డెవిల్స్‌ ఎట్‌ వర్క్‌ | Radikaa Sarathkumar joins in Tapsee Vijay sethupathi next | Sakshi
Sakshi News home page

డెవిల్స్‌ ఎట్‌ వర్క్‌

Published Mon, Sep 7 2020 4:58 AM | Last Updated on Mon, Sep 7 2020 4:58 AM

Radikaa Sarathkumar joins in Tapsee Vijay sethupathi next - Sakshi

మళ్లీ సినిమా షూటింగ్‌ ప్రారంభించాను అన్నారు నటి రాధికా శరత్‌ కుమార్‌. దీపక్‌ సౌందరరాజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ కామెడీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారామె. విజయ్‌ సేతుపతి, తాప్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయింది. ఆదివారం చిత్రీకరణలో పాల్గొన్నారు రాధిక. తాప్సీతో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసి, ‘డెవిల్స్‌ ఎట్‌ వర్క్‌’ (పనిలో ఉన్న దెయ్యాలు) అని కామెంట్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో కొద్దిమంది చిత్రబృందంతో జరుగుతోంది. 80 శాతం చిత్రీకరణ ఇక్కడే పూర్తి చేయనున్నారట. ఏడాది చివరి కల్లా సినిమాను పూర్తి చేస్తారట కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement