
బుల్లితెర నటి రూపాలీ గంగూలీ.. తమను రాచిరంపాన పెట్టిందని ఆరోపించింది ఆమె సవతి కూతురు ఈషా. తండ్రిని తమకు కాకుండా చేయడమే కాకుండా తల్లిని, తమను మానసిక క్షోభకు గురి చేసిందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇలా బాహాటంగా తనపై విమర్శలు చేసినందుకుగానూ రూపాలీ రూ.50 కోట్ల పరువునష్టం దావా వేసింది. అది తనను మరింత బాధించిందంటోంది ఈషా.
నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్
ఈ మేరకు సుదీర్ఘ పోస్టుల్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ నెల ప్రారంభంలో నా వ్యక్తిగత స్టోరీని మీతో పంచుకున్నాను. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కానీ ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్.. ఎందుకంటే ఏళ్లుగా నాలో గూడుకట్టుకున్న బాధను మీతో పంచుకున్నాకే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరికింది. స్వేచ్ఛ లభించినట్లయింది.

నటి రూపాలీ గంగూలీ, సవతి కూతురు ఈషా
నా అనుభవాన్ని చెప్పా
ఎవరికో ఇబ్బంది తలపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. ఈ అనుభవాలు నన్నెలా మార్చాయన్నదే చెప్పాలనుకున్నాను. నిజాయితీగా ఉన్నదున్నట్లు మాట్లాడాను. 2013 ఫిబ్రవరిలో రూపాలీ.. మా నాన్నను పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో కొడుకును కన్నది. అప్పుడు మీడియా వీళ్ల గురించి కథలు కథలుగా రాసింది కానీ నేనెక్కడా మాట్లాడలేదే. ఇప్పుడు నేను కేవలం నా అనుభవాన్ని చెప్పాను.
నిజం మాట్లాడితే శిక్షిస్తారా?
అయినా నిజం మాట్లాడితే శిక్షిస్తారా? వాళ్ల రియాక్షన్ చూసి ఎంతో బాధపడ్డాను. మీ ప్రవర్తనతో మరోసారి మీ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. నా ఫ్యామిలీ వివాదం గురించి ఇకపై మాట్లాడాను. ఏ ఇంటర్వ్యూలోనూ పాల్గొనను. ఇక నా జీవితం గురించే నేను ఆలోచిస్తాను అని ఈషా రాసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment