'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని' | SC tells Aditya Pancholi to vacate rented bungalow by December 31 | Sakshi
Sakshi News home page

'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని'

Published Fri, Nov 6 2015 9:24 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని' - Sakshi

'ఇళ్లు కొనే స్థోమత ఉందిగా.. ఇదేం పని'

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆదిత్య పచోలికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఇంటి యజమానిని ఎందుకు వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31లో ఆయన అద్దెకు ఉంటున్న భవనాన్ని ఖాళీ చేసి యజమానికి అప్పగిచాలని స్పష్టం చేసింది.

దీంతోపాటు ఇప్పటి వరకు చెల్లించాల్సిన అద్దె మొత్తాన్ని రెండు వారాల్లోగా ఆ మహిళా యజమానురాలికి చెల్లించాలని ఆదేశించింది. ఒక ఇళ్లు కొనుగోలు చేసుకోగలిగే స్థోమత ఉండి కూడా ఇలా ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదని, ఆయనది అంగీకరించకూడని ప్రవర్తన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీరు చాలా పెద్ద మనిషి. ఒక ఫ్లాట్ కూడా కొనుగోలు చేయగలరు. మీ పద్దతి ఏమాత్రం అంగీకరించదగినది కాదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement