హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు | Aditya Pancholi to take legal action against Kangana Ranaut | Sakshi
Sakshi News home page

హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు

Published Tue, Sep 5 2017 12:58 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు

హీరోయిన్ పై ఫైర్ అయిన సీనియర్ నటుడు

బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల హృతిక్ తో తన రిలేషన్ కు సంబంధించి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఈ భామ, సీనియర్ నటుడు ఆదిత్య పంచోలీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా విమర్శలపై స్పందించిన నటుడు నిర్మాత ఆదిత్య పంచోలీ ఆమె మీద చట్టపరమైన చర్యలకు రెడీ అవుతున్నట్టుగా తెలిపారు.

'ఆమె పిచ్చిది, ఆమె ఇంటర్య్వూ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. నేను చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఉంటున్నాను. ఇంత వరకు మాపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. ఇతరుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నాకు అనవసరం. నాపై మా కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలు మమల్ని తీవ్రంగా బాధించాయి. మాపై వేసిన నిందలు నిరూపించమనండి, లేదంటే ఆమె మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అన్నారు ఆదిత్య పంచోలీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement