చిటపట చినుకులు పడుతుంటే వేడి వేడి బజ్జీలు వేసుకుని తింటుంటారు. ఓ మోస్తరు వర్షం పడుతుంటే పడవలు చేసుకుని వాటిలో నీటిలో వదులుతూ ఆటలాడతారు. పిల్లలైతే డ్యాన్సులు చేస్తూ వానలో తడిసి ముద్దవుతారు కూడా! కానీ భారీ వర్షం వస్తే గుండె ఝల్లుమంటుంది, అడుగు బయట పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా తుపాను ప్రభావంతో కుంభవృష్టి కురిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది. కాగా పలు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన టౌటే తుపాను ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ముంచెత్తిన వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ఇలాంటి సమయంలో దియా ఔర్ బాతీ హమ్(ఈ తరం ఇల్లాలు) సీరియల్ నటి దీపికా సింగ్ చేసిన పనికి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. కారణం ఆమె రోడ్డు మీద విరిగిపడిన చెట్ల దగ్గరికు వెళ్లి ఫొటోషూట్ చేయడమే. "తుపానును మీరు ఆపలేరు, కాబట్టి దాన్ని ఆపాలన్న ప్రయత్నం చేయకండి. అలా అని సైలెంట్‌గా కూర్చోకుండా ప్రకృతిని ఆలింగనం చేసుకోండి.. ఈలోగా తపాను వచ్చినదారినే వెళ్లిపోతుంది", "మా ఇంటి పక్కన ఓ చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, కానీ దాన్ని అక్కడ నుంచి తొలగించే క్రమంలో ఈ టౌటే తుపానును గుర్తుంచుకునేందుకు నా భర్త రోహిత్, నేను కొన్ని ఫొటోలు తీసుకున్నాం" అని తను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది.
దీనికి తోడు వర్షంలో డ్యాన్స్ చేసిన వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. ఇది చూసి నోరెళ్లబెట్టిన జనాలు 'ఫొటోషూట్లు, డ్యాన్సులు చేయడానికి సమయం, సందర్భం అక్కర్లేదా?' అని తిట్టిపోస్తున్నారు. 'ఓ పక్క తుపాను వల్ల జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావా? ఛీ, సిగ్గుచేటుగా ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు, కాబట్టి ఈ సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకపోతేనే మంచిది' అని సూచిస్తున్నారు.
Today we have a girlboss posing with (in?) a tree that fell because of the cyclone currently ravaging India’s west coast. pic.twitter.com/gmBVlkWZH3
— Iva (@ivadixit) May 18, 2021
Love that girlboss is #collectingmoments in a cyclone that is wrecking people’s homes. Such moments are truly the equivalent to #fullmadness and #therapy
— B (@pseudosabya) May 18, 2021
I'm sorry but stupidly posing with a fallen tree during cyclone is hazardous. I heard that people died. It's unsafe and unnecessary. U don't need motivation from people like these.
— The Nocturnal (@nocturnalnkid) May 19, 2021
Comments
Please login to add a commentAdd a comment