Jiah Khan suicide
-
జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లికి చెప్తే పట్టించుకోలేదు: నటుడు
బాలీవుడ్ నటి జియా ఖాన్.. చేసింది కొన్ని సినిమాలే అయినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిశ్శబ్ధ్ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమెకు జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ తను కోరుకుంది వేరు. స్వచ్ఛమైన ప్రేమ కోసం తాపత్రయ పడింది. అక్కున చేర్చుకునే తోడు కోసం తల్లడిల్లింది. కష్టాల్లో ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తి కోసం ఎదురు చూసింది. కన్నీరు కారిస్తే తుడిచే చేయి కోసం వెంపర్లాడింది. కానీ అవేమీ జరగలేదు. తను దిగులుగా, దీనంగా ఉన్న సమయంలో సూరజ్ పంచోలి ద్వారా జీవితంలో వెలుగు చూసింది. అయితే, ఆ వెలుగు దీర్ఘకాలం ఉండదని తెలుసుకోలేకపోయింది. అతడిని మనసారా ప్రేమించిన ఆమె బరువెక్కిన గుండెతో 2013లో ఆత్మహత్య చేసుకుంది. పంచోలిని తను ఎంతగా ప్రేమించిందో.. అదే సమయంలో అతడు ఎంతగా వేధించాడో ఆరు పేజీల ఆత్మహత్య లేఖలో రాసుకుంది జియా ఖాన్. అయితే నటి ఆత్మహత్యకు సూరజ్ ప్రేరేపించినట్లు బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు రెండు రోజుల క్రితమే అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సూరజ్.. జియా ఖాన్‌తో తన రిలేషన్‌షిప్‌పై స్పందించాడు. 'నేను జియాతో ఐదు నెలలు మాత్రమే రిలేషన్షిప్లో ఉన్నాను. తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో నాకు తెలియదు కానీ ఆమె ప్రేమ కోరుకుంది. అది ఒక్క ప్రియుడు నుంచి మాత్రమే కాదు తన కుటుంబం నుంచి కూడా ప్రేమను ఆశించింది. ఆమె కుటుంబం తనను అర్థం చేసుకోవాలని, అండగా నిలవాలని తాపత్రయపడింది. ఆమె కుటుంబంలో సంపాదించేది తను ఒక్కరే కాబట్టి ఫ్యామిలీని పోషించేందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో ఒత్తిడికి కూడా లోనైంది. జియా డిప్రెషన్లో ఉందని ఆమె తల్లి రబియా ఖాన్‌కు కూడా చెప్పాను. కానీ తను పట్టించుకోలేదు. అప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ఎవరికీ అంత అవగాహన లేదు కూడా! జియా, నేను ప్రేమించుకోవడానికి ముందు 2012లో సాధారణ స్నేహితుల్లానే ఉన్నాం. ఆ సమయంలో కూడా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తను చేయి కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను లండన్‌లో ఉన్న జియా తల్లి రబియాజీకి ఫోన్ చేసి చెప్పాను. ఆమె తర్వాతి ఫ్లైట్‌లో ముంబై వస్తానంది. కానీ నెలలు గడిచినా రానేలేదు. ఎక్కడైనా తల్లీకూతుళ్ల మధ్య ఇలాంటి ప్రేమే ఉంటుందా? తను ఇంటిసభ్యుల ప్రేమను కోరుకుంది' అని చెప్పుకొచ్చాడు సూరజ్ పంచోలి. చదవండి: నటి వనితా విజయ్ కుమార్ మాజీ మూడో భర్త కన్నుమూత పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలంటున్న సల్మాన్ ఖాన్ -
ప్రాణంగా ప్రేమిస్తే చిత్రవధ చేశావ్, వేరే అమ్మాయిలతో.. నటి సూసైడ్ నోట్
బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ఆమె ప్రియుడు, నటుడు సూరజ్ పంచోలి నిర్దోషిగా తేలాడు. సూరజ్ వల్లే జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో న్యాయస్థానం అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో పదేళ్ల కిందట (2013 జూన్ 3న) జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరు పేజీల లేఖలో ఏముందంటే.. కళ్ల ముందు అంతా చీకటి 'ఇప్పటికే నేను చాలా కోల్పోయాను. ఇంకా కోల్పోవడానికి ఏమీ మిగల్లేదు. నువ్వు ఈ లెటర్ చదివే సమయానికి నేను ఈ లోకం నుంచే నిష్క్రమించి ఉంటాను. నిన్ను ఎంతగానో ప్రేమించాను, కానీ చివరికి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ప్రతిరోజూ హింసించావు. నా మనసు ముక్కలయింది. ఈ మధ్య నాకు కళ్ల ముందు వెలుతురు కనిపించడం లేదు, శాశ్వతంగా చీకటి ఒడిలో నిద్రపోవాలనుంది. ఒకప్పుడు నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను, కలలు కన్నాను. కానీ నువ్వు నా కలలను చిన్నాభిన్నం చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. అత్యాచారం, టార్చర్.. నేను నీపై చూపినంత కేరింగ్ మరెవరిపైనా చూపించలేదు. కానీ నువ్వు ప్రేమించడానికి బదులు మోసం చేశావు, అబద్దాలు ఆడుతూ నమ్మకద్రోహం చేశావు. ఎక్కడ గర్భం దాల్చుతానో అని భయపడినప్పటికీ నన్ను నేను నీకు సమస్తం అర్పించుకున్నాను. అందుకు ఫలితంగా నన్ను బాధపెడుతూ చిత్రవధ చేశావు. కడుపు నిండా తినలేకపోతున్నా. కంటినిండా నిద్రపోవడం లేదు. కనీసం ఏదీ ఆలోచించలేకపోతున్నాను. ఇప్పుడు నేను అన్నింటికీ దూరమయ్యాను. నా కెరీర్‌కు కూడా విలువ లేకుండా పోయింది. విధి మనిద్దరినీ ఎందుకు కలిపిందో అర్థం కావడం లేదు. నన్ను అత్యాచారం చేశావు, అసభ్యంగా మాట్లాడావు, ముఖంపై తంతూ శారీరకంగా దాడి చేశావు, టార్చర్ పెట్టావు.. ఇదంతా నాకే ఎందుకు జరగాలి? భయంగా ఉంది నీ నుంచి నాకు ఎటువంటి ప్రేమ కనబడలేదు. కానీ నువ్వు నన్ను శారీరకంగా, మానసికంగా మరింత గాయపరుస్తావేమోనని భయమేస్తోంది. అమ్మాయిలతో జల్సా చేయడమే నీ జీవితం. కానీ నేను నువ్వే ప్రపంచమనుకున్నాను. ఇంత జరిగినా ఇప్పటికీ నువ్వు కావాలనే అనిపిస్తుంది, కానీ నువ్వు మారవు. అందుకే నా కెరీర్‌కు, కలలకు గుడ్‌బై చెప్తున్నాను. నీకు ఇంతవరకు ఒక విషయం చెప్పలేదు. అదేంటంటే.. నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకొక మెసేజ్ వచ్చింది. నీ మీదున్న నమ్మకంతో దాన్నసలు పట్టించుకోలేదు. కానీ చివరికి అదే నిజమైంది. నీలాగా నేను ఎన్నడూ వేరొకరితో తిరగలేదు. ఎందుకు బతకాలి నిన్ను నేను ప్రేమించినంతగా మరే అమ్మాయి కూడా ప్రేమించలేదు. ఇది నా రక్తంతో రాసిస్తా. నీకోసం ఎంతో చేశా. కానీ నువ్వు నా పార్ట్నర్గా ఉండలేదు. అబార్షన్ మాత్రం నన్ను ఎంతగానో కుంగదీసింది. నాకు సంతోషాన్ని దూరం చేశావు, నమ్మకద్రోహం చేశావు, జీవితాన్నే నాశనం చేశావు. బర్త్‌డే, వాలంటైన్స్‌డే.. ఇలా అన్నింటికి నాకు దూరంగా ఉన్నావు. నేను మాత్రం నీకోసం ఎదురుచూసి కుమిలి కుమిలి ఏడ్చాను. ఇంత జరిగాక నేను బతకడానికి ఏ కారణమూ లేదనిపిస్తోంది. నేనిప్పుడు ఒంటరిదాన్నయ్యాను. ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను.. మెలకువ లేని నిద్ర కావాలి!' అని లేఖలో తన ఆవేదన వ్యక్తం చేసింది జియా ఖాన్. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆల్రెడీ పెళ్లై, కొడుకున్న మహిళను పెళ్లాడిన బ్రహ్మాజీ.. పిల్లలు వద్దని ప్లాస్టిక్ సర్జరీ చేసిన కాసేపటికే మోడల్ మృతి -
హీరోయిన్ మృతికేసులో విచారణపై స్టే
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్ పంచోలికి వ్యతిరేకంగా జరుగుతున్న విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ బొంబాయి హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌కు వ్యతిరేకంగా జియాఖాన్ తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జియాఖాన్‌ది ఆత్మహత్యేనని, ఆమెది అనుమానాస్పద మరణం కాదని పేర్కొంటూ సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2013 జూన్ 3న జియాఖాన్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె ప్రియుడు సూరజ్ పంచోలి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్లో సీబీఐ సమర్పించిన అఫిడవిట్లో పలు లొసుగులు ఉన్నాయని, ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి.. హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని రబియాఖాన్ తన పిటిషన్లో కోరారు. వాదనలు విన్న జస్టిస్ ఆర్వీ మోర్, జస్టిస్ వీఎల్ అచిలియా ధర్మాసనం కేసు విచారణపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లోగా రబియాఖాన్ పిటిషన్‌పై తన అఫిడవిట్ సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. జియాఖాన్ అమెరికా పౌరురాలు అయినందున ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌డీఐ కూడా సిట్‌కు సహకరించేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. -
జియాఖాన్ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు!
ముంబై: బాలీవుడ్ కథానాయిక జియాఖాన్ మృతికేసులో సీబీఐ తాజాగా దాఖలుచేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. జియాఖాన్ గర్భం దాల్చిందని తెలియడం.. ఆమె అబార్షన్‌కు సూరజ్ పంచోలి సహకరించడం, ఈ తర్వాత జరిగిన విపరీత పరిణామాలతో మానసికంగా ఛిన్నాభిన్నమైన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. జియాఖాన్ మృతి వెనుక పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లి రబియా ఖాన్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఈ కేసును సీబీఐ స్పెషల్ క్రైమ్ డివిజన్‌కు అప్పగించింది. జియాఖాన్‌ది ఆత్మహత్యనా లేక హత్య నా తేల్చాలని ఆదేశించింది. అయితే ఈ కేసులో హత్యాభియోగాలను సీబీఐ చార్జ్‌షీట్‌లో మోపలేదు. కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించింది సూరజ్ పంచోలియేనంటూ బలమైన కేసు రూపొందించేదిశగా చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు కనిపిస్తున్నది. బుధవారం సెషన్ కోర్టుకు సమర్పించిన సీబీఐ చార్జ్‌షీట్ ప్రకారం.. తాను గర్భం దాల్చిన నాలుగువారాలకు ఈ విషయాన్ని జియా పంచోలికి తెలిపింది. దీంతో వారు ఓ డాక్టర్‌ను కలిశారు. ఆయన గర్భస్రావం కావడానికి కొన్ని ఔషధాలు రాసిచ్చారు. అవి పనిచేయకపోవడంతో వారు మళ్లీ ఓ గైనకాలజిస్ట్‌ను కలిశారు. దీంతో మరింత బలమైన మందులను ఆయన ఇచ్చారు. 'ఆ మందులు తీసుకున్న తర్వాత జియాఖాన్‌కు రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె పంచోలీ సాయాన్ని కోరింది. తీవ్రమైన బాధతో విలవిలలాడుతున్న ఆమె వైద్య సాయాన్ని కోరగా.. పంచోలీ మాత్రం తాను గైనకాలజిస్ట్‌ను సంప్రదించి గైడెన్స్ తీసుకొనేవరకు వేచిచూడమని ఆమెకు సలహా ఇచ్చాడు. జియాఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని, గర్భస్రావం అయినా పిండం శరీరంలోనే ఉండటం వల్ల రక్తస్రావం జరిగి ఉండవచ్చునని డాక్టర్ పంచోలీకి సూచించాడు. కానీ పంచోలీ భయపడ్డాడు. జియాఖాన్ ఆస్పత్రిలో చేరితే.. తమ అనుబంధం గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుందని, దీంతో తాను సినిమాల్లోకి ప్రవేశించకముందే తన కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంటుందని భావించాడు. ఆస్పత్రికి వెళ్లడం కంటే తానే ఈ సమస్యను పరిష్కరించాలని భావించాడు. జియాఖాన్ కడుపులోని పిండాన్ని స్వయంగా బయటకు తీసి.. అతను టాయ్లెట్లో పడేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో వివరించింది. ఈ ఘటనతో జియాఖాన్ మానసికంగా కుంగిపోయిందని, ఆ తర్వాత పంచోలీని అట్టిపెట్టుకొని ఉండాలని ఆమె భావించినా.. అతను ఆమెను దూరం పెట్టడంతో మరింత మానసిక కుంగుబాటుకులోనై జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నదని సీబీఐ వివరించింది. ఈ చార్జ్‌షీట్‌లోని వివరాలు 'ముంబై మిర్రర్' పత్రిక వెలుగులోకి తెచ్చింది.