Mandana Karimi Reveals Affair With Top Bollywood Director, Planning Pregnancy - Sakshi
Sakshi News home page

Mandana Karimi : 'భర్త నుంచి విడిపోయాక ఆ డైరెక్టర్‌తో రిలేషన్‌షిప్‌.. మోసం చేశాడు'

Published Sun, Apr 10 2022 3:56 PM | Last Updated on Sun, Apr 10 2022 5:46 PM

Mandana Karimi Reveals Affair With Director Planning Pregnancy - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్‌. ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను బయటపెట్టి షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకునేందుకు మోడల్‌, నటి మందనా కరిమి భయటపెట్టిన సీక్రెట్‌ అందరిచేత కంటతడి పెట్టించింది.

'ఓ ప్రముఖ డైరెక్టర్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. నా భర్త నుంచి విడిపోయాక ఈ ప్రముఖ దర్శకుడితో నాకు సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌ ఏర్పడింది. అతను చాలా ఫేమస్‌. మహిళల మక్కుల గురించి మాట్లాడే అతడి ఆదర్శ భావాలు నచ్చి తనతో సంబంధం కంటిన్యూ చేశాను. ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేశాం. కానీ ఆ తర్వాత నన్ను ఒంటరిదాన్ని చేసి వదిలేశాడు అంటూ కన్నీరుమున్నీరైంది. 

ఆ షాక్‌ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని, ఆ సమయంలో స్నేహితులు, సన్నిహితులు తనకు మద్దతుగా నిలిచారని పేర్కొంది. కాగా 2017లో వ్యాపారవేత్త గౌరవ్‌ గుప్తాతో మందనా వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ఫేమస్‌ డైరెక్టర్‌తో సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నానని చెప్పిన మందనా అతను ఎవరన్నది మాత్రం చెప్పలేదు. చదవండి: పెళ్లయిన హీరోలు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement