సమాజానికి ఉపయోగపడే సినిమా | Dirty Fellow Movie Teaser Launch By Hero Srikanth | Sakshi
Sakshi News home page

సమాజానికి ఉపయోగపడే సినిమా

Published Thu, Oct 5 2023 6:00 AM | Last Updated on Thu, Oct 5 2023 6:00 AM

Dirty Fellow Movie Teaser Launch By Hero Srikanth - Sakshi

శ్రీకాంత్, శాంతి చంద్ర

‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్‌ .

శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్‌ ఇండియా 2022 సిమ్రిత్‌ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్‌ జీయస్‌ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement