా కవర్ చేస్తామన్నారు. 4జీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ వేగం 20-30 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఏ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నది వినియోగదార్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కూడా మిట్టల్ గుర్తు చేశారు. -
స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 8 వేల కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్‌టెల్‌కు అవకశం ఉంది. -
5000 పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్‌లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటి. మొబైల్ సేవల చార్జీలు భారత్‌లో అతి తక్కువ. టారిఫ్‌లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్‌ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 900 మెగాహెట్జ్ ద్వారా.. ‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్‌లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) 5జీ నెట్వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్‌లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం. రిలయన్స్ జియో సైతం.. టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్‌ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్‌తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కస్టమర్‌కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్‌ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్‌ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్‌లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్‌లో టారిఫ్‌లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్‌పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్‌ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్‌వర్క్‌లు .. డివైజ్‌ల అప్‌గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆందోళన కలిగిస్తున్న సైబర్ నేరాలు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎయిర్టెల్ తెలిపింది. కేవైసీ అప్డేట్ పేరుతో బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును తస్కరిస్తున్నారని కంపెనీ సీఈవో గోపాల్ విఠల్ గుర్తు చేశారు. ఇటువంటి నేరాలు పెరుగుతున్నందున వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘మోసపూరిత యూపీఐ హ్యాండిల్స్, వెబ్‌సైట్స్, ఓటీపీలు తరచుగా వస్తున్నాయి. ఎన్పీసీఐ, భీమ్ పదాలు, లోగోలతో తప్పుడు యూపీఐ యాప్స్, వెబ్‌సైట్స్ వెల్లువెత్తుతున్నాయి. అవి డౌన్లోడ్ చేసిన వెంటనే బ్యాంకు వివరాలను తీసుకుంటున్నాయి. దీంతో ఖాతాలో ఉన్న నగదును తస్కరించేందుకు మోసగాళ్లకు పని సులువు అవుతోంది. బ్యాంక్ ఖాతా అప్‌గ్రేడ్, రెనివల్ చేస్తామంటూ ఓటీపీ పంపి మోసం చేస్తున్నారు. నేరాలను కట్టడి చేయాలంటే కస్టమర్ ఐడీ, ఎమ్–పిన్, ఓటీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోరాదు. నమ్మశక్యం కాని ఆఫర్లు, డిస్కౌంట్లను చూపే యాప్స్, వెబ్సైట్లను తెరువరాదు’ అని తెలిపారు. -
ఎయిర్టెల్: సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, వీటితో పాటే సైబర్ నేరాలు కూడా పెరిగాయని టెలికం దిగ్గజం ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. తమ కస్టమర్లు ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతరం పనిచేస్తున్నామని, ఎప్పటికప్పుడు భద్రతాపరమైన కొత్త ఫీచర్స్‌ను ప్రవేశపేడుతున్నామని ఆయన పేర్కొన్నారు. కస్టమర్లకు ఈ మేరకు ఆయన ఈ-మెయిల్ పంపారు. మోసగాళ్లు పాటిస్తున్న విధానాలను వివరించడంతో పాటు డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన మోసాలను ప్రస్తావించారు. వీఐపీ నంబర్లను భారీ డిస్కౌంటుతో ఇస్తామని, కస్టమర్ల వివరాల సేకరణ(కేవైసీ) కోసమంటూ ఎయిర్టెల్ ఉద్యోగుల పేరుతో వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్ మొదలైన వాటి విషయంలో జాగ్రత్త వహించాలని విఠల్ సూచించారు. ‘‘ఎయిర్టెల్ వీఐపీ నంబర్లను ఫోన్ ద్వారా విక్రయించదు. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించదు. ఇలాంటివి జరిగితే తక్షణం 121కి కాల్ చేసి ధృవీకరించుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు సురక్షితంగా చెల్లింపులు జరిపేందుకు ఎయిర్టెల్ సేఫ్ పే ఫీచర్‌ను ప్రవేశపెట్టామన్నారు. చదవండి: Whatsapp: వాట్సాప్‌పై కేంద్రం గరం గరం -
3జీ సేవలను నిలిపేస్తున్న ఎయిర్టెల్!
న్యూఢిల్లీ : ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జియో నుంచి పోటీని తట్టుకోలేపోతున్న ఎయిర్టెల్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాల్లో అందిస్తున్న 3జీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో 2జీ సేవల విషయంలో భారతీ ఎయిర్టెల్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై కూడా ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ స్పందించారు. 2జీ నెట్వర్క్ నుంచి రెవెన్యూ వస్తున్నంతకాలం 2జీ సేవలు కొనసాగిస్తామన్నారు. అంతేకాకుండా 2జీ సేవలు పొందుతున్న వారికోసం ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్లను సవరిస్తూనే ఉంటామని వివరించారు. ఫీచర్ ఫోన్ వినియోగదారుల దృష్ట్యా 2జీ నెట్‌వర్క్‌లను మాత్రం కొనసాగించనున్నట్లు వివరించారు. కలకత్తాలో ఎయిర్టెల్ 3జీ నెట్వర్క్ ఇప్పటికే షట్‌డౌన్ కాగా, హరియాణాలో 3జీని ఆ సంస్థ నిలిపివేసింది. ఈ రెండు రాష్ట్రాలలో కూడా 2జీ, 4జీ సేవలను యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 3జీ సేవలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. 22 టెలికాం సర్కిల్ల ద్వారా అందిస్తున్న 3జీ సేవలను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు తెలిపారు. -
మొబైల్ చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ‘ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం‘ అని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మరోవైపు, ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ‘టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది‘ అని విఠల్ పేర్కొన్నారు. మరోవైపు, తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్ చెప్పారు. ట్రాయ్‌పై జియో విమర్శలు.. ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్టెల్ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను జియో విధించింది. ఇతర టెల్కోలు దాచిపెడుతున్నాయ్.. ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ ఆరోపించారు. -
ఎయిర్టెల్ లాభం 72 శాతం డౌన్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72% తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని ఎయిర్టెల్ తెలిపింది. భారత్‌లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విఠల్ తెలిపారు. ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఎబిటా 17 శాతం తగ్గి రూ.6,307 కోట్లకు చేరిందని వివరించారు. గత క్యూ3లో రూ.123గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ)ఈ క్యూ3లో 16 శాతం తగ్గి రూ.104కు చేరిందని తెలిపారు. గత క్యూ3లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న నికర రుణభారం ఈ క్యూ3లో రూ.6,837 కోట్లు క్షీణించి రూ.1.06 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు. ఎయిర్టెల్ ఆఫ్రికాకే లాభాలు... ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కారణంగా రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని విఠల్ తెలిపారు.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.972 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని తెలిపారు. గత క్యూ3లో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్టెల్ ఆఫ్రికా నికరలాభం ఈ క్యూ3లో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11% పెరిగి రూ.5,904 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్‌టెల్‌మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. 40.4 కోట్లకు ఖాతాదారులు.... గత క్యూ3లో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని విఠల్ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని, తీవ్రమైన పోటీ కారణంగా భారత మొబైల్ వ్యాపారం 4 శాతం క్షీణించిందని వివరించారు. కాగా, ట్రాయ్ గణాంకాల ప్రకారం నవంబర్‌లో దేశీయంగా ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 34.1 కోట్లు. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం డిసెంబర్లో వినియోగదారుల సంఖ్య 28.42 కోట్లు. అంటే ఒక నెలలో ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 5.7 కోట్లు తగ్గింది. మూడు రెట్లు పెరిగిన డేటా..: భారత్‌లో వినియోగదారుల సంఖ్య తగ్గినా, డేటా వినియోగం మాత్రం జోరుగా ఉందని విఠల్ వివరించారు.. గత క్యూ3లో 1,106 బిలియన్ ఎమ్బీగా ఉన్న డేటా వినియోగం ఈ క్యూ3లో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 3,217 బిలియన్ ఎమ్బీలకు పెరిగిందని పేర్కొన్నారు. మొబైల్ 4జీ డేటా వినియోగదారులు 112 శాతం వృద్ధితో 7.71 కోట్లకు పెరిగారని వివరించింది. -
ఎయిర్టెల్ లాభం 75% డౌన్
♦ క్యూ1లో రూ.367 కోట్లు... ♦ గత 18 త్రైమాసికాల్లో అతితక్కువ లాభం ఇది... ♦ ఆదాయం రూ.21,958 కోట్లు; 14 శాతం క్షీణత ♦ రిలయన్స్ జియో చౌక ఆఫర్ల ప్రభావం... న్యూఢిల్లీ: దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్‌కు రిలయన్స్ జియో ఉచిత, చౌక టారిఫ్‌ల సెగ తీవ్రంగా తగులుతోంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది తొలి త్రైమాసికంలో(2017–18) ఏకంగా 75 శాతం దిగజారి రూ.367 కోట్లకు పడిపోయింది. గడిచిన 18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ లాభం కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ.1,462 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.21,958 కోట్లకు తగ్గింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.25,546 కోట్లతో పోలిస్తే 14 శాతం క్షీణించింది. కాగా, క్యూ1లో ఎయిర్టెల్ రూ.300 కోట్ల నికర లాభాన్ని, రూ.21,975 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా స్వల్ప తగ్గుదలే... గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో అధికారికంగా టెలికం సేవలను ఆరంభించింది. అప్పటినుంచీ ఈ ఏడాది మార్చి వరకూ ఉచితంగానే సేవలందిస్తూ వచ్చింది. ఏప్రిల్ నుంచి మాత్రమే బిల్లింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, జియో దెబ్బకు ఎయిర్టెల్ సహా ఇతర టెల్కోలు కూడా చౌక టారిఫ్‌లను ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో సీక్వెన్షియల్ ప్రాతిపదికన (గతేడాది చివరి క్వార్టర్ డిసెంబర్–మార్చి) చూస్తే... లాభాల్లో క్షీణత చాలా స్వల్పంగానే నమోదు కావడం గమనార్హం. మార్చి క్వార్టర్లో లాభం రూ.373 కోట్లతో పోలిస్తే.. స్వల్పంగా 1.7 శాతం మాత్రమే తగ్గింది. ‘కొత్త టెలికం ఆపరేటర్ (రిలయన్స్ జియో) ఎంట్రీ తర్వాత భారతీయ టెలికం మార్కెట్లో నెలకొన్న పోటాపోటీ టారిఫ్‌ల కోత, ఉచిత ఆఫర్లతో టెలికం కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అదేవిధంగా వార్షికంగా కంపెనీల ఆదాయంలో 15 శాతం మేర తగ్గుదల కారణంగా లాభదాయకత, నగదు ప్రవాహాలతో పాటు రుణాల విషయంలో కూడా మరింత ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంది’ అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. కొత్త ఆపరేటర్(జియో) చౌక టారిఫ్‌ల కారణంగా దేశీ మొబైల్ మార్కెట్ ప్రస్తుత క్వార్టర్(జూలై–సెప్టెంబర్)లో కూడా తీవ్ర కుదుపులతోనే కొనసాగనుందని చెప్పారు. కాగా, తాజాగా రిలయన్స్ జియో.. ఫీచర్ ఫోన్ కస్టమర్లను తనవైపు తిప్పుకోవడానికి ఉచితంగా జియో ఫోన్‌ను(మూడేళ్ల తర్వాత తిరిగిఇచ్చేవిధంగా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్‌తో) ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీ టెలికం మార్కెట్లో పోటీ మరింత తీవ్రతరం కావచ్చని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ స్పెక్ట్రం సంబంధిత వడ్డీ వ్యయాలు పెరిగిపోవడంతో క్యూ1లో నికర వడ్డీ వ్యయం రూ.1,631 కోట్ల నుంచి రూ.1,789 కోట్లకు ఎగసింది. ♦ ఇక భారత్ వ్యాపారం విషయానికొస్తే.. మొత్తం ఆదాయం 10 శాతం క్షీణించి రూ.17,244 కోట్లకు పడిపోయింది. ప్రధానంగా మొబైల్ సేవల విభాగంలో ప్రతికూల పనితీరు దీనికి దారితీసింది. ♦ మొత్తం కస్టమర్ల సంఖ్య 9.7 శాతం పెరుగుదలతో జూన్ చివరినాటికి 28 కోట్లకు చేరింది. ♦ ఒక్కో యూజర్ నుంచి సగటు నెలవారీ ఆదాయం(ఏఆర్పీయూ) 21 శాతం తగ్గుదలతో రూ.154కు పడిపోయింది. క్రితం ఏడాది క్యూ1లో ఏఆర్పీయూ రూ.196గా నమోదైంది. ♦ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సగటు నెలవారీ డేటా వినియోగం మూడురెట్లు ఎగబాకి 2,611 మెగాబైట్లకు(దాదాపు 2.5 జీబీ) చేరింది. క్రితం ఏడాది జూన్ క్వార్టర్లో ఇది 904 మెగాబైట్లు మాత్రమే. అయితే, డేటా సేవల నుంచి ఏఆర్పీయూ 22.7 శాతం పడిపోవడం గమనార్హం. ♦ కన్సాలిడేటెడ్ నిర్వహణ లాభం సీక్వెన్షియల్‌గా 2.1 శాతం క్షీణించి రూ.7,823 కోట్లుగా నమోదైంది. ♦ ఆఫ్రికా వ్యాపారం మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా(మార్చి క్వార్టర్‌తో పోలిస్తే) క్యూ1లో 3.8 శాతం తగ్గి... రూ.4,853 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం మాత్రం 4.2 శాతం వృద్ధితో రూ.1,362 కోట్లకు చేరింది. ♦ కంపెనీ మొత్తం రుణ భారం మార్చి క్వార్టర్‌తో పోలిస్తే (రూ.91,400 కోట్లు) జూన్ క్వార్టర్లో(సీక్వెన్షియల్‌గా) 3.9 శాతం తగ్గింది. రూ.87,840 కోట్లుగా నమోదైంది. ♦ ఇక కంపెనీ పెట్టుబడులు క్యూ1లో 73 శాతం వృద్ధితో రూ.6,586 కోట్లకు చేరాయి. ♦ బీఎస్ఈలో మంగళవారం ఎయిర్టెల్ షేర్ ధర 1.76 శాతం లాభంతో రూ.428 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. -
ఎయిర్టెల్ ‘మాన్సూన్ సర్ప్రైజ్’ ఆఫర్
వర్షాకాలాన్ని ఆనందంలో ముంచెత్తె ఆఫర్ మీ ముందుకు వచ్చేస్తోందంటూ ఎయిర్ టెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతకముందు ప్రకటించిన ''హాలిడే సర్ ప్రైజ్'' ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఎయిర్ టెల్ పేర్కొంది. దీన్ని ''మాన్ సూన్ సర్ ప్రైజ్'' ఆఫర్ గా కంపెనీ పేర్కొంది. శనివారం నుంచి తన కస్టమర్లందరికీ కంపెనీ ఈ-మెయిల్స్ ద్వారా ''మాన్ సూన్ సర్ ప్రైజ్'' ఆఫర్ వివరాలను అందిస్తోంది. తొలుత హాలిడే సర్ ప్రైజ్ ఆఫర్ ను ఎయిర్ టెల్ ఏప్రిల్ లో ప్రకటించింది. అది జూలై 1కు ముగుస్తుంది. కానీ ఈ ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికింద మరో మూడు నెలల పాటు 30జీబీ ఉచిత 4జీ డేటాను ఎయిర్ టెల్ తన పోస్టు-పెయిడ్ యూజర్లకు అందించనుంది. ప్రతినెలా 10జీబీ 4జీ డేటాను ఆఫర్ చేయనుంది. అయితే ఎంపికచేసిన యూజర్లకే ఎయిర్ టెల్ ఈ-మెయిల్స్ పంపిస్తుందని తెలుస్తోంది. 2017 జూలై 1 తర్వాత మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా దీన్ని క్లయిమ్ చేసుకోవాలని కంపెనీ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. మరో మూడు బిల్లింగ్ సైకిళ్లలో ఆ అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొన్నారు. డేటా సర్ ప్రైజ్ ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు మీతో షేర్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా ఫన్ మూమెంట్లను షేర్ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ టెల్ లో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారానే కొత్త యూజర్లు కూడా ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ పోస్టుపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇది వర్తించదు. దీనికింద ప్రతినెలా పొందే 10జీబీ 4జీ డేటాపై కంపెనీ ఆటోమేటిక్ గా ఓ మెసేజ్ పంపిస్తోంది. -
ఎయిర్టెల్ లాభం 72% డౌన్
♦ తీవ్ర స్థాయిలో రిలయన్స్ జియో ప్రభావం ♦ వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిన నికర లాభం ♦ 12 శాతం తగ్గిన మొత్తం ఆదాయం; రూ.21,935 కోట్లు ♦ ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్ జియో ప్రభావం తీవ్రంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఎయిర్టెల్ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.1,319 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లకు తగ్గిందని ఎయిర్టెల్ తెలిపింది. రిలయన్స్ జియో పోటీ తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.24,960 కోట్ల నుంచి 12 శాతం తగ్గి రూ.21,935 కోట్లకు చేరిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇక ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. జియో ఇన్కమింగ్ కాల్స్ సునామీ... కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిందని విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. తమ నెట్‌వర్క్‌లో ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్‌ను తట్టుకోవడానికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఆదాయం 7 శాతం తగ్గిందని, ఇబిటా మార్జిన్లు 2.9 శాతం మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉండేదని, గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.6 శాతం వృద్ధినే సాధించామని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.6,077 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 38 శాతం తగ్గి రూ.3,800 కోట్లకు చేరింది. ఆదాయం 1 శాతం వృద్ధితో రూ.95,468 కోట్లకు పెరిగింది. కాగా మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.7 శాతం క్షీణించి రూ.345 వద్ద ముగిసింది. జియోతో టెలికం వ్యవస్థ చిన్నాభిన్నం! ముకేష్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను ఆఫర్ చేసింది. మార్చిలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించిన జియో మరింత దూకుడుగా తన ఆఫర్లను అందిస్తోంది. రిలయన్స్ జియో దూకుడు కారణంగా టెలికం కంపెనీలే కాకుండా మొత్తం టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసిందని నిపుణులంటున్నారు. టెలికం పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా క్షీణించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు టెలికం పరిశ్రమ బకాయిలు రూ.4.60 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. ఫలితాలు కొన్ని ముఖ్యాంశాలు... ♦ ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలో మొత్తం ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 35.6 కోట్లుగా ఉంది. ♦ మొత్తం ఆదాయంలో 77 శాతం ఉండే భారత్ మార్కెట్లో ఈ కంపెనీకి 27.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ♦ నిర్వహణ లాభాన్ని సూచించే ఇబిటా 13 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.9,188 కోట్లుగా ఉన్న ఇబిటా గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7,993 కోట్లకు తగ్గింది. ♦ డేటా ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 17 శాతం క్షీణించి రూ.162కు, వాయిస్ ఏఆర్పీయూ కూడా 17 శాతం తగ్గి రూ.114కు చేరాయి. -
ఎయిర్టెల్ ఎం-కామర్స్ ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతి ఎయిర్టెల్ తాజాగా తన అనుబంధ కంపెనీ ‘ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ పేరును ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్’గా మార్పు చేసింది. అలాగే సంస్థ తన పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశముంది. ‘పేరు మార్పు పేమెంట్స్ బ్యాంక్ విభాగంపై మాకున్న ఆసక్తికి నిదర్శనం. కంపెనీకున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. మేము ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి దోహ దపడుతుంది’ అని భారతి ఎయిర్టెల్ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా ఆర్బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ లెసైన్స్ పొందిన (ఏప్రిల్ 11న) తొలి కంపెనీ భారతి ఎయిర్టెల్. -
ఎయిర్టెల్ లాభం రెట్టింపు
క్యూ3లో రూ.1,437 కోట్లు * మొబైల్ డేటా ఆదాయాల జోరు * 6 శాతం పెరిగి... రూ. 23,228 కోట్లకు చేరిన ఆదాయం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేటెడ్(అనుంబంధ సంస్థలతో కలిపి) నికర లాభం రెట్టింపునకుపైగా ఎగబాకి రూ.1,437 కోట్లుగా నమోదైంది. ముందటేడాది ఇదే కాలంలో రూ.610 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొబైల్ డేటా(ఇంటర్నెట్ ప్యాకేజీలు) ఆదాయాల్లో వృద్ధి కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, మొత్తం ఆదాయం క్యూ3లో రూ.23,228 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.21,960 కోట్లతో పోలిస్తే 5.8 శాతం పెరిగింది. కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటాం: ఎండీ కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకోవడంద్వారా ఆదాయాన్ని మరింత పరుగులు పెట్టించడం తమ లక్ష్యమని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (భారత్, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అదేవిధంగా స్థిరమైన టారిఫ్‌లు, మొబైల్ డేటా విభాగంలో వినూత్న ప్లాన్‌ను అందించడంపై అత్యధికంగా దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. గడచిన నాలుగేళ్లలో మూడో క్వార్టర్లో ఇంత భారీ ఆదాయం లభించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఇతర ముఖ్యాంశాలివీ... ⇒ ఎయిర్టెల్ భారత్ కార్యకలాపాల ఆదాయం క్యూ3లో 12.6 శాతం పెరిగి రూ.16,256 కోట్లుగా నమోదైంది. ⇒ మొబైల్ సేవల ఆదాయం 13 శాతం, టెలీ మీడియా ఆదాయం 13.2%, డిజిటల్ టీవీ(డీటీహె చ్) ఆదాయం 15.8% చొప్పున వృద్ధి చెందాయి. ⇒ మొబైల్ వాయిస్ కాల్స్ ద్వారా డిసెంబర్ క్వార్టర్లో ఒక్కో భారతీయ యూజర్ నుంచి నిమిషానికి సగటున(ఏఆర్పీయూ) 37.67 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. అంతక్రితం ఏడాది ఏఆర్‌పీయూతో పోలిస్తే 0.45 పైసలు పెరిగింది. ⇒ మొబైల్ డేటా ఆదాయం అత్యధికంగా 74.3 శాతం ఎగబాకి రూ.2,114 కోట్లకు చేరింది. భారత్‌లో ఒక్కో కస్టమర్ మొబైల్ ఇంటర్నెట్ వినియోగం క్యూ3లో 38.3 శాతం పెరిగింది. ఇక కన్సాలిడేటెడ్‌గా ఈ ఆదాయం క్యూ3లో 62 శాతం వృద్ధి చెంది రూ.2,872 కోట్లుగా నమోదైంది. ⇒ ఆఫ్రికాలోని అనుంబంధ సంస్థల నుంచి డిసెంబర్ క్వార్టర్లో నష్టాలు రూ.836 కోట్లకు పెరిగాయి. ఆదాయం 5.5 శాతం తగ్గుదలతో రూ.7,230 కోట్ల నుంచి రూ.6,828 కోట్లకు చేరింది. అయితే, అక్కడి స్థానిక కరెన్సీల ప్రకారం చూస్తే... ఆదాయం 3.9 శాతం వృద్ధి చెందిందని కంపెనీ వెల్లడించింది. ⇒ ఆఫ్రికాలో మొబైల్ డేటా ఆదాయాలు 116 మిలియన్ డాలర్లకు చేరాయి. 34.9 శాతం వృద్ధి నమోదైంది. ⇒ మొత్తంమీద... 20 దేశాల్లో టెలికం సేవలు అందిస్తున్న ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య డిసెంబర్ చివరినాటికి 31.29 కోట్లకు చేరింది. వీరిలో భారతీయ కస్టమర్లు 22 కోట్లు. మొబైల్ ఇంటర్నెట్ వాడకందార్ల సంఖ్య 4.2 కోట్లుగా ఉంది. ⇒ డిసెంబర్ ఆఖరికల్లా కంపెనీ నికర రుణ భారం రూ.66,839 కోట్లుగా నమోదైంది. భారతీ ఎయిర్టెల్ షేరు ధర బుధవారం 1 శాతం మేర క్షీణించి రూ.368 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
ఎయిర్టెల్ టారిఫ్‌లు పైపైకి..!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ల కోతను కొనసాగిస్తోంది. టారిఫ్‌లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. పెరుగుతున్న వ్యయా లను తట్టుకోవడానికి డిస్కౌంట్ ఆఫర్లను తగ్గిం చడం, టారిఫ్‌లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న తక్కువ టారిఫ్‌లను కొనసాగించడం సాధ్యం కాని పని అని వివరించారు. పెరుగుతున్న వ్యయాలే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని, నెట్వర్క్, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్, ఫైబర్ తదితర వ్యయాలు పెరిగిపోతున్నాయని వివరించారు. ఎయిర్టెల్ కంపెనీ కొన్ని స్కీమ్స్‌కు సంబంధించిన ఇం టర్నెట్, వాయిస్ కాల్స్ రేట్లను ఇటీవలనే పెంచిన విషయం తెలిసిందే. చివరకు 5-6 కంపెనీలే ఉంటాయ్ ప్రస్తుతం 10-12 మొబైల్ కంపెనీలు సేవలందిస్తున్నాయని, భవిష్యత్తులో కన్సాలిడేషన్ జరిగి చివరకు 5-6 మొబైల్ కంపెనీలే రంగంలో ఉంటాయని భారతీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఎఫ్ఓ సర్విజిత్ థిల్లాన్ వివరించారు.