Dirty Fellow Movie
-
‘డర్టీ ఫెలో’ మూవీ రివ్యూ
టైటిల్: డర్టీ ఫెల్లోనటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులునిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: జి.యస్. బాబుదర్శకత్వం: ఆడారి మూర్తి సాయిసంగీతం: డాక్టర్. సతీష్ కుమార్.పి.సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్. ఎడిటర్ : జేపీవిడుదల తేది: మే 24, 2024ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘డర్టీ ఫెలో’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. మాఫియా డాన్ జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాష్) ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసే సెటిల్మెంట్స్ చేస్తుంటారు. అయితే జేపీని తప్పిస్తే తనే మాఫీయా డాన్‌గా ఉండొచ్చని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. జేపీని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో శంకర్ నారాయణ కొడుకు చనిపోతాడు. దీంతో శంకర్ నారాయణ జేపీపై పగ పెంచుకుంటాడు. ఎప్పటికైనా నీ కొడుకు శత్రు అలియాస్ డర్టీ ఫెలో(శాంతి చంద్ర)ని తానే చంపుతానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే.. సిద్దు (శాంతి చంద్ర) ఓ గూడెంలోని పూజరి ఇంట్లో ఉంటూ.. అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటాడు. పూజారి కూతురు రాగ (దీపికా సింగ్) సిద్దుని చూసి ఇష్టపడుతుంది. అదే గ్రామానికి సేంద్రియ వ్యవసాయ పరిశోధన మీద చిత్ర (సిమ్రితి) వస్తుంది. ఆ గూడెం, ఆ అటవీ ప్రాంతాన్ని శంకర్ నారాయణ మనిషి పోతురాజు తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. అలాంటి పోతురాజుని సిద్దు హతమార్చేస్తాడు. దీంతో సిద్దు, డర్టీ ఫెల్లో ఒక్కరే అని శంకర్ నారాయణ తెలుసుకుంటాడు? మరో వైపు సిద్దుని చిత్ర షూట్ చేస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? అసలు డర్టీ ఫెల్లో, సిద్దు ఒకరేనా? చిత్ర ఎందుకు షూట్ చేసింది? శంకర్ నారాయణ చివరకు ఏం చేస్తాడు? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాఫీయా నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. డర్టీ ఫెలో కూడా అలాంటి సినిమానే. కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా యాడ్ చేయడంతో కాస్త కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయి. ఎక్కడా ల్యాగ్ ఉండదు. మూవీ బిగినింగ్ నుంచి అలా వెళ్తూ ఉంటుంది. అయితే ప్లాష్‌బ్యాక్ సీన్లు మాత్రం కాస్త గందరగోళానికి గురి చేస్తాయి. కథ ప్రస్తుతం జరుగుతుందా లేదా ప్లాష్ బ్యాక్ చెబుతున్నారా అనేది కొన్ని చోట్ల అర్థం కాదు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారు. ఫస్టాఫ్‌లో కథనం చాలా ఫాస్ట్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. టైటిల్ సాంగ్... హీరోయిన్లతో రొమాన్స్ అన్ని యూత్‌ని ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభంలోనే డర్టీఫెలోని పరిచయం చేసి.. ఆ తర్వాత సిద్దు పాత్ర చుట్టు కథను నడించాడు దర్శకుడు. దీంతో అసలు సిద్దు, డర్టీఫెలో ఒకరేనా కాదా? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. అలాగే చిత్ర పాత్రను కూడా విభిన్నంగా తీర్చి దిద్దాడు. ఇంటర్వెల్ ముందు ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్‌లో మాఫియా డాన్ ‘డర్టిఫెలో’ చుట్టే కథనం సాగుతుంది. అయితే అతను మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనేది చూపించకుండా.. డైరెక్ట్‌గా డాన్‌గానే చూపించడంతో ఆ పాత్రకు అనవసరపు ఎలివేషన్స్ ఇచ్చారనే ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో జేపీ ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. మాఫియా నేపథ్యంలో వచ్చే సినిమాల్లో డర్టీఫెలో ఓ డిఫరెంట్ మూవీ. స్క్రీన్‌ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సిద్దు, డర్టీ ఫెల్లో పాత్రల్లో శాంతి చంద్ర చక్కగా నటించాడు. రెండు కారెక్టర్ల మధ్య వేరియేషన్స్‌ను చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ అదరగొట్టేశాడు. స్టైల్, యాక్షన్ తో మాస్ ఆడియన్స్ మెప్పించాడు. ఇక నాగి నీడు చాలా రోజుల తరువాత అందరినీ లెంగ్తీ పాత్రతో మెప్పించాడు. సత్య ప్రకాష్ విలనిజం చాలా రోజులకు మళ్లీ తెరపై కనిపించింది. పోతురాజు పాత్ర బాగుంది. దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ ముగ్గురూ కూడా తెరపై అందంగా కనిపించారు. ఈ మూడు పాత్రలకు మంచి ప్రాధాన్యం లభించింది. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. అందరూ తమ పరిధి మేరకు నటించారు.సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. డాక్టర్. సతీష్ కుమార్.పి సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తో పాటు మరో పాట మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమా ఎక్కువగా ఔట్‌డోర్స్‌లోనే షూట్ చేశారు. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
గ్రాండ్‌గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా చేసిన సినిమా 'డర్టీ ఫెలో'. దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్లుగా నటించారు. శాంతి బాబు నిర్మించారు. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. ఈ నెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(ఇదీ చదవండి: Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్)మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇది ధమాకా, బ్లాస్ట్ లాంటి సక్సెస్ అందుకుంటుందని హీరో శాంతి చంద్ర చెప్పుకొచ్చారు. సినిమాను థియేటర్ లోనే చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లే. థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారంట అని రేపటి తరాలు చెప్పుకుంటాయని డైరెక్టర్ ఆడారి మూర్తి సాయి ఆవేదన వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లో 'కల్కి'.. ఏకంగా అన్ని కోట్లకు అమ్మేశారా?) -
డర్టీ ఫెలో రెడీ
శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, ‘మిస్ ఇండియా 2022’ సిమ్రితి హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ 24న రిలీజ్‌కి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్‌ని ‘బింబిసార’ మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘డర్టీ ఫెలో’ ట్రైలర్ బాగుంది.ఈ సినిమా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. శాంతి చంద్ర, మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మా సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ .యస్, సంగీతం: డా. సతీష్ కుమార్ .పి. -
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా(2022) సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డర్టీ ఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. యస్. బాబు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. -
సమాజానికి ఉపయోగపడే సినిమా
‘‘తల్లిదండ్రులు, గురువులు పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే ఆ పిల్లలు సమాజానికి ఎలా హానికరంగా తయారవుతారనే ‘డర్టీ ఫెలో’ కథ నాకు బాగా నచ్చింది. సమాజానికి ఉపయోగపడేలా మూర్తి సాయి ఈ సినిమాను తీశాడు. శాంతి చంద్రలాంటి వ్యాపారవేత్తలు ఇండస్ట్రీకి రావాలి’’ అన్నారు శ్రీకాంత్ . శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రిత్ బతీజా హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘మా సినిమా సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు శాంతి చంద్ర. ‘‘ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు ఆడారి మూర్తి సాయి. -
‘డర్టీ ఫెలో’ని ఆదరించండి
శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి డర్టీ ఫెలో అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ బాగుంది . డర్టి ఫెలో టైటిల్ ఈ కథ కీ యాప్ట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘ఒక తండ్రి తన కొడుకుని సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా పెరిగి, సమాజానికి హానికరంగా మారితే... ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి? అనేదే ఈ సినిమా కథాంశం అని హీరో శాంతి చంద్ర అన్నారు. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు ఆడారి మూర్తి అన్నారు. ‘మంచి కథ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను’అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హీరోయిన్ శిమ్రితీ బతీజా తదితరులు పాల్గొన్నారు.