ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పైపైకి..! | Bharti Airtel to cut discounts, may raise tariffs to meet costs: Gopal Vittal | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పైపైకి..!

Published Thu, May 1 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పైపైకి..!

ఎయిర్‌టెల్ టారిఫ్‌లు పైపైకి..!

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ల కోతను కొనసాగిస్తోంది. టారిఫ్‌లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. పెరుగుతున్న వ్యయా లను తట్టుకోవడానికి డిస్కౌంట్ ఆఫర్లను తగ్గిం చడం,  టారిఫ్‌లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న తక్కువ టారిఫ్‌లను కొనసాగించడం సాధ్యం కాని పని అని వివరించారు.

 పెరుగుతున్న వ్యయాలే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని, నెట్‌వర్క్, నెట్‌వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్, ఫైబర్ తదితర వ్యయాలు పెరిగిపోతున్నాయని వివరించారు.  ఎయిర్‌టెల్ కంపెనీ  కొన్ని స్కీమ్స్‌కు సంబంధించిన ఇం టర్నెట్, వాయిస్ కాల్స్ రేట్లను ఇటీవలనే  పెంచిన విషయం తెలిసిందే.

 చివరకు 5-6 కంపెనీలే ఉంటాయ్
 ప్రస్తుతం 10-12 మొబైల్ కంపెనీలు సేవలందిస్తున్నాయని, భవిష్యత్తులో కన్సాలిడేషన్ జరిగి చివరకు 5-6 మొబైల్ కంపెనీలే రంగంలో ఉంటాయని భారతీ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ సీఎఫ్‌ఓ సర్విజిత్ థిల్లాన్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement