Aditya Pancholi
-
హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య
తొలిచూపులోనే ప్రేమ.. పరిచయమైన పదిహేను రోజుల్లోనే పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే ఉంటాయనుకునేరు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వాహబ్ జీవితంలోనూ ఇదే జరిగింది. మతాలు వేరైనా మనసులు కలవడంతో జరీనా, హీరో ఆదిత్య పంచోలి పెళ్లి చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు.36 ఏళ్ల దాంపత్యం తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఓ సినిమా చేస్తున్న సమయంలో నిర్మల్ (ఆదిత్య పంచోలి అసలు పేరు)ను కలిశాను. అతడు నాకంటే చిన్నవాడు. మీరు నమ్ముతారో, లేదో గానీ మేము కలుసుకున్న 15-20 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకంటే ఎక్కువ కలిసుండలేరని విమర్శించారు. ఇప్పుడేమైంది? 36 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం. మా ఆయన ఉత్తమ భర్తఅయితే అతడు ఎవరితోనైనా ఎఫైర్స్ పెట్టుకునే ఛాన్స్ ఉందని నేను ముందుగానే ఊహించాను. ఇంటికి వచ్చాక నాతో ఎలా ఉంటున్నాడనేది మాత్రమే పట్టించుకున్నానే తప్ప తన ఎఫైర్స్ గురించి ప్రశ్నించేదాన్ని కాదు. అతడి మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ అన్నట్లుగా అతడేమీ కిరాతకుడైతే కాదు. ఎన్నడూ నాపై చేయెత్తలేదు. బహుశా వాళ్లు కోరుకుంది దక్కలేదని అతడిపై నిందలు వేశారంతే! ఆదిత్య ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! అని చెప్పుకొచ్చింది.ఆదిత్యపై హీరోయిన్ల ఫిర్యాదుకాగా ఆదిత్య పంచోలి కంటే జరీనా వయసులో ఆరేళ్లు పెద్దది కావడం గమనార్హం. వీళ్ల వివాహం 1986లో జరిగింది. తర్వాత ఇతడు హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 1993లో పూజా బేడీ.. ఆదిత్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2004లో కంగనా రనౌత్.. ఆదిత్య తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. అత్యాచారం చేశాడంటూ 2019లో పోలీస్ కేస్ కూడా పెట్టింది.చదవండి: బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్ -
సీనియర్ నటుడి వికృత పర్వం
ముంబై: సీనియర్ నటుడు ఆదిత్య పంచోలిపై ఫిర్యాదు చేసిన బాలీవుడ్ నటి దిగ్బ్రాంతికర విషయాలు వెల్లడించారు. పంచోలి తనపై సాగించిన దారుణాలను వెర్సోవా పోలీసులకు ఇచ్చిన రెండున్నర పేజీల వాంగ్మూలంలో వివరించారు. అతడి ఆగడాలపై 2004-06లో సీనియర్ ఐపీఎస్ అధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తన సోదరిని కూడా చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తెలిపారు. ‘బాలీవుడ్లో రాణించాలన్న ఆశతో ముంబైలో అడుగుపెట్టిన నాకు ఆ ఏడాది ఆదిత్య పంచోలి పరిచయమయ్యాడు. అప్పటికి అతడికి వయసు 38 ఏళ్లు. నా కంటే 22 ఏళ్లు పెద్దవాడు. అతడికి పెళ్లైపోయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతడి కూతురిది నా వయసే. 2004లో ఓరోజు అతడితో కలిసి పార్టీకి వెళ్లాను. పార్టీలో డ్రింక్ తాగిన తర్వాత మత్తుగా అనిపించింది. అందులో ఏదో కలిపారన్న అనుమానం కలిగింది. పార్టీ ముగిసిన తర్వాత నన్ను హాస్టల్ దగ్గర దిగబెడతానని అడగడంతో అతడి రేంజ్ రోవర్ కారులో ఎక్కాను. కొంత దూరం వెళ్లాక యారీ ప్రాంతంలో కారు ఆపేసి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దురాగతాన్ని ఫొటోలు తీసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనకు భార్యలా ఉండాలని ఒత్తిడి చేసేవాడు. నువ్వు నాకు తండ్రిలాంటి వాడివని, నా వయసుకు తగినవాడిని పెళ్లి చేసుకుంటానని బతిమాలినా కరగలేదు. ఫొటోలు బయటపెడతానని భయపెట్టేవాడు. అప్పుడు నేను చిన్నదాన్ని. ముంబైలో నాకంటూ ఎవరూ లేకపోవడంతో అతడు మరింత రెచ్చిపోయాడు. పంచోలి వేధింపులు భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఆటోను మధ్యలో ఆపేసి విచక్షణారహితంగా కొట్టాడు. బిపిన్ బిహారి అనే సీనియర్ పోలీసు అధికారిని కలిసి నా గోడు చెప్పుకున్నాను. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు 2004-05లో మా ఆంటీతో కలిసి పల్లవి అపార్ట్‌మెంట్‌కు మారిపోయాను. తన స్నేహితులతో కలిసి అక్కడికీ వచ్చి రభస చేశాడు. ప్రతిసారి తనతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చేవాడు. బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. 2006-07లో వెర్సోవాలో అపార్ట్మెంట్ కొనుక్కుని ఒంటరి జీవితం గడుపుతుండగా అక్కడికీ వచ్చాడు. పీకలదాకా తాగి నకిలీ తాళంతో నా ఇంట్లోకి చొరబడి వస్తువులన్నింటిని ధ్వంసం చేసి నన్ను చిత్రహింసలు పెట్టేవాడు. అతడి పెట్టే బాధలు తట్టుకోలేక 2008-09లో బాంద్రాకు మారిపోయాను. అక్కడికీ ప్రతక్షమయ్యాడు. ఆరోగ్యం బాలేక నా దగ్గర ఉండేందుకు వచ్చిన మా సోదరిపై చేయి చేసుకున్నాడు. ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావని ఫోన్ చేసి అడిగితే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ. 50 లక్షలు ఇవ్వడంతో కొద్దిరోజుల పాటు శాంతించాడు. నాకు అవకాశాలు పెరిగి గుర్తింపు రావడంతో మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టాడు. తనదగ్గరున్న ఫొటోలు మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు పంపుతానని బెదిరింపులకు దిగాడ’ని బాధితురాలు వివరించారు. బాధితురాలి సోదరి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో గత నెలలో ఆదిత్య పంచోలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందుస్తు బెయిల్ కోసం కోర్టును అతడు ఆశ్రయించగా జూలై 19 వరకు అరెస్ట్ చేయకుండా న్యాయస్థానం ఆదేశాల్చింది. ప్రతి బుధ, శనివారాల్లో వెర్సోవా పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. కాగా, తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తాను ఏ తప్పు చేయలేదని ఆదిత్య పంచోలి చెప్పారు. -
అలా మాట్లాడటం తప్పు
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రూటే సపరేటు. ఏ విషయాన్ని అయినా ఆమె ధైర్యంగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంటారు. ఒక్కోసారి ఆమె మాటలు వివాదంతో పాటు చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా.. ‘పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలీ మానసికంగా, లైంగికంగా నన్ను వేధించాడు’ అంటూ కంగన రనౌత్ గతంలో షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి, ఆదిత్య పంచోలీ భార్య జరీనా వాహబ్ స్పందించారు. ‘‘నా భర్త గురించి నాకు బాగా తెలుసు. నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏ తప్పూ చేయలేదు. ఏ విషయమైనా నా వద్ద రహస్యంగా ఉంచేవారు కాదు. గతంలో ఆదిత్య, కంగన మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. అయినా వివాహం అయిన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్ చేసి, తీరా విడిపోయిన తర్వాత అత్యాచారం చేశాడని ఆరోపిస్తే ఎలా? అది చాలా తప్పు’’ అంటూ మండిపడ్డారు. కాగా కంగన వ్యాఖ్యలపై ఆదిత్య పంచోలీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
బిల్లు చెల్లించలేదని నటుడిపై కేసు
ముంబై : బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ నేరం నమోదయ్యింది. వివరాలు.. ఆదిత్య పంచోలి సర్విసింగ్ నిమిత్తం తన కార్‌ను 2017 మార్చ్‌లో ఓ మెకానిక్‌కి అప్పచెప్పాడు. సదరు మెకానిక్ సర్విసింగ్, రిపేర్ చేశాడు. ఇందుకు గాను రూ. 2.82 లక్షల బిల్లు అయ్యిందని.. ఆ డబ్బును చెల్లించాల్సిందిగా ఆదిత్యను కోరాడు. కానీ ఆదిత్య బిల్లు కట్టకుండా సదరు మెకానిక్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. బిల్లు కట్టమని అడిగిన ప్రతిసారి ఆదిత్య, మెకానిక్‌ను తిట్టడమే కాక వ్యక్తిగత బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. కార్ సర్విసింగ్ చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. నేటికి కూడా ఆదిత్య బిల్లు చెల్లించకపోవడంతో విసిగిపోయిన మెకానిక్ చివరకూ ముంబై వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఆదిత్య మీద ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ‘మెకానిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిత్య పంచోలి మీద నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతుంద’ని తెలిపారు. అయితే ఏ వ్యక్తి మీద అయిన నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ కేసు నమోదు అయితే వారెంట్ లేకుండా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. -
హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల హృతిక్ తో తన రిలేషన్ కు సంబంధించి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ భామ, సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా విమర్శలపై స్పందించిన నటుడు నిర్మాత ఆదిత్య పంచోలీ ఆమె మీద చట్టపరమైన చర్యలకు రెడీ అవుతున్నట్టుగా తెలిపారు. 'ఆమె పిచ్చిది, ఆమె ఇంటర్య్వూ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. నేను చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఉంటున్నాను. ఇంత వరకు మాపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. ఇతరుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నాకు అనవసరం. నాపై మా కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు మమల్ని తీవ్రంగా బాధించాయి. మాపై వేసిన నిందలు నిరూపించమనండి, లేదంటే ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అన్నారు ఆదిత్య పంచోలీ. -
‘ఆ నటి పిచ్చిది.. లీగల్ చర్యలు తీసుకుంటా’
ముంబై: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి కంగనా రనౌత్ వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ’సిమ్రన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్, అధ్యయన్ సుమన్లపై విరుచుకుపడింది. నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆదిత్య పంచోలి తనను దాదాపు హౌస్ అరెస్టు చేసి వేధించాడని ఆమె తెలిపింది. ఆమె ఆరోపణలపై తాజాగా ఆదిత్య పంచోలి స్పందించాడు. కంగన ఒక పిచ్చి అమ్మాయి అని, తనను ఉద్దేశించి అబద్ధపు వ్యాఖ్యలు చేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పంచోలి హెచ్చరించాడు. ’తను ఒక పిచ్చి అమ్మాయి. ఆమె ఇంటర్వ్యూ చూశారా? ఆమె మాట్లాడుతుంటే పిచ్చిది మాట్లాడినట్టు అనిపించలేదు. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్నాను. కానీ ఒకరి గురించి ఇంత క్రూరంగా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదు. తన పిచ్చిది కాక ఏమంటాం. బురదలో రాళ్లు విసిరితే మన దుస్తులకే మరలంటుతాయి’ అని పంచోలి మీడియాతో పేర్కొన్నాడు. ఇప్పటికే హృతిక్‌తో కంగన చట్టపరమైన పోరాటం కొనసాగుతుండగా.. తాజాగా ఆమెపై కేసు వేస్తానని పంచోలి కూడా హెచ్చరించడం గమనార్హం. -
సీనియర్ నటుడికి ఏడాది జైలుశిక్ష
ముంబై: పక్కింటి వ్యక్తిపై దాడి చేసిన కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీకి ముంబై కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. న్యాయస్థానం 12 వేల రూపాయల పూచీకత్తుపై పంచోలీకి బెయిల్ మంజూరు చేసింది. 2005లో పంచోలీ.. ప్రతీక్ పస్రానీ అనే పొరుగు వ్యక్తితో గొడవపడ్డాడు. పంచోలీ ఫ్లాట్‌కు వచ్చిన స్నేహితుడు.. ఈ బిల్డింగ్‌లో ప్రతీక్‌కు కేటాయించిన స్థలంలో వాహనాన్ని పార్క్ చేశాడు. ఇందుకు ప్రతీక్ అభ్యంతరం చెప్పడంతో పంచోలీ ఆయనపై దాడి చేశాడు. ప్రతీక్ ముక్కుకు ఫ్రాక్చర్ అయ్యింది. ప్రతీక్ ఫిర్యాదు మేరకు పోలీసులు పంచోలీపై కేసు నమోదు చేశారు. 11 ఏళ్ల తర్వాత కోర్టు పంచోలీని దోషీగా నిర్ధారిస్తూ శిక్ష విధించింది. -
చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్!
చేతబడి, క్షుద్రవిద్యలాంటి మూఢనమ్మకాలను మారుమూల గ్రామాల్లో చదువుకోని ప్రజలే కాదు.. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ సైతం నమ్ముతోందా? ఏకంగా ఇంట్లోనే చేతబడి లాంటి క్షుద్రవిద్యల్ని ఔపోసన పడుతోందా? అంటే తాజాగా అవునని అంటున్నాడు బాలీవుడ్ హీరో అధ్యాయన్ సుమన్. కంగన తన ఇంట్లోనే చేతబడిలాంటి క్షుద్రపూజలు చేసేదని అతను తాజాగా వెల్లడించాడు. క్షుద్రపూజల కోసం ఆమె తన అపార్ట్మెంట్లో ఓ గది కూడా ఉందని చెప్పాడు. కంగనా రనౌత్‌కు ఈ మధ్య కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా ఆ మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ సంచలన విషయాలు వెల్లడించాడు. 2008లో 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమా సందర్భంగా సుమన్, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని వివరించాడు. 'ఓరోజు రాత్రి కొన్ని పూజలు చేసేందుకు కంగన తన ఇంటికి పిలిచింది. రాత్రి 11.30 గంటలకు నేను వెళ్లాను. అర్ధరాత్రి 12 గంటలకు పూజ ప్రారంభమైంది. తన అపార్ట్మెంట్లో ఆమెకు ఒక చిన్న గెస్ట్ రూమ్ ఉంది. ఆ గది పూర్తిగా నల్లరంగుతో ఉంటుంది. కర్టెన్లు కూడా నల్లరంగులోనే ఉంటాయి. అక్కడ కొన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వాటిచుట్టూ మంటలు ఎగుస్తున్నాయి. పూజలో కొన్ని భయంకరమైనవి చేసింది. నేను చాలా భయపడిపోయాను. నేనేమీ చేయలేకపోయాను. వెంటనే బయటకు వచ్చి చేసిన పూజ చాలు అని చెప్పాను. దాంతో తను పల్లవితో మాట్లాడటం ప్రారంభించింది. పల్లవి ఓ రోజు రాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లాల్సిందిగా నన్ను కోరింది. నేను వణికిపోయాను. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్లలేదు' అని సుమన్ వివరించాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి ఎంతో ఆందోళన చెందారని, కుటుంబ పూజారిని పిలిచి, ఆయనకు ఈ విషయం చెప్పారని సుమన్ చెప్పుకొచ్చాడు. 'నీ కోసం ఆమె అన్నం వండుతుందా? అని పూజారి అడిగాడు. అవును అని చెప్పాను. ఆ అన్నంలో ఆమె తన మలినమైన రక్తం కలిపి క్షుద్రపూజల కోసం వండేదని పూజారి చెప్పాడు. లండన్, న్యూయార్క్లాంటి దేశాల్లో చదివి, మెట్రోపాలిటన్ కిడ్ అయిన తాను ఇవన్ని విశ్వసించలేదు. కానీ రాశిఫలాలు చూసే ఓ మహిళ నీపై చేతబడి జరిగిందని, పహడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ చేతబడి చేస్తున్నదని తెలిపింది. వెంటనే ఆ అనుబంధం నుంచి బయటపడాలని సూచించింది. అప్పట్లో నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్‌కు తరచూ వెళ్లే వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ కంగనానే. అప్పటినుంచి తనతో అనుబంధం నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించాను. ఆ క్రమంలో ఎంతో మానసిక, శరీరక క్షోభ అనుభవించాను' అంటూ సమన్ డీఎన్ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 'రాజ్ 2' సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా పతనమవ్వగా, అదే సమయంలో కంగన సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయని, వాటి గురించి మాట్లాడలంటేనే తనకు భయం అవుతున్నదని అతను చెప్పుకొచ్చాడు. -
'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని'
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆదిత్య పచోలికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంటి యజమానిని ఎందుకు వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31లో ఆయన అద్దెకు ఉంటున్న భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగిచాలని స్పష్టం చేసింది. దీంతోపాటు ఇప్పటి వరకు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆ మహిళా యజమానురాలికి చెల్లించాలని ఆదేశించింది. ఒక ఇళ్లు కొనుగోలు చేసుకోగలిగే స్థోమత ఉండి కూడా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదని, ఆయనది అంగీకరించకూడని ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు చాలా పెద్ద మనిషి. ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేయగలరు. మీ పద్దతి ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పరువునష్టం కేసులో జియా ఖాన్ తల్లికి నోటీసులు
ముంబై: నటుడు ఆదిత్య పంచోలీ దంపతులు దాఖలు చేసిన పరువునష్టం కేసుపై పది రోజుల్లోగా స్పందించాలని బాంబే హైకోర్టు ఆత్మహత్యకు పాల్పడిన నటి జియాఖాన్ తల్లి రజియా ఖాన్‌కు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆదిత్య కొడుకు, జియా ప్రియుడు సూరజ్ ఆమె ఆత్మహత్యకు కారకుడని పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం తెలిసిందే. రబియా తమను అవమానించేలా ట్విటర్లో వ్యాఖ్యలు పోస్టు చేసిందని పేర్కొంటూ ఆదిత్య దంపతులు దాఖలు చేసిన ఈ కేసుపై ఈ నెల 16న తదుపరి విచారణ జరగనుంది. జియా ఆత్మహత్య కేసు దర్యాప్తును హైకోర్టు ఇటీవలే సీబీఐకి బదిలీ చేయడం తెలిసిందే. గత ఏడాది జూన్ మూడున జియా జుహూలోని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనికిముందు సూరజ్‌తో ఆమె కొన్నాళ్లపాటు సహజీవనం చేసి విడిపోయింది. -
సీబీఐ చేతికి జియా ఖాన్ మృతి కేసు!
ముంబై: బాలీవుడ్ తార జియా ఖాన్ మృతి కేసును సీబీఐకి బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. ముంబైలోని తన నివాసంలో ఏడాది క్రితం జియా ఖాన్ అనుమానస్పద పరిస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. జియా కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియా ఖాన్ 2013 జూన్ 3 తేదిన జుహూలోని తన నివాసంలో మరణించారు. జియా నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్ పంచోలిని అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్ పై జియా రాసింది కాదని ఆమె తల్లి ఆరోపించారు. జియా ఖాన్ ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
'జియాఖాన్ ను సూరజ్ హత్య చేయలేదు'
బాలీవుడ్ తార జియా ఖాన్ ను తన కుమారుడు హత్య చేయలేదు. జియా మరణించిన సమయంలో సూరజ్ పంచోలి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాడని ఆదిత్య పంచోలి తెలిపారు. తన కుమారుడు సూరజ్ పై వచ్చిన హత్యా ఆరోపణలకు ముగింపు ఇవ్వాలని ఆదిత్య తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. జియాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే హత్య చేశారు అని తల్లి రుబియా ఆరోపణల నేపథ్యంలో ఆదిత్య పంచోలి వివరణ ఇచ్చారు. హోటల్ లో ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. తన స్నేహితుడుతో సూరజ్ హోటల్ లోపలికి వెళుతున్న సీసీ టీవీ ఫుటేజ్ ఉంది అన్నారు. ఈ ఆధారాలతో తన కుమారుడు సూరజ్ హత్య చేయలేదని స్పష్టమవుతోంది అని అన్నారు. జియా మరణించిన సమయంలో పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే జియా హత్యకు గురైంది అని తాజాగా కలినా ఫోరెన్సిక్ లాబోరేటరి వెల్లడించడంతో కేసు మళ్లీ వార్తలోకి ఎక్కింది. తన కుమారుడు 21 రోజులపాటు ఆర్ధర్ రోడ్ జైలులో గడిపిన తర్వాత సూరజ్ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తన పలుకుబడి ఉపయోగించి సూరజ్ కు బెయిల్ ఇప్పించారని ఆరోపించడం ఎంత వరకు సబబు. ఒకవేళ తనకు పలుకుబడి ఉంటే తన కుమారుడిని జైలులో ఎందుకు పెట్టిస్తాను అని అన్నారు.