సంధ్య థియేటర్ దగ్గర మహిళ మృతి చెందిన కేసులో ఇదివరకే హీరో అల్లు అర్జున్‌ని (Allu Arjun) అరెస్ట్ చేయగా.. నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ని న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే విచారణ కోసం మరోసారి రావాలని చెప్పి చిక్కడపల్లి పోలీసులు బన్నీకి నోటీసులు జారీ చేశారు. దీంతో బన్నీ ఇప్పుడు తన లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. ఇందులో భాగంగా పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవేనని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే?
(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)
అల్లు అర్జున్‌ని పోలీసులు అడగబోయే ప్రశ్నలు
బెనిఫిట్ షోకు.. మూవీ టీమ్ రావొద్దని పోలీసులు, యాజమాన్యానికి చెప్పిందా లేదా?
పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్‌కి రావొద్దనే విషయం మీకు తెలియదా?
పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్య థియేటర్‌కి ఎందుకొచ్చారు?
గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్య థియేటర్‌కి వచ్చారు?
మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు?
సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంతమంది వచ్చారు? వివరాలేంటి?
మీరు థియేటర్ కి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. దీనికి మీ సమాధానం?
చేతులు ఊపుతూ ర్యాలీగా థియేటర్‌లోకి ఎందుకు ప్రవేశించారు.
తొక్కిసలాట జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు?
పోలీసులు మీకు చెప్పినా సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు?
పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం?
రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా? ఎలాంటి భరోసా ఇచ్చారు?
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)
Comments
Please login to add a commentAdd a comment