హీరోయిన్ కంగనా రనౌత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్ అనే పదమే. కెరీర్ తొలినాళ్లలో యాక్టింగ్ చేసింది గానీ తర్వాత తర్వాత మూవీస్ కంటే వివాదాల వల్లే పేరు తెచ్చుకుంది. రీసెంట్‌గా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది. కానీ గెలిచిన తర్వాత రోజే ఈమెకు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కంగన చెంప చెళ్లుమనిపించింది. ఈ విషయమై సోషల్ మీడియాలో భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.
(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)
గతంలో ఖలీస్థానీ ఉద్యమం గురించి కంగన చేసిన కామెంట్స్ వల్ల సదరు మహిళా అధికారి కంగన చెంపపై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు మహిళా అధికారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలైన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ తదితరులు మాత్రం కంగనకు జరిగిన అవమానంపై తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కంగనకు అండగా నిలబడుతున్నారు.
మిగతా వాళ్ల సంగతేమో గానీ తాజాగా సీఐఎస్ఎఫ్ అధికారికి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కంగన-హృతిక్ ప్రేమించుకున్నారు. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు మాజీ ప్రియురాలికి పరోక్షంగా హృతిక్ సపోర్ట్ చేయడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment