‘ఆ నటి పిచ్చిది.. లీగల్‌ చర్యలు తీసుకుంటా’ | Kangana Ranaut is mad, says Aditya Pancholi | Sakshi
Sakshi News home page

‘ఆ నటి పిచ్చిది.. లీగల్‌ చర్యలు తీసుకుంటా’

Published Tue, Sep 5 2017 12:47 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

‘ఆ నటి పిచ్చిది.. లీగల్‌ చర్యలు తీసుకుంటా’

‘ఆ నటి పిచ్చిది.. లీగల్‌ చర్యలు తీసుకుంటా’

ముంబై: బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌ వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. త్వరలోనే ’సిమ్రన్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య పంచోలి, హృతిక్‌ రోషన్‌, అధ్యయన్‌ సుమన్‌లపై విరుచుకుపడింది. నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆదిత్య పంచోలి తనను దాదాపు హౌస్‌ అరెస్టు చేసి వేధించాడని ఆమె తెలిపింది. ఆమె ఆరోపణలపై తాజాగా ఆదిత్య పంచోలి స్పందించాడు. కంగన ఒక పిచ్చి అమ్మాయి అని, తనను ఉద్దేశించి అబద్ధపు వ్యాఖ్యలు చేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పంచోలి హెచ్చరించాడు.

’తను ఒక పిచ్చి అమ్మాయి. ఆమె ఇంటర్వ్యూ చూశారా? ఆమె మాట్లాడుతుంటే పిచ్చిది మాట్లాడినట్టు అనిపించలేదు. ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్నాను. కానీ ఒకరి గురించి ఇంత క్రూరంగా మాట్లాడటం నేనెప్పుడు చూడలేదు. తన పిచ్చిది కాక ఏమంటాం. బురదలో రాళ్లు విసిరితే మన దుస్తులకే మరలంటుతాయి’ అని పంచోలి మీడియాతో పేర్కొన్నాడు. ఇప్పటికే హృతిక్‌తో కంగన చట్టపరమైన పోరాటం కొనసాగుతుండగా.. తాజాగా ఆమెపై కేసు వేస్తానని పంచోలి కూడా హెచ్చరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement