సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎందరో అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. సాధారణ ప్రజలే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే ఇలా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చేయడం పోలీసులకు సాహసమనే చెప్పాలి. కానీ ముంబైలోని ఓషివారా పోలీసులు మాత్రం ఓ సైబర్ క్రైమ్‌ను చేధించి అతి త్వరగా ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అందించారు.
పలు టీవీ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాందిచుకుంది బుల్లితెర బ్యూటీ అమన్ సంధు (Aman Sandhu). ప్రస్తుతం గోరేగామ్‌లో నివసిస్తోన్న అమన్ తాజాగా సైబర్ నేరగాళ్ల (Cyber Crime) ట్రాప్‌లో పడింది. తన తల్లికి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసమని జుహుకి చెందిన ఆస్పత్రి వెబ్‌సైట్ కోసం జులై 6న నెట్‌లో వెతికింది. అప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్‌లో తన నెంబర్‌ను నమోదు చేసింది. ఆమె నెంబర్‌కు కాల్ చేసిన వ్యక్తి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని, అందుకోసం పంపిన వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయాలని సూచించాడు. ఆ లింక్‌పై నటి అమన్ సంధు క్లిక్ చేయగానే తన మూడు ఖాతాల నుంచు రూ. 2.24 లక్షలు డెబిట్ అయ్యాయి. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన అమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్.. తర్వాత మోడల్ ఆత్మహత్య
సత్వరమే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి ఎంతో చాకచక్యంగా ఆ డబ్బును రికవరీ చేశారు. అలాగే కాజేసిన అకౌంట్‌ను బ్లాక్ చేశామని తెలిపారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నటి అమన్ సంధు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఫిర్యాదుకు వెంటనే స్పందించిన ఓషివారా పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది. 'నా అనుభవంతో చెబుతున్న పోలీసులను మనం విశ్వసించాలి. కానీ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా కొంత ఓపికతో సంయమనం పాటించాలి. ఇలాంటి పరిస్థితిలో పోలీసులు మాత్రమే సహాయం చేయగలరు' అని ఇన్‌స్టా వేదికగా పేర్కొంది నటి అమన్ సంధు.
చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్..
పెళ్లికి రెడీ అయిన బుల్లితెర బ్యూటీ!.. అతనెవరంటే ?
Comments
Please login to add a commentAdd a comment