'జియాఖాన్ ను సూరజ్ హత్య చేయలేదు'
'జియాఖాన్ ను సూరజ్ హత్య చేయలేదు'
Published Wed, Nov 13 2013 5:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
బాలీవుడ్ తార జియా ఖాన్ ను తన కుమారుడు హత్య చేయలేదు. జియా మరణించిన సమయంలో సూరజ్ పంచోలి ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నాడని ఆదిత్య పంచోలి తెలిపారు. తన కుమారుడు సూరజ్ పై వచ్చిన హత్యా ఆరోపణలకు ముగింపు ఇవ్వాలని ఆదిత్య తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది. జియాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే హత్య చేశారు అని తల్లి రుబియా ఆరోపణల నేపథ్యంలో ఆదిత్య పంచోలి వివరణ ఇచ్చారు.
హోటల్ లో ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. తన స్నేహితుడుతో సూరజ్ హోటల్ లోపలికి వెళుతున్న సీసీ టీవీ ఫుటేజ్ ఉంది అన్నారు. ఈ ఆధారాలతో తన కుమారుడు సూరజ్ హత్య చేయలేదని స్పష్టమవుతోంది అని అన్నారు.
జియా మరణించిన సమయంలో పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే జియా హత్యకు గురైంది అని తాజాగా కలినా ఫోరెన్సిక్ లాబోరేటరి వెల్లడించడంతో కేసు మళ్లీ వార్తలోకి ఎక్కింది.
తన కుమారుడు 21 రోజులపాటు ఆర్ధర్ రోడ్ జైలులో గడిపిన తర్వాత సూరజ్ పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించాడు. తన పలుకుబడి ఉపయోగించి సూరజ్ కు బెయిల్ ఇప్పించారని ఆరోపించడం ఎంత వరకు సబబు. ఒకవేళ తనకు పలుకుబడి ఉంటే తన కుమారుడిని జైలులో ఎందుకు పెట్టిస్తాను అని అన్నారు.
Advertisement
Advertisement