Mandana Karimi
-
గర్భం దాల్చాక ముఖం చాటేశాడు, అతడు మీరనుకుంటున్న వ్యక్తి కాదు!
సెలబ్రిటీల సీక్రెట్లు బయటపెడుతూ సంచలనాలు సృష్టిస్తోంది లాకప్ షో. కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న లాకప్ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయింది నటి మందనా కరిమి. అయితే షోలో ఉన్న సమయంలో తన గురించి ఓ సీక్రెట్‌ను బయటపెట్టిందామె. భర్త నుంచి విడిపోయాక బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడితో నాకు పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశి తీరా ముఖం చాటేశాడని షోలో వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అతడు మరెవరో కాదు అనురాగ్ కశ్యప్ అంటూ కొందరు దుష్ప్రచారం చేశారు. తాజాగా దీనిపై మందనా స్పందించింది. అనురాగ్ నా స్నేహితుడు, ఇప్పటికీ మేము మంచి మిత్రులం. వార్తల్లో అతడి పేరు చూసి షాకయ్యాను. ఇది అనైతికం. అనవసరంగా అతడి పేరు ప్రచారం చేసి వార్తలు సృష్టిస్తున్నారు. షోలో నేను చెప్పింది నిజమే. కానీ దానికి మసాలా యాడ్ చేస్తున్నారు. మాటలు మారుస్తున్నారు. నేను చెప్పని పేర్లను వార్తల్లో చొప్పిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మీరు నోటికొచ్చిన పేరు చెప్పి వారి జీవితాలతో చెలగాటమాడతారా? ఇది నిజంగా బాధాకరం. మరోసారి చెప్తున్నా, నేను సహజీవనం చేసింది నా స్నేహితుడితో కాదు అని అసత్య ప్రచారంపై మండిపడింది మందనా. చదవండి: నోటి దురుసుతో వార్తల్లోకి, ఆపై సారీ చెప్పిన నటుడు అక్షయ్‌పై ట్రోలింగ్, మెట్టు దిగి సారీ చెప్పిన హీరో -
ప్రెగ్నెన్సీ తర్వాత ఆ డైరెక్టర్ ముఖం చాటేశాడు : నటి
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. ఈ షోలో కంటెస్టెంట్లు సంచలనాత్మక సీక్రెట్లు బయటపెడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎలిమినేషన్ నుంచి గట్టెక్కడం కోసం ఇన్నాళ్లుగా దాచిపెట్టిన రహస్యాలను బయటపెట్టి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు మోడల్, నటి మందనా కరిమి భయటపెట్టిన సీక్రెట్ అందరిచేత కంటతడి పెట్టించింది. 'ఓ ప్రముఖ డైరెక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. నా భర్త నుంచి విడిపోయాక ఈ ప్రముఖ దర్శకుడితో నాకు సీక్రెట్ రిలేషన్షిప్ ఏర్పడింది. అతను చాలా ఫేమస్. మహిళల మక్కుల గురించి మాట్లాడే అతడి ఆదర్శ భావాలు నచ్చి తనతో సంబంధం కంటిన్యూ చేశాను. ఆ టైంలోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం. కానీ ఆ తర్వాత నన్ను ఒంటరిదాన్ని చేసి వదిలేశాడు అంటూ కన్నీరుమున్నీరైంది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని, ఆ సమయంలో స్నేహితులు, సన్నిహితులు తనకు మద్దతుగా నిలిచారని పేర్కొంది. కాగా 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాతో మందనా వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కొన్నాళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ఫేమస్ డైరెక్టర్‌తో సీక్రెట్ రిలేషన్లో ఉన్నానని చెప్పిన మందనా అతను ఎవరన్నది మాత్రం చెప్పలేదు. చదవండి: పెళ్లయిన హీరోలు అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారు View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
నిర్మాతపై నటి సంచలన వ్యాఖ్యలు
షూటింగ్ సమయంలో నిర్మాత తనను మానసికంగా వేధించాడని ఇరానీ నటి, బిగ్‌బాస్ ఫేం మందనా కరీమి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాత ప్రవర్తించిన తీరు తననెంతో బాధపెట్టిందని వాపోయారు. ప్రస్తుతం మందనా సన్నీలియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కోకో కోలా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. కోకో కోలా సినిమా నిర్మత మహేంద్ర ధరివాల్, అతని కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేశారు. ఇదంతా కోకో కోలా సినిమా షూటింగ్ చివరి రోజు అయిన దీపావళి ముందు రోజు సెట్లో చోటుచేసుకుందని నటి తెలిపారు. చదవండి: అది నా సినిమా టైటిల్.. ఇచ్చేయ్ ఇటీవల ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘గతేడాది నుంచి కోకో కోలా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూట్లో పాల్గొన్న నేను మొదటి నుంచి చిత్ర యూనిట్ మొత్తానితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా నిర్మాత మహేంద్ర ధరివాల్.. ఎవరైతే సెట్లో పూర్తి అహంకార భావం, ఆధిపత్యం చెలాయించే వ్యక్తి. ఈ వ్యక్తితో ముఖ్యంగా నవంబర్ 13న చేదు అనుభావాన్ని ఎదుర్కొన్నాను. షెడ్యూల్ ప్రకారం దీపావళి ముందు రోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి నా షూటింగ్ చివరి రోజు. అయితే సినిమాలో ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయని.. అందుకు మరో గంట సెట్లోనే ఉండాలని నిర్మాత అన్నారు. కానీ నాకు అదే సమయంలో వేరే మీటింగ్స్ ఉండటంతో కుదరదని చెప్పాను. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత క్యారీవాన్‌లోకి వచ్చి డ్రెస్ మార్చుకుంటున్నా. చదవండి: ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి వెంటనే నిర్మాత నేరుగా క్యారీవాన్‌లోకి వచ్చి నాపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. నేను బట్టలు మార్చుకుంటున్నా. కాసేపు బయట ఉండండి అని చెప్పిన వినలేదు. క్యారీ వాన్లోనే అరుస్తూ.. ‘నా మాట దాటి బయటకు వెళ్లలేవు. నేను నీకు ఒక గంట ఎక్కువ పని చేయమని అడిగాను. నువ్వు నా మాట విని తీరాలి. ఎందుకంటే నేను నిర్మాత. నీకు డబ్బులు ఇచ్చే వ్యక్తిని’ అని అరుస్తూ తన కొడుకుతో కలిసి అక్కడంతా సీన్ క్రియేట్ చేశాడు. ఆయన అరుపులు విని సెట్లోని వారందరూ నన్ను ఇబ్బందిగా చూశారు. ఒక అర్టిస్ట్‌తో ప్రవర్తించే విధానం ఇదేనా.. అందులోనూ ఒక మహిళతో ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం’’. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మందనా వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత మహేంద్ర నటి మాటలను ఖండించారు. షూటింగ్ చివరి రోజు మందనాకు రాత్రి 9 గంటల వరకు షిఫ్ట్ ఉందని, కానీ తను గంట ముందే వెళ్తానని గొడవ చేసిందన్నారు. ఇంకో గంట ఉండాని అభర్ధించినట్లు తెలిపారు. తనను అడిగే వ్యాన్‌లోకి వచ్చానని, అయినప్పటికీ తన మాటలు పెడచెవిన పెట్టి, వీడియోలు తీయడం ప్రారంభించిందని, అందుకే గట్టిగా చెప్పానన్నారు. అంతేగాక ఈ సినిమా ప్రాజెక్టు కోసం ముందుగా తనతో 7 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు, కానీ తనతో చివరికి 17 లక్షలు వసూలు చేసిందని అన్నారు. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చినా తనకు బాధ లేదని కానీ తమతో ఇలా భాద్యతరాహిత్యంగా ప్రవర్తించడం కరెక్టు కాదని హెచ్చరించారు. -
నాకు ఇల్లు కూడా లేదు: నటి
ఇండస్ట్రీలో ప్రతి రోజూ సవాలుతో కూడుకున్నదేనని.. ఒక్కసారి బ్రేక్ తీసుకుంటే మళ్లీ అక్కడ స్థానం సంపాదించడం అంత సులువు కాదన్నారు బాలీవుడ్ నటి మందనా కరిమి. గ్లామర్ ఫీల్డ్‌లో అడుగుపెట్టాలని చాలా మంది కలలు కంటారని.. అయితే ఒత్తిడిని తట్టుకుంటేనే నెగ్గుకురాగలమనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా అవకాశాలు లేక తాను ఇబ్బందులు పడుతున్నానని పేర్కొన్నారు. ఒక్కరాత్రిలోనే తన జీవితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా తెరకు దూరమైన మందన జీ5 షో ది కాసినో ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. జూన్ 12 విడుదల కానున్న ఈ షోలో కరణ్వీర్ బోహ్రా, సుదాంశు పాండే వంటి టీవీ స్టార్లు నటించారు. (చిన్న వయస్సులోనే నిర్ణయం తీసుకున్నా: భూమి) ఈ క్రమంలో తన పునరాగమనం గురించి మందన జూమ్‌తో మాట్లాడుతూ.. ‘‘ ఇండస్ట్రీలో మన స్థానం పదిలంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతీ రోజూ ఓ కొత్త సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేసే వీలు ఉంటుంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఇంకో విషయం ముంబైలో బతకడం చాలా కష్టం. ఇక్కడ ప్రతీదీ ఖరీదైనదే. ఇప్పుడు నాకు ఉండేందుకు ఇల్లు కూడా లేదు. నేను చాలా కుంగిపోయాను. అయితే నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలబడుతున్నారు. వారి ప్రోత్సాహంతోనే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. చేదు అనుభవాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాను. ఒకప్పుడు ఇండస్ట్రీ నుంచి పారిపోవాలనుకున్నా. ఇప్పుడు మాత్రం నా ఆలోచన మారింది. మనల్ని మళ్లీ పిలిచినపుడు వెళ్లడంలో తప్పు లేదనిపించింది’’అని చెప్పుకొచ్చారు. కాగా మందన రియాలిటీ షో బిగ్‌బాస్‌తో పాటుగా క్యా కూల్ హై హమ్ 3 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారంటూ వార్తలు ప్రచారం కాగా.. తనకు వైరస్ సోకలేదని పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించారు.(నాకు కరోనా సోకలేదు.. కానీ: నటి) -
రక్త నాళాలు ఉబ్బిపోయాయి: నటి
ముంబై: తనకు ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) సోకలేదని నటి మందనా కరిమి స్పష్టం చేశారు. అయితే తాను కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని పేర్కొన్నారు. కాగా కొన్నిరోజులుగా మందన కరోనా బారిన పడినట్లు రూమర్లు ప్రచారమయ్యాయి. ఈ క్రమంలో అభిమానులు ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వార్తలపై స్పష్టతనివ్వాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన మందన కరిమి.. తన పట్ల ఇంతటి ప్రేమ కురిపిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. (రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి మృతి) ‘‘ నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు. కంటికి ఇన్ఫెక్షన్ సోకిందంతే. అందుకే రక్తనాళాలు ఇలా ఉబ్బిపోయాయి. రోజూ ఇంటిని శుభ్రం చేసేందుకు, రసాయనాలు చల్లేందుకు సమయాన్ని కేటాయిస్తున్నా. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా జరిగింది. డాక్టర్ దగ్గరికి వెళ్లాను. అన్నట్లు నాకు కరోనా సోకలేదు. ప్రేమను పంచండి. సంతోషంగా ఉండండి. నెగటివ్‌గా ఉండేవాళ్లను మనం పట్టించుకోకూడదు’’అని మందన చెప్పుకొచ్చారు. కాగా మోడల్‌గా కెరీర్ ఆరంభించిన మందన.. రాయ్, భాగ్ జానీ, క్యా కూల్ హై హమ్ 3 వంటి సినిమాల్లో నటించారు. అదే విధంగా హిందీ బిగ్‌బాస్-9లో రన్నరప్‌గా నిలిచి ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇష్క్బాజ్ సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. ఇక 2017లో వ్యాపారవేత్త గౌరవ్ గుప్తాను పెళ్లాడిన మందన.. గతంలో భర్తపై గృహహింస కేసు పెట్టారు. అనంతరం కేసును విత్‌డ్రా చేసుకున్నారు.(పెళ్లి పేరుతో మోసం చేశాడు) View this post on Instagram The ugly Thruth ❤️ #quarantine #life A post shared by Mandanakarimi (@mandanakarimi) on May 25, 2020 at 11:22pm PDT -
నార్త్‌లో సౌత్ నవ్వులు
బ్రహ్మానందం, సునీల్ తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్నారు. ఈ ఇద్దరూ సీన్లో ఉంటే పంచ్‌లు, సెటైర్లు పేలుతూనే ఉంటాయి. లేటెస్ట్గా వీళ్లిద్దరూ బాలీవుడ్ ఆడియన్స్‌నూ నవ్వించడానికి ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్నారని తెలిసింది. సన్నీ లియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో ఓ హారర్–కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సాందు నిర్మాతలు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ నటిస్తే బావుంటుందని భావించిన చిత్రబృందం వీళ్లను ఎంపిక చేసిందట. వచ్చే నెలలో బ్రహ్మానందం షూట్లో జాయిన్ కాబోతున్నారు. సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సో.. వీరిద్దరూ నార్త్ ఆడియన్స్‌నూ నవ్వుల్లో ముంచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన నటి
ముంబై: 'బిగ్‌బాస్-9' పోటీదారు, మోడల్, నటి మందనా కరిమీ భర్త గౌరవగుప్తాపై గృహహింస కేసు నమోదు చేసింది. వీరు గత జనవరి 25న పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలలు తిరగకముందే వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. తన జీవనవ్యయానికిగాను భర్త గౌరవ్ ప్రతి నెలా రూ. 10 లక్షలు చెల్లించాలని, తనను మానసికంగా వేధించి క్షోభకు గురిచేసినందుకు, తన కెరీర్‌కు, బిజినెస్‌కు నష్టం కలిగించినందుకు రూ. 2 కోట్లు పరిహారం ఇవ్వాలని ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను హిందూమతంలోకి మారాల్సిందిగా భర్త గౌరవ్ ఒత్తిడి తెచ్చాడని, పెళ్లయిన తర్వాత నటనను వదిలిపెట్టాలని, ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని ఇరాన్‌కు చెందిన ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అత్త కూడా తనను వేధించినట్టు ఆమె తెలిపారు. 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తవాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అని ఆమె మీడియాకు తెలిపింది. ఈ వ్యవహారాన్ని కోర్టు ఆదేశాల ప్రకారమే తేల్చుకుంటామని ఆమె లాయర్ చెప్పారు. ఈ విషయమై స్పందించడానికి గౌరవ్ గుప్తా పీఆర్ నిరాకరించారు.