సంధ్య థియేటర్ ఘటన.. మరో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు | Chikkadapalli Police Mentioned Pushpa 2 Movie Makers Name In Accused List | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: సంధ్య థియేటర్ కేసు.. నిర్మాణ సంస్థకు షాకిచ్చిన పోలీసులు

Published Tue, Dec 24 2024 5:21 PM | Last Updated on Tue, Dec 24 2024 5:45 PM

Chikkadapalli Police Mentioned Pushpa 2 Movie Makers Name In Accused List

సంధ్యా థియేటర్‌ ఘటన కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థను కూడా చేర్చారు. ఈ కేసులో ఏ18గా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పేరును పోలీసులు ప్రస్తావించారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్‌ థియేటర్‌కు రాగా.. పెద్దఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement