బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలి నిర్దోషిగా తేలాడు. సూరజ్ వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో పదేళ్ల కిందట (2013 జూన్ 3న) జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు పేజీల లేఖలో ఏముందంటే..
కళ్ల ముందు అంతా చీకటి
'ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకం నుంచే నిష్క్రమించి ఉంటాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ చివరికి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ప్రతిరోజూ హింసించావు. నా మనసు ముక్కలయింది. ఈ మధ్య నాకు కళ్ల ముందు వెలుతురు కనిపించడం లేదు, శాశ్వతంగా చీకటి ఒడిలో నిద్రపోవాలనుంది. ఒకప్పుడు నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను, కలలు కన్నాను. కానీ నువ్వు నా కలలను చిన్నాభిన్నం చేశావు. నన్ను మానసికంగా చంపేశావు.
అత్యాచారం, టార్చర్..
నేను నీపై చూపినంత కేరింగ్ మరెవరిపైనా చూపించలేదు. కానీ నువ్వు ప్రేమించడానికి బదులు మోసం చేశావు, అబద్దాలు ఆడుతూ నమ్మకద్రోహం చేశావు. ఎక్కడ గర్భం దాల్చుతానో అని భయపడినప్పటికీ నన్ను నేను నీకు సమస్తం అర్పించుకున్నాను. అందుకు ఫలితంగా నన్ను బాధపెడుతూ చిత్రవధ చేశావు. కడుపు నిండా తినలేకపోతున్నా. కంటినిండా నిద్రపోవడం లేదు. కనీసం ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అన్నింటికీ దూరమయ్యాను. నా కెరీర్‌కు కూడా విలువ లేకుండా పోయింది. విధి మనిద్దరినీ ఎందుకు కలిపిందో అర్థం కావడం లేదు. నన్ను అత్యాచారం చేశావు, అసభ్యంగా మాట్లాడావు, ముఖంపై తంతూ శారీరకంగా దాడి చేశావు, టార్చర్ పెట్టావు.. ఇదంతా నాకే ఎందుకు జరగాలి?
భయంగా ఉంది
నీ నుంచి నాకు ఎటువంటి ప్రేమ కనబడలేదు. కానీ నువ్వు నన్ను శారీరకంగా, మానసికంగా మరింత గాయపరుస్తావేమోనని భయమేస్తోంది. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం. కానీ నేను నువ్వే ప్రపంచమనుకున్నాను. ఇంత జరిగినా ఇప్పటికీ నువ్వు కావాలనే అనిపిస్తుంది, కానీ నువ్వు మారవు. అందుకే నా కెరీర్‌కు, కలలకు గుడ్‌బై చెప్తున్నాను. నీకు ఇంతవరకు ఒక విషయం చెప్పలేదు. అదేంటంటే.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకొక మెసేజ్ వచ్చింది. నీ మీదున్న నమ్మకంతో దాన్నసలు పట్టించుకోలేదు. కానీ చివరికి అదే నిజమైంది. నీలాగా నేను ఎన్నడూ వేరొకరితో తిరగలేదు.
ఎందుకు బతకాలి
నిన్ను నేను ప్రేమించినంతగా మరే అమ్మాయి కూడా ప్రేమించలేదు. ఇది నా రక్తంతో రాసిస్తా. నీకోసం ఎంతో చేశా. కానీ నువ్వు నా పార్ట్‌నర్‌గా ఉండలేదు. అబార్షన్ మాత్రం నన్ను ఎంతగానో కుంగదీసింది. నాకు సంతోషాన్ని దూరం చేశావు, నమ్మకద్రోహం చేశావు, జీవితాన్నే నాశనం చేశావు. బర్త్‌డే, వాలంటైన్స్‌డే.. ఇలా అన్నింటికి నాకు దూరంగా ఉన్నావు. నేను మాత్రం నీకోసం ఎదురుచూసి కుమిలి కుమిలి ఏడ్చాను. ఇంత జరిగాక నేను బతకడానికి ఏ కారణమూ లేదనిపిస్తోంది. నేనిప్పుడు ఒంటరిదాన్నయ్యాను. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను.. మెలకువ లేని నిద్ర కావాలి!' అని లేఖలో తన ఆవేదన వ్యక్తం చేసింది జియా ఖాన్.
NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఆల్‌రెడీ పెళ్లై, కొడుకున్న మహిళను పెళ్లాడిన బ్రహ్మాజీ.. పిల్లలు వద్దని
ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్ మృతి
Comments
Please login to add a commentAdd a comment