చూశారుగా.. ఇక ట్రోల్‌ చేయండి: బుల్లితెర నటి | Actress Deepika Singh Shares New Dance Video with Cryptic Caption Asking To Troll Her | Sakshi
Sakshi News home page

చూస్తారే.. ట్రోల్‌ చేయండి..: వీడియో షేర్‌ చేసిన నటి

Published Tue, May 14 2024 1:51 PM | Last Updated on Tue, May 14 2024 2:00 PM

Actress Deepika Singh Shares New Dance Video with Cryptic Caption Asking To Troll Her

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రతి విషయాన్ని తారలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రోల్స్‌ బారిన కూడా పడుతుంటారు. అయితే తాజాగా దీపిక సింగ్‌ అనే బుల్లితెర నటి తనను ట్రోల్‌ చేయమని కోరుతోంది.

ట్రెండింగ్‌ పాటకు స్టెప్పులు
లేటెస్ట్‌గా ట్రెండ్‌ అవుతున్న ఓ పాటకు డ్యాన్స్‌ చేసిన దీపిక ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి ఎస్‌.. ఎందుకంటే ఇప్పుడిది ట్రెండ్‌ అవుతోంది.. ప్లీజ్‌ ఇప్పుడు నన్ను ట్రోల్‌ చేయండి అని సరదాగా రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌.. మీరిలాగే డ్యాన్స్‌ చేస్తూ ఉండండి.. సంతోషాన్ని పంచండి.. బ్యూటిఫుల్‌.. ట్రోల్‌ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. మీరవేమీ పట్టించుకోవద్దు అని రాసుకొచ్చారు. 

ఆ సీరియల్‌తో ఫేమస్‌
బహుశా తన డ్యాన్స్‌ను ట్రోల్‌ చేస్తున్నవాళ్లకు నటి ఇలా వెరైటీగా కౌంటరిచ్చినట్లు ఉంది. ఇకపోతే 'దియా ఔర్‌ బాటీ హమ్‌' అనే సీరియల్‌తో దీపిక సింగ్‌ బాగా పాపులర్‌ అయింది. 'ద రియల్‌ సోల్‌ మేట్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం మంగళ్‌ లక్ష్మి అనే హిందీ సీరియల్‌లో మంగళ్‌గా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

 

 

చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్‌ అయితే స్టార్‌ హీరో మూవీలో ఛాన్స్‌.. ఫస్ట్‌లో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement