హీరోయిన్లతో ఎఫైర్స్‌.. నాకు ముందే తెలుసు: హీరో భార్య | Zarina Wahab: Aditya Pancholi Good Husband, Great Father | Sakshi
Sakshi News home page

అతడి మాజీ ప్రియులు అన్నట్లుగా నా భర్త కిరాతకుడు కాదు: జరీనా

Nov 27 2024 6:43 PM | Updated on Nov 27 2024 7:26 PM

Zarina Wahab: Aditya Pancholi Good Husband, Great Father

తొలిచూపులోనే ప్రేమ.. పరిచయమైన పదిహేను రోజుల్లోనే పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే ఉంటాయనుకునేరు. బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ జరీనా వాహబ్‌ జీవితంలోనూ ఇదే జరిగింది. మతాలు వేరైనా మనసులు కలవడంతో జరీనా, హీరో ఆదిత్య పంచోలి పెళ్లి చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు.

36 ఏళ్ల దాంపత్యం 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఓ సినిమా చేస్తున్న సమయంలో నిర్మల్‌ (ఆదిత్య పంచోలి అసలు పేరు)ను కలిశాను. అతడు నాకంటే చిన్నవాడు. మీరు నమ్ముతారో, లేదో గానీ మేము కలుసుకున్న 15-20 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకంటే ఎక్కువ కలిసుండలేరని విమర్శించారు. ఇప్పుడేమైంది? 36 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం. 

మా ఆయన ఉత్తమ భర్త
అయితే అతడు ఎవరితోనైనా ఎఫైర్స్‌ పెట్టుకునే ఛాన్స్‌ ఉందని నేను ముందుగానే ఊహించాను. ఇంటికి వచ్చాక నాతో ఎలా ఉంటున్నాడనేది మాత్రమే పట్టించుకున్నానే తప్ప తన ఎఫైర్స్‌ గురించి ప్రశ్నించేదాన్ని కాదు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అన్నట్లుగా అతడేమీ కిరాతకుడైతే కాదు. ఎన్నడూ నాపై చేయెత్తలేదు. బహుశా వాళ్లు కోరుకుంది దక్కలేదని అతడిపై నిందలు వేశారంతే! ఆదిత్య ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! అని చెప్పుకొచ్చింది.

ఆదిత్యపై హీరోయిన్ల ఫిర్యాదు
కాగా ఆదిత్య పంచోలి కంటే జరీనా వయసులో ఆరేళ్లు పెద్దది కావడం గమనార్హం. వీళ్ల వివాహం 1986లో జరిగింది. తర్వాత ఇతడు హీరోయిన్లతో ఎఫైర్స్‌ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 1993లో పూజా బేడీ.. ఆదిత్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2004లో కంగనా రనౌత్‌.. ఆదిత్య తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. అత్యాచారం చేశాడంటూ 2019లో పోలీస్‌ కేస్‌ కూడా పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement