ఇంట్లో మీరేదో పనిలో ఉంటారు. డెలివరీ బోయ్ వచ్చి.. మీకేదో ఆర్డర్ వచ్చిం దంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదని సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయిందని’ ఆ మోసగాడు నమ్మబలుకుతాడు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చిం ది చెప్పండి చాలు అంటాడు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో ఇక అంతేసంగతులు. మీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం కొల్లగొట్టేస్తారు.
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాలను కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్‌ఎక్స్‌లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా.. తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఆన్‌లైన్‌లో వ్రస్తాలు, ఇతర గృహోపకరణాలు, ఎల ్రక్టానిక్ వస్తువుల డెలివరీ పేరిట మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగాయని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
అప్రమత్తతే రక్షా కవచం
మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తువులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి.
మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
ఓటీపీ చెప్పొద్దు.. ఇతర వివరాలూ ఇవ్వొద్దు
స్మార్ట్ ఫోన్లు వచి్చన తరువాత సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు, మరెవరైనా ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదు. ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలు కూడా చెప్పొద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురయ్యామని భావిస్తే వెంటనే ఏపీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దర్, ఎస్పీ (సైబర్ క్రైమ్)
సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు :
ఏపీ సైబర్ మిత్ర : 91212 11100 (వాట్సాప్ నంబర్)
టోల్ ఫ్రీ నంబర్లు: 100, 112
జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నంబర్: 1930
Comments
Please login to add a commentAdd a comment