న్యూఢిల్లీ: తన తల్లికి కరోనా సోకిందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేనందున వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించుకోవాలంటూ నటి దీపికా సింగ్ చేసిన అభ్యర్థనపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రిలో ఆమెకు అడ్మిషన్ ఇచ్చింది. దీనిపై నటి దీపికా సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో అడ్మిషన్ దొరికిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా తనకు సాయం చేసిన ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్‌కు కతజ్ఞతలు తెలిపింది. త్వరలోనే తన తల్లి కరోనా బారి నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. (నా తల్లికి కరోనా.. సహాయం చేయండి : నటి)
కాగా అస్వస్థతగా ఉన్న దీపిక తల్లికి ఢిల్లీలోని హార్దిక్ మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే సదరు మెడికల్ సిబ్బంది రిపోర్టులు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించలేకపోతున్నామని, తమకు సాయం చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించింది. పైగా తమది ఉమ్మడి కుటుంబం అని, ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో 45 మంది ఒకే దగ్గర నివసిస్తున్నందున ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో స్పందించిన ప్రభుత్వం ఆమెకు సాయమందించింది. (హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న కరోనా)
Comments
Please login to add a commentAdd a comment