ఎయిర్‌టెల్ ‘మాన్‌సూన్ సర్‌ప్రైజ్’ ఆఫర్
ఎయిర్‌టెల్ ‘మాన్‌సూన్ సర్‌ప్రైజ్’ ఆఫర్
Published Sat, Jun 24 2017 7:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
వర్షాకాలాన్ని ఆనందంలో ముంచెత్తె ఆఫర్ మీ ముందుకు వచ్చేస్తోందంటూ ఎయిర్ టెల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతకముందు ప్రకటించిన ''హాలిడే సర్ ప్రైజ్'' ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు ఎయిర్ టెల్ పేర్కొంది. దీన్ని ''మాన్ సూన్ సర్ ప్రైజ్'' ఆఫర్ గా కంపెనీ పేర్కొంది. శనివారం నుంచి తన కస్టమర్లందరికీ కంపెనీ ఈ-మెయిల్స్ ద్వారా ''మాన్ సూన్ సర్ ప్రైజ్'' ఆఫర్ వివరాలను అందిస్తోంది. తొలుత హాలిడే సర్ ప్రైజ్ ఆఫర్ ను ఎయిర్ టెల్ ఏప్రిల్ లో ప్రకటించింది. అది జూలై 1కు ముగుస్తుంది. కానీ ఈ ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికింద మరో మూడు నెలల పాటు 30జీబీ ఉచిత 4జీ డేటాను ఎయిర్ టెల్ తన పోస్టు-పెయిడ్ యూజర్లకు అందించనుంది. ప్రతినెలా 10జీబీ 4జీ డేటాను ఆఫర్ చేయనుంది. అయితే ఎంపికచేసిన యూజర్లకే ఎయిర్ టెల్ ఈ-మెయిల్స్ పంపిస్తుందని తెలుస్తోంది.
2017 జూలై 1 తర్వాత మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా దీన్ని క్లయిమ్ చేసుకోవాలని కంపెనీ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. మరో మూడు బిల్లింగ్ సైకిళ్లలో ఆ అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొన్నారు. డేటా సర్ ప్రైజ్ ఆఫర్ ను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు మీతో షేర్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా ఫన్ మూమెంట్లను షేర్ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ టెల్ లో భాగస్వామ్యులైనందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారానే కొత్త యూజర్లు కూడా ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ పోస్టుపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇది వర్తించదు. దీనికింద ప్రతినెలా పొందే 10జీబీ 4జీ డేటాపై కంపెనీ ఆటోమేటిక్ గా ఓ మెసేజ్ పంపిస్తోంది.
Advertisement
Advertisement