
భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇదే సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రం 'తుంబాడ్'.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు క్రేజీ (Crazxy Movie) అనే మూవీని విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సోహుమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సోహుమ్ షాతో పాటు ముకేశ్ షా, అమిత్ సురేశ్, ఆదేశ్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న రానుంది. తుంబాడ్ (2018) విషయానికి వస్తే.. హారర్ జానర్‌లో సెన్సేషన్ హిట్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది.
Comments
Please login to add a commentAdd a comment