Deepika Singh
-
ప్లీజ్ నన్ను ట్రోల్ చేయండి..
-
చూశారుగా.. ఇక ట్రోల్ చేయండి: బుల్లితెర నటి
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రతి విషయాన్ని తారలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రోల్స్ బారిన కూడా పడుతుంటారు. అయితే తాజాగా దీపిక సింగ్ అనే బుల్లితెర నటి తనను ట్రోల్ చేయమని కోరుతోంది.ట్రెండింగ్ పాటకు స్టెప్పులులేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న ఓ పాటకు డ్యాన్స్ చేసిన దీపిక ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ఎస్.. ఎందుకంటే ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది.. ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి అని సరదాగా రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. మీరిలాగే డ్యాన్స్ చేస్తూ ఉండండి.. సంతోషాన్ని పంచండి.. బ్యూటిఫుల్.. ట్రోల్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. మీరవేమీ పట్టించుకోవద్దు అని రాసుకొచ్చారు. ఆ సీరియల్‌తో ఫేమస్బహుశా తన డ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నవాళ్లకు నటి ఇలా వెరైటీగా కౌంటరిచ్చినట్లు ఉంది. ఇకపోతే 'దియా ఔర్ బాటీ హమ్' అనే సీరియల్‌తో దీపిక సింగ్ బాగా పాపులర్ అయింది. 'ద రియల్ సోల్ మేట్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం మంగళ్ లక్ష్మి అనే హిందీ సీరియల్లో మంగళ్గా ప్రధాన పాత్రను పోషిస్తోంది. View this post on Instagram A post shared by Deepika Singh (@deepikasingh150) చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. ఫస్ట్‌లో.. -
సమాజానికి ఉపయోగపడే సినిమా
‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్ . శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రిత్ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి. -
'ఓ వైపు తుపాను, నువ్వేమో డ్యాన్సులు.. ఛీ, సిగ్గుచేటు"
చిటపట చినుకులు పడుతుంటే వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటుంటారు. ఓ మోస్తరు వర్షం పడుతుంటే పడవలు చేసుకుని వాటిలో నీటిలో వదులుతూ ఆటలాడతారు. పిల్లలైతే డ్యాన్సులు చేస్తూ వానలో తడిసి ముద్దవుతారు కూడా! కానీ భారీ వర్షం వస్తే గుండె ఝల్లుమంటుంది, అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా తుపాను ప్రభావంతో కుంభవృష్టి కురిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. కాగా పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన టౌటే తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) అయితే ఇలాంటి సమయంలో దియా ఔర్ బాతీ హమ్(ఈ తరం ఇల్లాలు) సీరియల్ నటి దీపికా సింగ్ చేసిన పనికి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కారణం ఆమె రోడ్డు మీద విరిగిపడిన చెట్ల దగ్గరికు వెళ్లి ఫొటోషూట్ చేయడమే. "తుపానును మీరు ఆపలేరు, కాబట్టి దాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయకండి. అలా అని సైలెంట్‌గా కూర్చోకుండా ప్రకృతిని ఆలింగనం చేసుకోండి.. ఈలోగా తపాను వచ్చినదారినే వెళ్లిపోతుంది", "మా ఇంటి పక్కన ఓ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, కానీ దాన్ని అక్కడ నుంచి తొలగించే క్రమంలో ఈ టౌటే తుపానును గుర్తుంచుకునేందుకు నా భర్త రోహిత్, నేను కొన్ని ఫొటోలు తీసుకున్నాం" అని తను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) దీనికి తోడు వర్షంలో డ్యాన్స్ చేసిన వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. ఇది చూసి నోరెళ్లబెట్టిన జనాలు 'ఫొటోషూట్లు, డ్యాన్సులు చేయడానికి సమయం, సందర్భం అక్కర్లేదా?' అని తిట్టిపోస్తున్నారు. 'ఓ పక్క తుపాను వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఛీ, సిగ్గుచేటుగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు, కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకపోతేనే మంచిది' అని సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) Today we have a girlboss posing with (in?) a tree that fell because of the cyclone currently ravaging India’s west coast. pic.twitter.com/gmBVlkWZH3 — Iva (@ivadixit) May 18, 2021 Love that girlboss is #collectingmoments in a cyclone that is wrecking people’s homes. Such moments are truly the equivalent to #fullmadness and #therapy — B (@pseudosabya) May 18, 2021 I'm sorry but stupidly posing with a fallen tree during cyclone is hazardous. I heard that people died. It's unsafe and unnecessary. U don't need motivation from people like these. — The Nocturnal (@nocturnalnkid) May 19, 2021 చదవండి: ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ బిపాసా బసు - జాను అబ్రహాంల విఫల ప్రేమ కథ -
కరోనా నుంచి కోలుకున్న నటి తల్లి
టీవీ నటి దీపికా సింగ్ తల్లి కోవిడ్‌ను జయించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు నటి వెల్లడించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన తల్లి, నానమ్మతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఇది పాత ఫొటో కాగా, తన తల్లి కోలుకునేందుకు కారణమైనవారికీ, తనకు మద్దతు తెలిపినవారికి నటి కృతజ్ఞతలు తెలిపింది. "అమ్మ తిరిగి ఇంటికి చేరుకుంద"ని సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఆమె నానమ్మ మాత్రం కోవిడ్‌తో ఇంకా పోరాడుతూనే ఉంది. (నటి అభ్యర్థన.. ప్రభుత్వం స్పందన) ఈ విషయాన్ని నటి ప్రస్తావిస్తూ నానమ్మ ఇంకా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని, ఆమె కోసం ప్రార్థిస్తున్నామని తెలిపింది. కాగా దీపిక సింగ్ తల్లి కోవిడ్ పాజిటివ్ అని తేలాక ఆసుపత్రుల చుట్టూ తిరిగినప్పటికీ బెడ్డు దొరకని విషయం తెలిసిందే. దీంతో ఆమె సాయం కోరుతూ వీడియో చేయడం, ఇది ప్రభుత్వం దృష్టికి రారావడంతో వెంటనే అధికారులు ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రిలో అడ్మిషన్ ఇచ్చి అండగా నిలవడం తెలిసిన విషయమే. (తమన్నా ఆహా) -
నటి అభ్యర్థన.. ప్రభుత్వం స్పందన
న్యూఢిల్లీ: తన తల్లికి కరోనా సోకిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించుకోవాలంటూ నటి దీపికా సింగ్ చేసిన అభ్యర్థనపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రిలో ఆమెకు అడ్మిషన్ ఇచ్చింది. దీనిపై నటి దీపికా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో అడ్మిషన్ దొరికిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా తనకు సాయం చేసిన ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్‌కు కతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే తన తల్లి కరోనా బారి నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. (నా తల్లికి కరోనా.. సహాయం చేయండి : నటి) కాగా అస్వస్థతగా ఉన్న దీపిక తల్లికి ఢిల్లీలోని హార్దిక్ మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే సదరు మెడికల్ సిబ్బంది రిపోర్టులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించలేకపోతున్నామని, తమకు సాయం చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించింది. పైగా తమది ఉమ్మడి కుటుంబం అని, ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో 45 మంది ఒకే దగ్గర నివసిస్తున్నందున ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో స్పందించిన ప్రభుత్వం ఆమెకు సాయమందించింది. (హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న కరోనా) View this post on Instagram Thank you to Delhi Govt & health minister for the immediate response to my tweet & video. Finally my mother got admission in Sir Gangaram hospital. Hoping for her speedy recovery 🙏@msisodia @ArvindKejriwal @Abhishek_asitis @drharshvardhan #Atirekbharadwaj A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on Jun 13, 2020 at 2:00am PDT -
మా అమ్మకు కరోనా.. సాయం చేయండి
న్యూఢిల్లీ: కరోనా సోకిన తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించడానికి సహాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని నటి దీపికా సింగ్ అభ్యర్థించారు. సదరు మెడికల్ సిబ్బంది దీనికి సంబంధించిన రిపోర్టులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించలేకపోతున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించారు. వెంటనే తమకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని హార్డింగ్ మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించగా తన తల్లికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో షాక్‌కి గురయ్యామని, ప్రస్తుతం తన తల్లి చాలా నీరసంగా ఉన్నారని ఆవేదన చెందారు. ఢిల్లీలో తనకు తెలిసిన కొన్ని ఆస్పత్రులను ఫోన్లో సంప్రదించగా బెడ్లు ఖాళీగా లేవన్న సమాధానమే వచ్చిందని వెల్లడించారు. దీపికా పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. మీలాంటి సెలబ్రటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య కరోనా రోగులకు ఎలా ట్రీట్మెంట్ అందిస్తున్నారో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కేసులు ) ఎప్పుడూ ఇంట్లోనే ఉండే తన తల్లికి కరోనా ఎలా సోకిందో అర్థం కావడం లేదని ఇన్‌స్టా వేదికగా వాపోయిన దీపిక.. తమది ఉమ్మడి కుటుంబం అని ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో 45 మంది ఒకే దగ్గర నివసిస్తున్నారని చెప్పారు. దీంతో మిగతా వారికి కూడా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దీపికాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తన నానమ్మ, తండ్రికి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని దీంతో వారికి కూడా కరోనా సోకిందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మిగతా కుటుంబ సభ్యులకి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. (పీజీఐఎమ్ఈఆర్ ఆస్పత్రిలో ఫలించిన ప్లాస్మా థెరపీ ) View this post on Instagram My mom & dad are in Delhi. The test has been done in Lady Hardinge hospital & they didn’t give reports . They only allowed my father to click its picture. I really hope the concerned personell are reading this and my mom there receives some relief. We need your help . HNO 8365 Arya Nagar , Pahar Ganj , New Delhi 110055 , Near Ashoka Hotel at Aarakashan road . plz contact my husband Rohit 9833649679 @arvindkejriwal @narendramodi 🙏 A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on Jun 12, 2020 at 6:04am PDT దీపికా సింగ్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో శనివారం ఆమె తల్లిని హాస్పిటల్లో చేర్పించామని డిప్యూటీ కమిషనర్ అభిషేక్ సింగ్ ట్వీట్ చేయగా ఇంకా లేదు. మా అమ్మ ఇంట్లోనే ఉంది అంటూ దీపికా రిప్లై ఇచ్చారు. తన నానమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఆమెను హాస్పిటల్లో చేర్పించాలని కోరారు. దియా అవుర్ బాతీ హమ్ సీరియల్ ద్వారా దీపికా సింగ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -
కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్ ఏంజెల్స్ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కిరాతకమైన ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా హ్యారీ పోర్టర్ నటి ఎమ్మా వాట్సన్ స్పందించారు. అత్యాచార బాధిత తరుఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌కు ఆమె మద్దతు తెలిపారు. దీపికా సింగ్ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ఎమ్మా వాట్సన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ... దీపికా సింగ్ రజావత్‌కే అన్ని అధికారాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ ఐక్యరాజ్యసమితిలో మహిళల గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. యువతుల్లో సాధికారిత కలిగించేందుకు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మా వాట్సన్ షేర్చేసిన ఆర్టికల్‌లో రజావత్ నమ్మకాన్ని, వృత్తి పట్ల ఆమెకున్న వైఖరిని పేర్కొన్నారు. కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్ పిటిషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును చేపట్టిన వెంటనే ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె భయపడకుండా.. హంతకులకు శిక్షపడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. కశ్మీరీ పండిట్ అయిన 38 ఏళ్ల దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు జిల్లా కుప్వారాలో కరిహామా గ్రామం. ఈ చిన్నారి తరుఫున వాదిస్తున్న రజావత్‌కు బెదిరింపులు ఎక్కువ అవడంతో, ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. రజావత్‌తో పాటు, చిన్నారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి సాయంగా ఉన్న బకర్వాల్ కమ్యూనిటీ సభ్యుడు తలీబ్ హుస్సేన్‌కు కూడా సెక్యురిటీ ఏర్పాటు చేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ హైకోర్టులో ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. All power to Deepika Singh Rajawat ✊🏻https://t.co/sZzDVcIFNo — Emma Watson (@EmmaWatson) May 3, 2018 -
అవర్ ఆనర్
న్యాయదేవాలయంలో జడ్జిగారిని యువరానర్ అని సంబోధిస్తారు.ఆ దేవాలయంలోనే సమాజానికి న్యాయం దొరుకుతుందన్న నమ్మకం మనందరిదీ!!ఆ దేవాలయంలోనే మన గౌరవంకాపాడుతారన్నది కూడా మన నమ్మకం!!మన గౌరవం (ఆనర్) కోసం పోరాడటంమన బాధ్యత అయితే ఇతరుల గౌరవాన్ని తన గౌరవంగా పోరాడ్డం ఒక ప్రార్థనలాంటిది!!అసీఫా ఆత్మగౌరవాన్ని అవర్ ఆనర్‌గా... భావించారు లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారి అసీఫాను చంపేశారు. ఇప్పుడు ఆమె కేసును వాదిస్తున్న న్యాయవాది దీపికాసింగ్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. దీపికకు అష్టమి అనే ఐదేళ్ల కూతురు ఉంది. ‘‘అసీఫా కూడా అష్టమి లాంటిదే. అందుకే ఈ కేసును టేకప్ చేశాను’’ అంటున్నారు లాయర్ దీపిక. జమ్మూకశ్మీర్‌లోని కఠువా ప్రాంతంలో ఎనిమిదేళ్ల అసీఫా అనే చిన్నారిని గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన ఘటన ఇప్పుడు దేశాన్ని కుదిపివేస్తోంది. ఈ దారుణం మీద మొట్ట మొదట రిట్ పిటీషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. లాయరే కాక ‘వాయిస్ ఫర్ రైట్స్’ అనే సంçస్థను ఆమె నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల హక్కుల కోసం పనిచేసే ‘చైల్డ్ రైట్స్ అండ్ యూ’ (క్రై)కి కూడా సేవలందిస్తారు రజావత్. చిన్నారి అసీఫా పై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలసి దీపిక కేస్ ఫైల్ చేశారు. అసీఫా వాళ్లది నిరుపేద కుటుంబం. వాళ్లకు న్యాయం దక్కలేదు. లంచం తీసుకున్న పోలీసులు సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. ఆ కుటుంబాన్ని భయపెట్టారు. నోరుమూయించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలుసుకున్న దీపికా ఆ చిన్నారి తరపు వాళ్లకు న్యాయం అందించాలనుకుంది. అందుకు ఆమెకు ఎదురైందేంటో తెలుసా? ఈ కేస్ తీసుకున్న వెంటనే ఆమె బార్ మెంబర్షిప్ రద్దయింది! ఎక్కడెక్కడినుంచో, ఎవరెవరి దగ్గర్నుంచో బెదిరింపులు వచ్చాయి. అయినా భయపడలేదు ఆమె. హంతకులకు శిక్ష పడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేదిలేదని పోరాడుతోంది. బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్ ‘‘హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్‌గా నాకీ ధమ్కీలు (బెదిరింపులు), బ్లాక్‌మెయిల్స్ కొత్తేం కాదు. ఎనిమిదేళ్ల బాలిక కనిపించడం లేదని పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు స్థానిక పోలీసులు. ఈ కేస్ తీసుకోవడానికి నాకు ఇంతకన్నా ఇంకో కారణం అవసరం లేదనిపించింది. ఈ కేసు పనిలో భాగంగా నేను జమ్మూకశ్మీర్ కోర్టుకు వెళితే ‘నువ్వు ఇక్కడ కనిపించడానికి వీల్లేదు’ అంటూ జమ్మూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీఎస్ సలాథియా బెదిరించారు. ‘మీరు నన్ను శాసించడానికి నేను ఇక్కడి బార్ అసోసియేషన్ మెంబర్‌ను కాను’ అని చెప్పాను. ‘నిన్నెలా ఆపాలో మాకు తెలుసు’ అన్నాడు. నేను వెంటనే జమ్మూకశ్మీర్ హైకోర్ట్ చీఫ్ జస్టి్టస్కు ఓ కంప్లయింట్ ఇచ్చాను.. నాకు ఇక్కడ భద్రత లేదు రక్షణ కల్పించమని. అంతేకాదు నేను కోర్టుకు హాజరైనప్పుడల్లా నాకు రక్షణ ఏర్పాట్లు కల్పించమనీ కోరాను’’ అని చెప్పారు దీపిక ఈ పోరాటం గురించి మాట్లాడుతూ. అయితే అసీఫా కేసుతో ఆమె ఆగిపోవాలని అనుకోవడం లేదు. నిర్భయ చట్టాన్ని మించిన మరో అత్యాచార నిరోధక చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బాల ఖైదీల కోసమూ పనిచేస్తు న్నారు. దీపిక ఉద్యమిస్తోన్న మరో తాజా సమస్య ఫ్రూట్ మాఫియా. కృత్రిమ రసాయనాలతో పళ్లను పక్వానికి తెస్తున్న వ్యాపారుల మీద కేసులతో దండెత్తుతున్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలనీ డిమాండ్ చేస్తున్నారు. అంతులేని న్యాయ పోరాటం కొన్నేళ్ల కిందట పన్నెండేళ్ల ఓ అమ్మాయి ఒక లాయర్ ఇంట్లో అనుమానాస్పద పరిసితుల్లో మరణించింది. ఆ లాయర్ ఆ అమ్మాయిది ఆత్మహత్య అని చెప్పాడు. కాని ఆ పిల్ల తల్లిదండ్రులు అది హత్యని, తమ తరపున వాదించమనీ దీపికను కోరారు. ఆ కేసు తీసుకున్నప్పుడు కూడా లాయర్లందరూ దీపికను బెదిరించారు. బార్ సభ్యత్వం రద్దు చేసే దాకా వెళ్లారు. సాధారణంగా దీపిక ‘చైల్డ్ అండ్ విమెన్ ట్రాఫికింగ్’కు సంబంధించిన కేసులను తీసుకుంటుంటారు. నియంత్రణ రేఖ వెంబడి ప్రాంతాలలో ఉంటున్న పిల్లలంతా గనుల్లో పనులకు వెళ్తారు. దాంతో అక్కడ ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారుతున్నారు. దీన్ని అరికట్టడానికి, వాళ్ల తరపున న్యాయం కోసం దీపికా సింగ్ రజావత్ పోరాడుతున్నారు. 2012లో ఓ పిల్ కూడా దాఖలు చేశారు. దాంతో గనిలో ప్రమాదాలకు గురైన వాళ్ల మీద కోర్టు ఓ సర్వే జరిపించి మనిషికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించింది. ఇది దీపిక సాధించిన మరో విజయం. ఎవరీ దీపికా సింగ్? దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్‌లోని కరిహామా. కాని 1986లో వాళ్ల కుటుంబం జమ్మూలో స్థిరపడింది. ఆమె భర్త ఆర్మీ చీఫ్‌గా రిటైరై ప్రస్తుతం బహెరెన్లో ఉంటున్నాడు. ‘‘ఎన్ని అడ్డంకులెదురైనా న్యాయాన్ని సాధించే వరకు వెనక్కి తిరిగేదే లేదు’’ అని స్పష్టం చేస్తోంది దీపికా సింగ్ రజావత్.ఈ యేడాది మొదట్లో కూడా ఒక జడ్జికి సంబంధించిన కేసులో దీపిక ఇలాంటి బెదిరింపులనే ఎదుర్కొన్నారు. ఆ జడ్జి తనింట్లో పనిచేసే అమ్మాయిని రేప్ చేశాడు. ఆ పనమ్మాయి తరపున కేస్ వాదించింది దీపిక. ఇప్పుడా జడ్జి జైల్లో ఉన్నాడు. – శరాది -
నిర్మాతలపై నటి ఫిర్యాదు
ముంబై: తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని హిందీ సీరియల్ నటి దీపికా సింగ్... సింటా(సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)ను ఆశ్రయించింది. 2011 నుంచి స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్’ సీరియల్ లో (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు’గా వస్తోంది) ఆమె నటించింది. నిర్మాతలు శశి, సుమీత్ మిత్తల్ తనకు ఇవ్వాల్సిన రూ. 1.14 కోట్లు ఇవ్వడం లేదని 'సింటా'కు దీపిక ఫిర్యాదు చేసింది. షూటింగ్ కు ఆమె ఆలస్యంగా రావడం తమకు రూ. 16 లక్షల వరకు నష్టం వచ్చిందని నిర్మాతలు భావించారని, అందుకే సీక్వెల్ లో దీపికను ఎంపిక చేయలేదని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీని గురించి సింటా'కు నిర్మాతలు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తమకు కలిగించిన నష్టాన్ని ఆమె పారితోషికం నుంచి మినహాయించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాతలపై దీపిక.. సింటాకు ఫిర్యాదు చేసింది.