నిర్మాతలపై నటి ఫిర్యాదు | Actress Deepika Singh faces Rs16 lakh fine | Sakshi
Sakshi News home page

నిర్మాతలపై నటి ఫిర్యాదు

Published Mon, Dec 26 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

నిర్మాతలపై నటి ఫిర్యాదు

నిర్మాతలపై నటి ఫిర్యాదు

ముంబై: తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని హిందీ సీరియల్‌ నటి దీపికా సింగ్‌... సింటా(సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్)ను ఆశ్రయించింది. 2011 నుంచి స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్’ సీరియల్ లో (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు’గా వస్తోంది) ఆమె నటించింది. నిర్మాతలు శశి, సుమీత్‌ మిత్తల్‌ తనకు ఇవ్వాల్సిన రూ. 1.14 కోట్లు ఇవ్వడం లేదని 'సింటా'కు దీపిక ఫిర్యాదు చేసింది.

షూటింగ్‌ కు ఆమె ఆలస్యంగా రావడం తమకు రూ. 16 లక్షల వరకు నష్టం వచ్చిందని నిర్మాతలు భావించారని, అందుకే సీక్వెల్‌ లో దీపికను ఎంపిక చేయలేదని  సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీని గురించి సింటా'కు నిర్మాతలు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తమకు కలిగించిన నష్టాన్ని ఆమె పారితోషికం నుంచి మినహాయించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిర్మాతలపై దీపిక.. సింటాకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement