'పుష్ప 2' (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందడం, పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరడం హీరో అల్లు అర్జున్‌ని(Allu Arjun) ఎలాంటి ఇబ్బందుల్లో పడేసిందో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై పరోక్షంగా విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా పోలీసులు.. మరోసారి బన్నీని విచారణకు కూడా పిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)
ఈ వివాదం అల్లు అర్జున్‌పై ఎంత ప్రభావం చూపిందో తెలీదు గానీ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) మాత్రం మానసికంగా చాలా కుంగిపోయినట్లు అనిపిస్తున్నాడు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం జరిగిన సక్సెస్ మీట్‌లో మహిళ మృతి విషయాన్ని గుర్తుతెచ్చుకుని బాధపడ్డాడు. ఇప్పుడు ఏకంగా సినిమానే వదిలేస్తానని షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. యూఎస్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఈవెంట్ సందర్భంగా సుక్కు ఈ కామెంట్స్ చేశాడు.
యూఎస్ ఈవెంట్‌లో 'గేమ్ ఛేంజర్' నుంచి 'ధోప్' లిరిక్స్‌తో సాగే పాట రిలీజ్ చేశారు. దీని గురించి మాట్లాడుతూ.. సుకుమార్ గారు ఒకవేళ మీరు 'ధోప్' అని వదిలేయాలి అంటే ఈరోజుతో ఏం వదిలేస్తారు? అని యాంకర్ సుమ అడగ్గా, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్ షాకయ్యాడు. అలా చేయరులే అని సైగ చేసి చూపించాడు. బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల సుకుమార్ బాగా డిస్ట్రబ్ అయినట్లు ఉంది. బహుశా అందుకే అలా అన్నాడేమో?
(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)
Papam ra SUKKU 😢
Waiting for your huge comeback with RC17 ♥️🔥#RamCharan𓃵 #Pushpa2TheRule#Sukumar #RC17pic.twitter.com/LyeJMBPCDK— Negan (@Negan_000) December 23, 2024
Comments
Please login to add a commentAdd a comment