మహారాష్ట్రలోని స్వగ్రామంలో అంత్యక్రియలు
దొడ్డబళ్లాపురం: శనివారంనాడు నెలమంగల వద్ద కంటెయినర్ లారీ పడి కారు నుజ్జయిన ప్రమాదంలో మరణించిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుమందికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా జత్ తాలూకా మొరబగి గ్రామంలో అశృ నయనాలతో బంధువులు, గ్రామస్తులు వీడ్కోలు పలికారు. నెలమంగళ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగించి ఆదివారం ఉదయం ఆరు మృతదేహాలను అంబులెన్సుల్లో గ్రామానికి తీసుకువచ్చారు.
అప్పటికే గ్రామంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబ పెద్ద చంద్రం యోగప్ప, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు బంధువుల మృతదేహాలకు సహోదరుడు మల్లికార్జున్ నిప్పు అంటించారు. చంద్రం ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగులు తరలివచ్చారు. చంద్రంపై గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు ఉంది. నిరుద్యోగులు ఎవరున్నా వారికి ఉద్యోగం కల్పించేవాడు. చంద్రం పేద కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి ఎదిగారు.
ఉసురు తీసిన కంటైనర్ లారీ
Comments
Please login to add a commentAdd a comment