comedy film
-
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
డెవిల్స్ ఎట్ వర్క్
మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించాను అన్నారు నటి రాధికా శరత్ కుమార్. దీపక్ సౌందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారామె. విజయ్ సేతుపతి, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఆదివారం చిత్రీకరణలో పాల్గొన్నారు రాధిక. తాప్సీతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసి, ‘డెవిల్స్ ఎట్ వర్క్’ (పనిలో ఉన్న దెయ్యాలు) అని కామెంట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కొద్దిమంది చిత్రబృందంతో జరుగుతోంది. 80 శాతం చిత్రీకరణ ఇక్కడే పూర్తి చేయనున్నారట. ఏడాది చివరి కల్లా సినిమాను పూర్తి చేస్తారట కూడా. -
నార్త్‌లో సౌత్ నవ్వులు
బ్రహ్మానందం, సునీల్ తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్నారు. ఈ ఇద్దరూ సీన్లో ఉంటే పంచ్‌లు, సెటైర్లు పేలుతూనే ఉంటాయి. లేటెస్ట్గా వీళ్లిద్దరూ బాలీవుడ్ ఆడియన్స్‌నూ నవ్వించడానికి ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతున్నారని తెలిసింది. సన్నీ లియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో ఓ హారర్–కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సాందు నిర్మాతలు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ నటిస్తే బావుంటుందని భావించిన చిత్రబృందం వీళ్లను ఎంపిక చేసిందట. వచ్చే నెలలో బ్రహ్మానందం షూట్లో జాయిన్ కాబోతున్నారు. సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సో.. వీరిద్దరూ నార్త్ ఆడియన్స్‌నూ నవ్వుల్లో ముంచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!
రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్, క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న కంగనా.. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్... కట్ అని చెబుతానంటోంది. క్రిష్ దర్శకత్వంలో తాను చేస్తున్న 'మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా తర్వాత ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని, అది కామెడీ అవుతుందని కంగనా ఖరారు చేసింది. మణికర్ణిక పోస్టర్ విడుదల అనంతరం ఆమె వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. రాణీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించే అవకాశం వచ్చిన తర్వాత.. తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని, అందుకే ఇప్పుడు తనకు ఎంతో ప్యాషన్ అయిన దర్శకత్వం వైపు వెళ్తున్నానని 30 ఏళ్ల కంగన తెలిపింది. తాను 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశానని, ఏదైనా సాధించినట్లు ఎప్పటికి ఫీలవుతానో అప్పటికి ఏమీ తెలియదని, ఇన్నాళ్లకు తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని చెప్పింది. విజయాలు, పరాజయాలు అన్నీ చూసి తాను అన్నీ సాధించేశానని అనుకోడానికి ముందే దర్శకత్వం వైపు కూడా వెళ్తున్నట్లు వివరించింది. ఇక నటనతో సమయం ఎక్కువగా వేస్ట్ చేసుకోనని, అయితే దర్శకత్వం వహిస్తూనే తన సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. అందుకే క్రిష్‌తో 'నా చిట్టచివరి డైరెక్టర్ మీరే' అని చెప్పేశానంది. తనకు నటిగా కంటే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టమంది. -
అంతకన్నా వేరే కిక్కేముంటుంది!
లగడపాటి శ్రీధర్ సంచలన విజయం సాధించిన కామెడీ చిత్రం ‘ఎవడి గోల వాడిదే’కి సీక్వెల్ తీయాలని ఉందంటున్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అలాగే ‘స్టైల్’ చిత్రాన్ని నాయికా ప్రాధాన్యంగా తీయాలన్నది తన కల అని ఆయన చెప్పారు. నేడు శ్రీధర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన ఈ విధంగా చెప్పారు.నిర్మాతగా రంగప్రవేశం చేసి, ఈ ఏడాదితో పదేళ్లయ్యింది. ‘క్రియేటివ్ వరల్డ్’లో ఉండటంవల్లనో ఏమో సమయం గడిచిపోతున్నట్టే అనిపించడంలేదు. - నాకైతే పదేళ్ల వయసు తగ్గిందేమో అనిపిస్తోంది. ఇలా వయసు తగ్గినట్లుగా అనిపించడానికి కారణం ఉంది. మేం తీసే సినిమాలు 16ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న వారి చుట్టూ తిరిగేవే. దాంతో ట్రెండ్‌కి తగ్గ ఆలోచనలు, చర్చలు జరుగుతుంటాయి. ఇక, అంతకన్నా కిక్కేముంటుంది. అందుకే అంటున్నా... ఎవరికైనా సరే వయసు తరగాలంటే సినిమా రంగంలోకి రండి అని. - ప్రస్తుతం సుధీర్‌బాబు, నందితతో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ తీస్తున్నాను. కన్నడ ‘చార్మినార్’కి ఇది రీమేక్. ప్రేమకథా చిత్రాల్లో టైటానిక్ అంత గొప్పగా ఉండే సినిమా అవుతుంది. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నా. - ఇక నుంచి తమిళంలో లింగుస్వామి రూపొందించే చిత్రాలను తెలుగులో కూడా చేస్తా. ప్రస్తుతం సూర్య, సమంత జంటగా ఆయన రూపొందిస్తున్న ‘అంజాన్’ని ఏకకాలంలో తెలుగులో చేస్తున్నాం. దీన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకుంటున్నా. అలాగే లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నా. ఇందుకు బన్నీ, లింగుస్వామి ఇద్దరూ సుముఖంగా ఉన్నారు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లతో విడి విడిగా సినిమాలు తీయాలని ఉంది.