పనిచేసే ఇంటికే కన్నం; 26లక్షలు చోరీ
చిక్కడపల్లి (హైదరాబాద్సిటీ) : ఇంట్లో పని చేసే ఓ మహిళ ఇంటికి కన్నెం వేసిన సంఘటన చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితురాలును అరెస్టు చేసి ఆమె నుంచి 26 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ ఎన్ఎల్ఎన్ రాజు, డిఐ పి. బల్వంతయ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలగూడ డివిజన్ గగన్మహల్లో నివసించే రిటైర్డ్ వృద్ధ దంపతులు శారదాదేవి, రాజు ఇంట్లో దోమలగూడలోని నర్సింగ్ హోం వద్ద నివసించే మమత (19) గత మూడు నెలలుగా నమ్మకంగా పని చేస్తుంది.
ఇంట్లోని బీరువాలో గల 25.78 లక్షలు విలువ చేసే నగలు, 22 వేల నగదు అపహరణకు గురైనట్లు గ్రహించి ఈ నెల 2వ తేదీన చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 27వ తేదీన పని మానేసిన పని మనిషి మమతపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మమతను పోలీసులు ఆరా తీయగా యజమానులు పక్కరూంకు వెళ్లినప్పుడు బీరువాలోని సొత్తు దొంగిలించినట్లు ఒప్పుకుంది. మమతను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.