Lock Upp Show: Kangana Ranaut Talks About Hrithik Roshan Scandal On Her Show Viral - Sakshi
Sakshi News home page

Kangana Ranaut Show: అదో పెద్ద స్కామ్‌.. హృతిక్‌పై కంగనా సంచలన కామెంట్స్‌!

Published Sun, Apr 10 2022 3:06 PM | Last Updated on Sun, Apr 10 2022 4:46 PM

Kangana Ranaut Talks About Hrithik Roshan Scandal On Her Lock Upp Show - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం 'లాకప్‌' అనే షోను హోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ షో రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ఈ షోలో కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 'ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లయిన పురుషుల ఆకర్షణలో పడిపోతున్నారు. ఇది నా వ్యక్తిగత అనుభవం నుంచే చెబుతున్నాను. పెళ్లయి, పిల్లలున్న మగాళ్లు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు కట్టుకథలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తారు.

ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు, హీరోలు సైతం ఇలాంటి పనులు చేస్తూ అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు. ఇది నా జీవితంలో జరిగిన ఒక పెద్ద కుంభకోణం. వారు చాలా కథలు చెబుతుంటారు. అందువల్ల ఆ పెళ్లయిన వ్యక్తిని అతని భార్య నుంచి రక్షించగలిగేది తామేనని చాలామంది యువతులు భావిస్తారు.కానీ వారి భార్యల వైపు స్టోరీ వింటే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారు అని పేర్కొంది.

అయితే కంగనా చేసిన ఈ కామెంట్స్‌ ఆమె మాజీ ప్రియుడు హృతిక్‌ రోషన్‌ని ఉద్దేశించినవేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. గత కొంతకాలంగా హృతిక్‌ యంగ్‌ బ్యూటీ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కంగనా చేసిన ఈ కామెంట్స్‌ చర్చకు దారి తీస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement