![Telugu comedy actors Brahmanandam & Sunil Varma in Sunny leone movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/11/brahma.jpg.webp?itok=HYRMcWCu)
బ్రహ్మానందం, సునీల్
బ్రహ్మానందం, సునీల్ తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్నారు. ఈ ఇద్దరూ సీన్‌లో ఉంటే పంచ్‌లు, సెటైర్‌లు పేలుతూనే ఉంటాయి. లేటెస్ట్‌గా వీళ్లిద్దరూ బాలీవుడ్ ఆడియన్స్‌నూ నవ్వించడానికి ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్నారని తెలిసింది. సన్నీ లియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో ఓ హారర్–కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సాందు నిర్మాతలు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ నటిస్తే బావుంటుందని భావించిన చిత్రబృందం వీళ్లను ఎంపిక చేసిందట. వచ్చే నెలలో బ్రహ్మానందం షూట్‌లో జాయిన్ కాబోతున్నారు. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సో.. వీరిద్దరూ నార్త్ ఆడియన్స్‌నూ నవ్వుల్లో ముంచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment