110 ఏళ్ల సినీచరిత్రలో తొలిసారి ఇలాంటి కాన్సెప్ట్‌! | Mohan Vadlapatla M4M Hindi TRailer Released | Sakshi
Sakshi News home page

M4M సినిమా హిందీ ట్రైలర్‌ రిలీజ్‌

Published Thu, Nov 28 2024 8:38 PM | Last Updated on Thu, Nov 28 2024 8:38 PM

Mohan Vadlapatla M4M Hindi TRailer Released

దర్శకుడు మోహన్‌ వడ్లపట్ల తెరకెక్కించిన సీరియల్‌ క్రైం థ్రిల్లర్‌ మూవీ M4M (మోటివ్‌ ఫర్‌ మర్డర్‌). ఒడిశా స్టార్‌ సంబీట్‌ ఆచార్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా హిందీ ‍ట్రైలర్‌ను గోవాలో జరుగుతున్న ఇఫీ (ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) కార్యక్రమంలో రిలీజ్‌ చేశారు. ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (IMPPA) వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదలైంది.

ఈ సందర్భంగా అతుల్‌ మాట్లాడుతూ.. సీరియల్‌ కిల్లర్‌ కాన్సెప్ట్‌ కొత్తగా ఉందన్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందించాలని ‍ప్రయత్నిస్తున్న దర్శకనిర్మాత మోహన్‌ వడ్లపట్లను ప్రశంసించారు. మోహన్‌ వడ్లపట్ల మాట్లాడుతూ.. ఇఫీ వేడుకలో M4M ట్రైలర్‌ రిలీజ్‌ అవడం సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి థ్రిల్‌ అవుతారన్నారు. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలోనే రిలీజ్‌ చేస్తామన్నారు. హీరోయిన్‌ జో శర్మ మాట్లాడుతూ.. 110 ఏళ్ల సినీచరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్‌ ఫస్ట్‌ టైమ్‌ అని, తాను ఈ సినిమాలో కథానాయికగా నటించడం గర్వకాణంగా ఉందని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement