బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా తేలిన నటుడు సూరజ్ పంచోలి తాజాగా ముంబైలోని సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. శనివారం ఆలయాన్ని దర్శించిన అతడికి పూజారులు విఘ్నేశ్వరుడి ఫోటోతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. వాటిని తీసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన అక్కడి కెమెరాల వైపు చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు దిగాడు. ఈ క్రమంలో తన షూలను చేతితో పట్టుకుని పక్కన పెట్టారు. మళ్లీ అదే చేతితో వినాయకుడి ఫోటోను పట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నటుడిపై మండిపడుతున్నారు. 'నీ కాలి షూ ముట్టుకుని ఆ భగవంతుడి ఫోటో పట్టుకున్నావు. కొంచెమైనా బుద్ధుందా? అసలు ఏ పద్ధతి తెలియకుండా గుడికి ఎందుకొస్తారో?', 'షూ ముట్టుకున్న తర్వాత కనీసం నీ చేతులు కడుక్కోవచ్చు కదరా బాబూ' అని ట్రోలింగ్ చేస్తున్నారు.
కాగా నటి జియా ఖాన్ 2013, జూన్ 3న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సుమారు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ లేఖ ఆధారంగా నటి ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు నిందితుడిగా భావించారు. ఈ కేసును దీర్ఘకాలంగా విచారించిన సీబీఐ ఏప్రిల్ 28న సూరజ్ పంచోలి నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఇన్నాళ్లకు తనకు న్యాయం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు సూరజ్ పంచోలి. కాగా సూరజ్ పంచోలి చివరగా టైం టు డ్యాన్స్ షోలో కనిపించాడు.
చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే?
Comments
Please login to add a commentAdd a comment