డర్టీ ఫెలో ట్రైలర్‌ రిలీజ్‌ | Santhi Chandra Dirty Fellow Trailer Released | Sakshi
Sakshi News home page

డర్టీ ఫెలో.. ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన విశ్వంభర డైరెక్టర్‌

Published Fri, May 17 2024 5:20 PM | Last Updated on Fri, May 17 2024 5:20 PM

Santhi Chandra Dirty Fellow Trailer Released

శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా(2022) సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డర్టీ ఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. యస్. బాబు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్‌ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్‌ను అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement